అంతర్ కళాశాలల టెన్నిస్ విజేతలు వీరే
అంతర్ కళాశాలల టెన్నిస్ విజేతలు వీరే
Published Sat, Oct 1 2016 6:13 PM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
గుంటూరు స్పోర్ట్స్: హిందూ కళాశాల అధ్వర్యంలో స్థానిక బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ టెన్నిస్ కోర్టుల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ అంతర్ కళాశాలల పురుషుల టెన్నిస్ పోటీలు జరిగాయి. పోటీల్లో ఆర్‌వీఆర్ అండ్ జేసీ, ఏఎన్‌యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్లు సంయుక్త విజేతలుగా నిలిచారు. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల రన్నరప్ టైటిల్ సాధించగా, ధనలక్ష్మి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్లు తృతీయ స్థానం సాధించాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి హిందూ కళాశాల ప్రిన్సిపాల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఏఎన్‌యూ అబ్జర్వర్ డి.చంద్రారెడ్డి, ఎ.వి.రాఘవయ్య, శివరామకృష్ణ, పి.రాజ్యలక్ష్మి, ఎం.విజయలక్ష్మి, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement