ముగిసిన అథ్లెటిక్స్ పోటీలు
- 1000 మీటర్ల పరుగుపందెంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు వరుసగా ఎన్. హరికృష్ణ (వ్యవసాయ కళాశాల, నైరా), ఎం.కె. శ్రీకాంత్ (వ్యవసాయ కళాశాల, తిరుపతి), ఐ. బాలమణికంఠ (వ్యవసాయ కళాశాల, బాపట్ల) నిలిచారు.
- 200 మీ పరుగుపందెంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు వరుసగా కె. రామ్‌నాయుడు (వ్యవసాయ కళాశాల, నైరా),వై. రాజేష్, టి. గణేష్ వర్మ (వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల, మడకశిర), ఉన్నారు.
- షార్ట్‌పుట్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు వరుసగా జి. అదిత్య (వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల, బాపట్ల), జె. మధు (వ్యవసాయ కళాశాల, నైరా), ఎ.జి.హెచ్ ప్రసాద్ (వ్యవసాయ కళాశాల, రాజమండ్రి) గెలుపొందారు.
- లాంగ్ జంప్‌లో వై. రాజేష్ (వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల, మడకశిర), సిహెచ్. సతీష్‌కుమార్ (వ్యవసాయ కళాశాల, బాపట్ల), రిబిన్ బాబు (వ్యవసాయ కళాశాల, తిరుపతి) ఉన్నారు.
- ట్రిపుల్ జంప్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు మహీంద్రబాబు (వ్యవసాయ కళాశాల, బాపట్ల), రామ్‌నాయుడు (వ్యవసాయ కళాశాల, నైరా), రిబిన్‌బాబుబేబి (వ్యవసాయ కళాశాల తిరుపతి) గెలిచారు.
- హైజంప్‌లో ప్రథమ, ద్వితీయ తృతీయ స్థానాలు అహ్మద్ హుస్సేన్ (వ్యవసాయ కళాశాల, తిరుపతి), మహీంద్రబాబు (వ్యవసాయ కళాశాల, బాపట్ల), రిబిన్‌బేబి (వ్యవసాయ కళాశాల, తిరుపతి) నిలిచారు.
- డిస్కస్‌త్రోలో సాయికుమార్ (వ్యవసాయ కళాశాల, నైరా), తిలక్ (వ్యవసాయ కళాశాల, నైరా), సతీష్ ( వ్యవసాయ కళాశాల, బాపట్ల) విద్యార్థులు గెలుపొందారు.