oxes
-
ఎడ్ల నాగలికి డిమాండ్.. రోజుకు రూ.3వేలు
జగిత్యాల అగ్రికల్చర్: వ్యవసాయంలో యాంత్రీకరణ పెరుగుతోంది. నాగళ్లు.. కాడెడ్లు కనుమరుగు అవుతుండగా సమయం ఆదాకోసం రైతులు సైతం యాంత్రీకరణ వ్యవసాయం వైపే చూస్తున్నారు. కాడెడ్లు, నాగలిపట్టే మట్టిమనుషులు కరువవుతున్నారు. దీంతో విత్తనాలు వేసేందుకు కాడెడ్లతో పాటు దున్నేందుకు మనిషిని కిరాయి తీసుకునే పరిస్థితి నెలకొంది. ఒక్కరోజు పసుపు, పత్తి వంటి విత్తనం వేసేందుకు మనిషికి నాగలితో సహా రూ.3వేల వరకు చెల్లిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కాడెడ్ల పోషణ నుంచి తప్పుకుంటున్న అన్నదాత ► గ్రామాల్లో ప్రతీరైతుకు కనీసం నాలుగైదు కాడెడ్లు ఉండేవి. కనీసం ఒక జత కాడెడ్లు లేనివారిని రైతులు అనేవారు కాదు. కాడెడ్లను అమ్ముకునేవారు కాదు. ప్రస్తుతం కాడెడ్లను పోషించే స్థోమత రైతులకు ఉన్నప్పటికీ, వాటికి నీరు పెట్టడం, మేత వేయడం వంటి పనులు చేయలేక అమ్మేస్తున్నారు. ► దుక్కి దున్నడం నుంచి పంటకోసే వరకు ప్రతీపని ట్రాక్టర్‌తో చేయడం, ఒక్కో గ్రామంలో పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఉండడం, వాటికి రకరకాల పరికరాలు తయారు చేసుకుని వినియోగిస్తున్నారు. నాలుగైదు ఎకరాలు ఉన్న రైతు ట్రాక్టర్ కొనుగోలు చేసి వ్యవసాయానికి వాడుతున్నారు. ► ప్రస్తుతం ఏ గ్రామంలో చూసిన పది జతల మించి కాడెడ్లు లేవు. దీంతో విత్తనం వేసేందుకు కాడెడ్లు ఉన్నవారివైపు మిగతా రైతులు చూసే పరిస్థితి నెలకొంది. గతంలో ఇరుగుపొరుగు వారు కలిసి విత్తనాలు వేసుకునేవారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటం, భూమిలో తేమ ఎక్కువైనా, తక్కువైనా విత్తనాలు వేయడం ఇబ్బందిగా మారడంతో కాడెడ్ల కోసం రైతులు వెతికకే పరిస్థితి నెలకొంది. ► ట్రాక్టర్‌తో పోల్చితే కాడెడ్ల నాగలితో విత్తనం వేస్తే, భూమిలో అనుకున్నంత లోతులో విత్తనం పడి, బాగా మొలకెత్తే అవకాశం ఉంటుంది. జగిత్యాల జిల్లా రైతులు ఎక్కువగా పసుపు విత్తనం వేసేందుకు కాడెడ్లపైనే ఆధారపడుతుండటంతో, ఎడ్ల నాగలికి గిరాకీ పెరిగింది. పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలోనూ పత్తివిత్తనాలు వేసేందుకు కాడెడ్లు ఉన్నవారిని ఆశ్రయిస్తున్నారు. ► కాడెడ్లు ఉన్నవారికి ముందే అడ్వాన్సులు ఇస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు దున్నితే రూ.3 వేలు ఇస్తున్నారు. మరికొంతమంది విత్తనాలు వేసేవరకు కేవలం కాడెడ్లను రూ.10–15 వేలకు కిరాయికి తీసుకొస్తున్నారు. ఎద్దుల జత ధర రూ.70వేల నుంచి రూ.80వేల వరకు ఉండటంతో కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. రూ.3వేలకు కిరాయికి తీసుకున్న పెద్దగా పనిలేక ఎడ్లను అమ్మిన. ఇప్పుడు పసుపు విత్తనం వేసేందుకు రూ.3 వేలకు కిరాయికి తీసుకున్నా. వారంరోజుల ముందే ఎడ్ల నాగలి మనిషికి అడ్వాన్సులు ఇవ్వాల్సిన పరిస్థితి. చాలా గ్రామాల్లో రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. – క్యాతం సాయిరెడ్డి, సింగరావుపేట, రాయికల్ ఎడ్లు దొరికే పరిస్థితి లేదు విత్తనం కోసం ఎడ్లు కొందామన్నప్పటికీ దొరికే పరిస్థితి లేదు. ఒక్కోజతకు రూ.80 వేల ధర ఉంది. దీంతో, విత్తనం వేసే వారం రోజులు ఎడ్ల నాగలిని కిరాయి తీసుకుంటున్నాను. మిగతా పనులు చేయడానికి ట్రాక్టర్ ఉపయోగిస్తాను. – రాంకిషన్, వెల్దుర్తి, జగిత్యాల రూరల్ -
రూ.లక్ష ఎద్దులు రూ.50 వేలకే
కర్ణాటక ,కెలమంగలం: క్రిష్ణగిరి జిల్లాలోనే కాక కర్ణాటకలోని కోలారు జిల్లాలో కూడా ఈ ఏడాది కరువు పీడించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరువుతో పశువులకు మేత, తాగునీరు అందక పోవడంతో రైతులు పశువులను కెలమంగలం సంతలో విక్రయాలకు తరలించారు. కెలమంగలంలో ప్రతి ఆదివారం వారసంత జరుగుతుంది. ఈ సంతలో పశువుల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతాయి. తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వ్యాపారులు పశువులను కొనుగోళ్లకు వస్తుంటారు. కోలారు, క్రిష్ణగిరి, బెంగళూరు గ్రామీణ జిల్లాల నుండి రైతులు పశువులను విక్రయించేందుకు తీసుకొస్తారు. ఆదివారం సంతలో 800కు పైగా పశువులు విక్రయాలకు వచ్చాయి. రూ. లక్ష విలువ చేసే జత ఎద్దులు రూ. 50 వేలుకు అమ్మేందుకు రైతులు సిద్ధమైనా కొనుగోలుదారులు లేకపోయారు. పశుగ్రాసం కొరత వర్షాలు లేక , పొలం పనులు లేక, ఇంట్లో గ్రాసం కరువై భారంగా భావించి తక్కువ ధరలకే పశువులను రైతులు తెగనమ్ముతున్నారు. గత ఏడాది జిల్లా మంత్రి బాలక్రిష్ణారెండ్డి కరువు వల్ల పశుగ్రాసం కొరతతో ప్రభుత్వం ద్వారా ఉచితంగా పశుగ్రాసం సరఫరా చేశారని, ఈసారి పట్టించుకొనే నాథుడే లేదని సంతలో రైతులు వాపోతున్నారు. గత నాలుగేళ్లుగా వర్షాలు అంతంత మాత్రమేనని, ప్రస్తుతం పరిస్థితి మరింత దారుణమని తెలిపారు. అధికారులు ఉచితంగానో, డబ్బుకో పశుగ్రాసం సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. -
దీనస్థితిలో కాడెద్దులుగా మారిన రైతులు
-
ఎడ్లబండ లాగుడు పోటీలు ప్రారంభం
దుర్గి: మండలంలోని ధర్మవరం గ్రామంలో శుక్రవారం శ్రీహరిహర బాలనాగేంద్రస్వామి వార్షిక మహోత్సవాల సందర్భంగా రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన ఎడ్లబండలాగుడు పోటీలను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. పోటీలలో సేద్యపు విభాగంలో 14 జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పీఆర్కే మాట్లాడుతూ చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు పాల్పడుతూ రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని, ప్రజలు టీడీపీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు. రైతులను ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని, రానున్న జగనన్న పాలనలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. కార్యక్రమంలో పోటీల నిర్వాహకులు కొత్తా వెంకటేశ్వర్లు, అరిగెల ఏడుకొండలు, గుండా వెంకటేశ్వర్లు, యరబోతుల శ్రీనివాసరావు, నల్ల వెంకటరెడ్డి, వెలిదండి గోపాల్, మొగిలి బాలశ్రీను, అడిగొప్పల చిన్నబ్బాయి, కర్నాటి సుబ్బారావు, బసవయ్యగారి శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
వృషభాలపై మమకారం
పుట్లూరు : వ్యవసాయ రంగంలో ఇంత కాలం కీలకంగా ఉన్న పశుసంపదపై పుట్లూరు మండల వాసులు మమకారాన్ని వీడలేకున్నారు. పంట సాగులో సేద్యం మొదలు... దిగుబడులు ఇంటికి.... అనంతరం మార్కెట్‌కు చేర్చే వరకూ తమ కష్టంలో పాలు పంచుకున్న వృషభాలను ఇక్కడి రైతులు ప్రత్యేకంగా చూస్తుంటారు. ఎంతగా అంటే ఆఖరుకు అవి కాలం చేసిన తర్వాత సగౌరవంగా ఖననం చేసి, సమాధులు కట్టి పూజిస్తున్నారు. వృlషభాలు లేనిదే ఒక్కప్పుడు సేద్యం చేయలేకపోయేవారు. రైతు అనేబడే ప్రతి ఒక్కరి ఇంటిలోనూ ఓ జత వృlషభాలు తప్పనిసరిగా ఉండేవి. అయితే వర్షాభావ పరిస్థితులతో కరువు ఛాయలు నెలకొనడంతో వాటిని పోషించుకోలేక రైతులు మదనపడుతూ వచ్చారు. అర్ధాకలితో అలమటిస్తున్న పశుసంపదను కాపాడుకునే మార్గం కానరాక... మరోకరి పంచనైనా వాటికి గ్రాసం దక్కుతుందన్న ఆశతో మనసు చంపుకుని విక్రయాలు సాగించారు. అయితే తమ ఆశయాలను వమ్ము చేస్తూ మధ్య దళారీలు పశుసంపదను కబేళాలకు తరలిస్తుండడంతో అన్నదాతలు కంగు తిన్నారు. దీంతో ఎంతటి కష్టనైనా భరిస్తూ తమ వద్ద ఉన్న పశువులు బతికున్నంత వరకూ మంచిగా చూసుకుంటూ... అవి కాలం చేసిన తర్వాత ఖననం చేసి, సమాధులు కట్టారు. పుట్లూరు గ్రామ పొలాల్లో ఇలాంటి సమాధులు కొకొల్లలుగా కనిపిస్తున్నాయి. -
అంగట్లో అద్దెకు ఎడ్లు
బాల్కొండ, న్యూస్‌లైన్ : ఇప్పుడు ఎడ్లు కూడా అంగట్లో అద్దెకు దొరుకుతున్నాయి. ఖరీప్ సీజన్ ముంచుకు వస్తుండటంతో రైతులు విత్తనాలు వేసేందుకు వీటిని ముందస్తుగా అద్దెకు తీసుకుంటున్నారు. మండల కేంద్రంలో గురువారం జరిగిన సంతలో చాలామంది రైతులు ఎడ్లను కొనుగోలు చేయకుండా అద్దెపైనే తీసుకెళ్లారు. గత ఏడాది నెలవారీగా కిరాయిపై ఇచ్చేవారు. ఈ ఏడాది నుంచి సంవత్సరం లెక్కన గుత్తాగా అద్దెకు ఇస్తున్నారు. ఇప్పటి నుంచి ఖరీప్ విత్తనాలు వేయడం పూర్తయ్యే వరకు ఎడ్లను తీసుకెళ్తే 10 వేలు చెల్లించాలి. ఎడ్లు మార్కెట్లో విక్రయిస్తే ఎంత ధర పలుకుతుందో అంత సొమ్మును వ్యాపారి వద్ద డిపాజిట్ ఉంచాలని నిబంధన పెడుతున్నారు. పశుగ్రాసం కొరతతో పశుగ్రాసం కొరత వల్ల సన్న, చిన్నకారు రైతులు తమ పశువులను సాకటం కష్టమవ్వడంతో ముందుగానే విక్రయించుకున్నారు. ప్పుడు వ్యవసాయ పనులు దాదాపు యంత్రాలతోనే చేపడుతున్నారు. రైతు ఇంట సిరులు కురిపించె పసుపు పంటను విత్తాలంటే తప్పనిసరిగా రైతు నాగలి పట్టి దుక్కి దున్నాల్సిందే. ఇందుకోసం రైతులు ఎడ్లను అద్దెకు తీసుకుంటున్నారు. అద్దెకు తీసుకుపోయిన ఎడ్ల మేత, అవి ఉండటానికి నివాసం అంతా రైతులే ఏర్పాటు చేసుకోవాలి. అంగట్లో నుంచి పశువులను తీసుకెళ్లేప్పుడు ఎట్లా ఉన్నాయో.. అప్పగించేప్పుడు అట్లాగే ఉండాలి. వాటికి ఏదైనా ప్రమాదం జరిగితే డిపాజిట్ తిరిగి ఇవ్వరు. వ్యాపారులు ఇన్ని నిబంధనలు పెట్టినా రైతులు ఎడ్లను కిరాయికి తీసుకుపోతున్నారు. ఎడ్లను గుత్తగా అద్దెకు తీసుకోవాలని నిబంధన లేదు. అవసర నిమిత్తం ఎనిమిది రోజుల నుంచి నెలరోజుల వరకు తీసుకెళ్లవచ్చు. పసుపు పంట సాధారణంగా జూన్ మధ్యలో నుంచి విత్తుతారు. ఒకే రైతుకు ఎనిమిది రోజుల పాటు పసుపు విత్తె అవసరం ఉండదు. కనుక ముగ్గురు నుంచి నలుగురు రైతులు కలిసి రెండు ఎడ్లను అద్దెకు తీసుకుం టున్నారు. యంత్రాలను, వాహనాలను అద్దెకు ఇచ్చినట్లు.. మూగ జీవాలను సైతం కిరాయి ఇవ్వడం విచారకరమే. ఒకప్పుడు పాడితో వ్యవసాయాన్ని చేసుకునే రైతు ఇప్పుడు కిరాయి పశువులతో సాగుచే యడం బాధాకరమే.