చానమిల్లి ఆవులకు మూడు బహుమతులు
చానమిల్లి ఆవులకు మూడు బహుమతులు
Published Sun, Jan 8 2017 11:47 PM | Last Updated on Tue, Sep 5 2017 12:45 AM
చానమిల్లి (నిడమర్రు) : తూర్పుగోదావరి జిల్లా నామవరంలోని భారతీ విద్యాభవన్స్ లో జరిగిన అఖిలభారత అవుల, గేదెల అందాల పోటీల్లో చానమిల్లి సర్పంచ్ వెజ్జు రామారావుకు చెందిన ఆవులు 3 బహుమతులు గెలుచుకున్నాయి. ఈ పోటీలు మూడు రోజుల పాటు నిర్వహించారని రామారావు ఆదివారం చెప్పారు. సుమారు 250 పైగా ఆవులు పాల్గొన్న ఈ పోటీలు ఆదివారంతో ముగిసినట్టు తెలిపారు. వివిధ జాతి ఆవుల అందాల పోటీల్లో ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఆవులకు బహుమతులు లభించినట్టు చెప్పారు. ఆయన కుటుంబ సభ్యుల పేర్లపై ఆవులను పోటీల్లో నామినేషన్ చేయించినట్టు తెలిపారు. కొంగనూరు గిత్త అందాల పోటీల్లో వెజ్జు ఉమాదేవి గిత్త ద్వితీయ బహుమతి, కపిల గిత్త అందాల పోటీల్లో వెజ్జు ఆహాన్ గిత్తకు ద్వితీయ బహుమతి, ఒగోలు గిత్త ఆందాల పోటీల్లో వెజ్జు నరేష్ గిత్తకు ప్రత్యేక బహుమతి లభించినట్టు చెప్పారు. ఈ పోటీలు మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనా«థ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలిపారు.
Advertisement