రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు హఫీజ్ ఎంపిక
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు హఫీజ్ ఎంపిక
Published Sun, Sep 25 2016 5:52 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
గుంటూరు ఎడ్యుకేషన్ : కర్నూలు జిల్లా నంద్యాలలో అక్టోబర్ ఆరవ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరగనున్న రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు నారాయణ విద్యాసంస్థల విద్యార్థిని షేక్ హఫీజ్ ఎంపికైనట్టు విద్యాసంస్థల జనరల్ మేనేజర్ పిడికిటి తిలక్‌బాబు తెలిపారు. అమరావతి రోడ్డులోని నారాయణ విద్యాసంస్థల జోనల్ కార్యాలయంలో శనివారం హఫీజ్‌ను ఆయన అభినందించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల బీఆర్ స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి తైక్వాండో పోటీల్లో 40 కేజీల బాలికల విభాగంలో విజేతగా నిలిచిన హఫీజ్ రాష్ట్రస్థాయికి అర్హత సాధించిందని వివరించారు. విద్యార్థిని హఫీజ్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో సైతం విజేతగా నిలుస్తానని ధీమా వ్యక్తం చేసింది. విద్యార్థినితో పాటు క్రీడల్లో ప్రోత్సహించిన తల్లిదండ్రులను జీఎం తిలక్‌బాబు, డీన్ శ్రీనివాసరావు, ఏజీఎం ఆళ్ళ శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ ఏడుకొండలు అభినందించారు.
Advertisement
Advertisement