ఎడ్లబండ లాగుడు పోటీలు ప్రారంభం
దుర్గి: మండలంలోని ధర్మవరం గ్రామంలో శుక్రవారం శ్రీహరిహర బాలనాగేంద్రస్వామి వార్షిక మహోత్సవాల సందర్భంగా రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన ఎడ్లబండలాగుడు పోటీలను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. పోటీలలో సేద్యపు విభాగంలో 14 జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పీఆర్కే మాట్లాడుతూ చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు పాల్పడుతూ రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని, ప్రజలు టీడీపీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు. రైతులను ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని, రానున్న జగనన్న పాలనలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. కార్యక్రమంలో పోటీల నిర్వాహకులు కొత్తా వెంకటేశ్వర్లు, అరిగెల ఏడుకొండలు, గుండా వెంకటేశ్వర్లు, యరబోతుల శ్రీనివాసరావు, నల్ల వెంకటరెడ్డి, వెలిదండి గోపాల్, మొగిలి బాలశ్రీను, అడిగొప్పల చిన్నబ్బాయి, కర్నాటి సుబ్బారావు, బసవయ్యగారి శ్రీను తదితరులు పాల్గొన్నారు.