ముగిసిన బ్యాడ్మింటన్ పోటీలు
నాదెండ్ల: చిలకలూరిపేట సాదినేని చౌదరయ్య హెల్త్ అండ్ రిక్రియేషన్ క్లబ్‌లో జరుగుతున్న నియోజకవర్గ స్థాయి బ్యాడ్మింటన్ డబుల్స్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. ఈ టోర్నమెంట్‌ను శనివారం రాత్రి ధనలక్ష్మి గ్రూపు సంస్థల కార్యదర్శి పేర్ని వీరనారాయణ, చిలకలూరిపేట అర్బన్ సీఐ బి.సురేష్‌బాబు ప్రారంభించారు. మొత్తం 56 టీములు పాల్గొన్నాయి. మొదటి స్థానాన్ని శ్రీనివాస ఇంటర్నేషనల్ అధినేత తాళ్ళ శ్రీనివాసరెడ్డి, డాక్టర్ మధు దక్కించుకున్నారు. వీరికి రూ.6 వేలు నగదు, షీల్డును బాలాజీ సీడ్స్ అధినేత నరేంద్ర అందించారు. రెండో బహుమతిని చిలకలూరిపేట ఆర్టీసీ కండక్టర్ మైనంపాటి సుబ్రహ్మణ్యం, నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ శేఖర్‌బాబు దక్కించుకున్నారు. వీరికి రూ.4 వేలు నగదు, షీల్డును ఎంఎస్ ఫ్యాషన్స్ అధినేత కొర్నెపాటి శ్రీనివాసరావు అందజేశారు. మూడో బహుమతిని సాదినేని చౌదరయ్య క్లబ్ క్రీడాకారులు కాకుమాను వెంకట్, కోటి సాధించారు. వీరికి రూ.3 వేలు నగదు, షీల్డును అడపా నాగసుబ్బారావు అందించారు. నాలుగో బహుమతిని చిలకలూరిపేట ఎన్‌ఎస్పీ కెనాల్స్‌లో పనిచేసే శ్రీనివాసరావు, అధ్యాపకుడు సుబ్బారావు సాధించారు. వీరికి రూ.2 వేలు నగదు, షీల్డును వెనిగళ్ళ శ్రీధర్ అందజేశారు. బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా గణపవరానికి చెందిన పృథ్వీ ఎంపికయ్యారు. ఆయనకు రూ.వెయ్యి నగదు, షీల్డును నిర్వాహకులు అందించారు.