నామవరం (రాజానగరం) : నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లికి వృద్ధాప్యంలో ఆసరాగా ఉండాల్సిన పిల్లలు ఆమెను గుడి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటన నామవరంలో జరిగిన మంగళవారం జరిగింది. దీనికి సంబంధించి మాజీ సర్పంచ్ బుడ్డిగ అప్పారావు స్థానిక విలేకరులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నామవరానికి చెందిన కాకుల బుల్లమ్మ(75)కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారికి పెళ్లిళ్లు చేసిన తరువాత భర్త చనిపోయాడు. మనుమలు, మనుమరాళ్లతో కాలం గడిపేయాలనుకున్న ఆమె ఆశలపై కుమార్తెలు నీళ్లు చల్లారు.
పెద్ద కొడుకు వెంకట్రావు రెండేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోవడంతో చిన్న కొడుకు సూర్యచంద్రరావు వద్ద బుల్లమ్మ ఉండేది. ఆమె వద్ద రూ.లక్ష వరకు ఆస్తి ఉండడంతో తల్లిని తాము చూస్తామంటూ కుమార్తెలు కారింకి మంగాయమ్మ (సీతానగరం మండలం, ఉండేశ్వరపురం), అంగర దుర్గ (రాజానగరం మండలం, పుణ్యక్షేత్రం) తీసుకువెళ్లి ఆమెతో ఇంటి పనులు చేయించుకునేవారు. ఆమె వద్ద ఉన్న రూ. లక్ష వాడేసుకున్నారు. పెద్ద కుమార్తె మంగాయమ్మ సోమవారం రాత్రి ఉండేశ్వరపురం నుంచి ఆటోలో తల్లి బుల్లమ్మను నామవరం తీసుకువచ్చి గ్రామంలో చెరువు గట్టున ఉన్న రామాలయం వద్ద వదిలేసి వెళ్లిపోయింది.
మంగళవారం ఉదయం విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు ఊర్లో ఉన్న చిన్నకొడుకు సూర్యచంద్రరావును పిలిచి తీసుకు వెళ్లమంటే అతడు నిరాకరించాడు. తన వద్దకు తీసుకురాకుండా ఇక్కడ వదిలేస్తే ఆమె వద్ద ఉన్న రూ. లక్ష ఏమైనట్టో చెప్పాలంటూ పట్టుబట్టాడు. దీంతో పంచాయతీ పెట్టి విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమయంలో పెద్ద కోడలికి నచ్చజెప్పి ఆమెతో ఆ వ ృద్ధురాలిని ఇంటికి పంపించారు. కుమారులు, కుమార్తెలు, కోడళ్లను పిలిచి విచారణ చేసి, వృద్ధురాలికి న్యాయం జరిగేలా చూస్తామని రాజానగరం సీఐ శంకర్‌నాయక్ తె లిపారు.
‘తల్లి’డిల్లిన హృదయం
Published Wed, Aug 19 2015 1:37 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 AM
Advertisement