namavaram
-
చానమిల్లి ఆవులకు మూడు బహుమతులు
చానమిల్లి (నిడమర్రు) : తూర్పుగోదావరి జిల్లా నామవరంలోని భారతీ విద్యాభవన్స్ లో జరిగిన అఖిలభారత అవుల, గేదెల అందాల పోటీల్లో చానమిల్లి సర్పంచ్ వెజ్జు రామారావుకు చెందిన ఆవులు 3 బహుమతులు గెలుచుకున్నాయి. ఈ పోటీలు మూడు రోజుల పాటు నిర్వహించారని రామారావు ఆదివారం చెప్పారు. సుమారు 250 పైగా ఆవులు పాల్గొన్న ఈ పోటీలు ఆదివారంతో ముగిసినట్టు తెలిపారు. వివిధ జాతి ఆవుల అందాల పోటీల్లో ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఆవులకు బహుమతులు లభించినట్టు చెప్పారు. ఆయన కుటుంబ సభ్యుల పేర్లపై ఆవులను పోటీల్లో నామినేషన్ చేయించినట్టు తెలిపారు. కొంగనూరు గిత్త అందాల పోటీల్లో వెజ్జు ఉమాదేవి గిత్త ద్వితీయ బహుమతి, కపిల గిత్త అందాల పోటీల్లో వెజ్జు ఆహాన్ గిత్తకు ద్వితీయ బహుమతి, ఒగోలు గిత్త ఆందాల పోటీల్లో వెజ్జు నరేష్ గిత్తకు ప్రత్యేక బహుమతి లభించినట్టు చెప్పారు. ఈ పోటీలు మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనా«థ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలిపారు. -
మానవ మృగం
ఏడేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం నామవరంలో ఘటన పోలీసులకు బంధువుల ఫిర్యాదు అదుపులో నిందితుడు పాయకరావుపేట: కామంతో కళ్లు మూసుకుపోయిన ఒక వ్యక్తి తన కూతురు వయసున్న ముక్కుపచ్చలారని ఏడేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అభంశుభం తెలియని ఆ చిన్నారి అతని వికృతచేష్టలకు భయపడి కేకలు వేయడంతో ఉడాయించాడు. పాయకరావుపేట మండలం నామవరం గ్రామంలో మంగళవారం రాత్రి జాతీయరహదారి పక్కనే ఈ సంఘటన జరిగింది. బాలిక బంధువులు పోలీసులకిచ్చిన ఫిర్యాదు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఏడేళ్ల చిన్నారి తల్లిదండ్రులు చనిపోయారు. అమ్మమ్మ, మేనమామ సంరక్షణలో ఉంటోంది. రాత్రి ఏడు గంటల సమయంలో జాతీయ రహదారి పక్కన ఉన్న కిరాణాషాపుకు పంపించారు. చిన్నారి చీకట్లో ఒంటరిగా రావడాన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన కోన రమణ అనే వ్యక్తి మాటువేసి చిన్నారికి మాయమాటలు చెప్పి జాతీయరహదారిని ఆనుకుని మంచినీటి చెరువుగ ట్టుపై ఉన్న మాంసం విక్రయించే పాకలోకి తీసుకెళ్లాడు. దుస్తులు తొలగించి వికృత చేష్టలకు పాల్పడడంతో ఏం జరుగుతుందో తెలియని చిన్నారి కేకలు వేసింది. అదే సమయంలో బాలి కను వెతుక్కుంటూ వచ్చిన అమ్మమ్మ, పిన్ని కేకలు విని అనుమానం వచ్చి పాకవైపు వెళ్లగా నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. బంధువులు స్థానికుల సహాయంతో రమణను పట్టుకుని 100 ఫోన్ నెంబరు ద్వారా పోలీసులకు సమాచారం చేరవేశారు. పాయకరావుపేట పోలీసులు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిపై అత్యాచార యత్నానికి ప్రయత్నించిన నిందితునిపై నిర్భయ చట్టప్రకారం కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని బాధితురాలి మేనమామ స్వామి బుధవారం పోలీసులకు ఫిర్యాదుచేశారు. కోన రమణపై అత్యాచారయత్నం కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ కుమార్ తెలిపారు. నిందితుడికి వివాహం అయింది. బాధితురాలి వయసున్న ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు తెలిసింది. గతంలోనూ ఇలాగే; రమణ గతంలో కూడా నక్కపల్లి మండలం సీతంపాలెం గ్రామంలో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నానికి యత్నించగా, స్థానికులు చూసి దేహశుద్ధి చేసి విడిచిపెట్టినట్టు తెలిసింది. అప్పట్లోనే కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించి ఉంటే ఇప్పుడు ఇలా జరిగి ఉండేది కాదని గ్రామస్తులు చెప్పారు. ఫిర్యాదు స్వీకరణలో జాప్యం : కంట్రోలు రూం ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు మంగళవారం రాత్రే నిందితుడిని అదుపులోకి తీసుకున్నప్పటికీ బుధవారం ఉదయం ఫిర్యాదు స్వీకరణలో పోలీసులు జాప్యం చేశారని బంధువులు ఆరోపించారు. ఉదయం పది గంటల సమయంలో బాధితురాలి మేనమామ స్వామి బంధువులతో కలిసి ఫిర్యాదు ఇచ్చేందుకు స్టేషన్‌కు వెళ్లారు. తాము నిరక్ష్యరాస్యులం కావడంతో వేరొకరితో రాయించి స్టేషన్లో ఇవ్వడానికి వెళ్తే ఫిర్యాదు రాసిన వ్యక్తినే తీసుకురావాలంటూ జాప్యం చేసి ఇబ్బందులు పెట్టినట్లు వాపోయారు. -
‘తల్లి’డిల్లిన హృదయం
నామవరం (రాజానగరం) : నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లికి వృద్ధాప్యంలో ఆసరాగా ఉండాల్సిన పిల్లలు ఆమెను గుడి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటన నామవరంలో జరిగిన మంగళవారం జరిగింది. దీనికి సంబంధించి మాజీ సర్పంచ్ బుడ్డిగ అప్పారావు స్థానిక విలేకరులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నామవరానికి చెందిన కాకుల బుల్లమ్మ(75)కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారికి పెళ్లిళ్లు చేసిన తరువాత భర్త చనిపోయాడు. మనుమలు, మనుమరాళ్లతో కాలం గడిపేయాలనుకున్న ఆమె ఆశలపై కుమార్తెలు నీళ్లు చల్లారు. పెద్ద కొడుకు వెంకట్రావు రెండేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోవడంతో చిన్న కొడుకు సూర్యచంద్రరావు వద్ద బుల్లమ్మ ఉండేది. ఆమె వద్ద రూ.లక్ష వరకు ఆస్తి ఉండడంతో తల్లిని తాము చూస్తామంటూ కుమార్తెలు కారింకి మంగాయమ్మ (సీతానగరం మండలం, ఉండేశ్వరపురం), అంగర దుర్గ (రాజానగరం మండలం, పుణ్యక్షేత్రం) తీసుకువెళ్లి ఆమెతో ఇంటి పనులు చేయించుకునేవారు. ఆమె వద్ద ఉన్న రూ. లక్ష వాడేసుకున్నారు. పెద్ద కుమార్తె మంగాయమ్మ సోమవారం రాత్రి ఉండేశ్వరపురం నుంచి ఆటోలో తల్లి బుల్లమ్మను నామవరం తీసుకువచ్చి గ్రామంలో చెరువు గట్టున ఉన్న రామాలయం వద్ద వదిలేసి వెళ్లిపోయింది. మంగళవారం ఉదయం విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు ఊర్లో ఉన్న చిన్నకొడుకు సూర్యచంద్రరావును పిలిచి తీసుకు వెళ్లమంటే అతడు నిరాకరించాడు. తన వద్దకు తీసుకురాకుండా ఇక్కడ వదిలేస్తే ఆమె వద్ద ఉన్న రూ. లక్ష ఏమైనట్టో చెప్పాలంటూ పట్టుబట్టాడు. దీంతో పంచాయతీ పెట్టి విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమయంలో పెద్ద కోడలికి నచ్చజెప్పి ఆమెతో ఆ వ ృద్ధురాలిని ఇంటికి పంపించారు. కుమారులు, కుమార్తెలు, కోడళ్లను పిలిచి విచారణ చేసి, వృద్ధురాలికి న్యాయం జరిగేలా చూస్తామని రాజానగరం సీఐ శంకర్‌నాయక్ తె లిపారు.