సీనియర్స్ ఆల్‌రౌండ్ చాంపియన్ శ్రావ్య
పుల్లేటికుర్రు(అంబాజీపేట) : పుల్లేటికుర్రు జెడ్పీ హైస్కూలులో గత మూడు రోజులుగా జరుగుతున్న అమలాపురం జోన్ బాలికల గ్రిగ్ పోటీలు బుధవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో కోనసీమవ్యాప్తంగా 1,000 మంది క్రీడాకారులు, 70 మంది పీఈటీలు పాల్గొన్నారని గ్రిగ్ నిర్వాహక అధ్యక్షుడు, హెచ్‌ఎం పి.వీరభద్రుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ, పీఈటీ అందె సూర్యనారాయణ తెలిపారు. విజేతలను ప్రకటించారు. బాలికల సీనియర్స్ వ్యక్తిగత ఆల్‌రౌండ్ చాంపియన్ షిప్‌లో సాయి శ్రావ్య (భాష్యం, అమలాపురం), మరియమ్మ (విలస), డి.మనీష (పుల్లేటికుర్రు), జూనియర్స్ విభాగంలో కె.శరణ్య (తొండవరం), ఎస్.కావ్య (పుల్లేటికుర్రు)లకు ప్రథమ, ద్వితీయ స్థానాలు వచ్చాయి. సీనియర్స్ హాకీ విభాగంలో పి.లక్ష్మివాడ, మునిపల్లి, గొల్లవిల్లి, బాస్కెట్‌బాల్ తులిప్స్ అమలాపురం, అమలాపురం, ముమ్మిడివరం, వాలీబాల్‌లో వీరవల్లిపాలెం, కొమరగిరిపట్నం, మాగం, కబడ్డీలో వన్నెచింతలపూడి, అయినాపురం, కొమరగిరిపట్నం, ఖోఖోలో గంగలకుర్రు అగ్రహారం, పాలగుమ్మి, పుల్లేటికుర్రు, బాల్‌బ్యాడ్మింటన్‌లో పుల్లేటికుర్రు, కొండుకుదురు, మాగం, హ్యాండ్ బాల్‌లో కొమరగిరిపట్నం, విలస, ఇరుసుమండ, టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో శానపల్లిలంక, గోడిలంక, వీరవల్లిపాలెం, డబుల్స్‌లో శానపల్లిలంక, గోడిలంక, కొమరగిరిపట్నం, టెన్నికాయిట్ సింగిల్స్‌లో అల్లవరం, ముమ్మిడివరం, చెయ్యేరు, డబుల్స్‌లో అల్లవరం, ముమ్మిడివరం, చెయ్యేరు, చెస్‌లో ఇసుకపూడి, విద్యానిధి (అమలాపురం), సెయింట్ జోసెఫ్ ఇరుసుమండ, త్రోబాల్‌లో అయినాపురం, చెయ్యేరు, నెట్‌బాల్ శానపల్లిలంక, అమలాపురం, ముమ్మిడివరంలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను గెలుచుకున్నారు. సీనియర్స్‌తో పాటు జూనియర్స్ విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులను అందజేశారు.