grig
-
హోరాహోరీగా సెంట్రల్‌జోన్ ‘గ్రిగ్’
13 జోన్ల పరిధిలోని 516 మంది విద్యార్థులు హాజరు నేడు బహుమతుల ప్రదానోత్సవం తుని (తుని) : పట్టణంలో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ప్రారంభమైన సెంట్రల్ జోన్ బాలికల గ్రిగ్ పోటీలు బుధవారం హోరాహోరీగా జరిగాయి. ఈ పోటీల్లో జిల్లాలోని 13జోన్ల పరిధిలో 46 పాఠశాలలకు చెందిన 516 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 15 క్రీడల్లో పోటీలు జరగాల్సి ఉండగా 11 క్రీడల పోటీలు నిర్వహించారు. మిగిలినవి గురువారం నిర్వహిస్తామని హెచ్ఎం నూకరత్నం తెలిపారు. పట్టణంలో వివిధ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాల్లో ఈ పోటీలను నిర్వహించారు. ఈసందర్భంగా పోటీల విజేతల వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో పీడీ కుమారి, కె.సత్యనారాయణ, ఆంజనేయప్రసాద్ పాల్గొన్నారు. క్రీడల్లోని విజేతలు వీరే.. బాస్కెట్ బాల్లో ఓబీఎస్ఎమ్హెచ్ స్కూల్ (పిఠాపురం జోన్) విన్నర్స్‌గానూ, ఏపీఎస్పీ క్వార్టర్స్ జెడ్పీఈహెచ్ స్కూల్ (కాకినాడ జో¯ŒS) విద్యార్థులు రన్నర్స్‌గా నిలిచారు. కబడ్డీలో డీఎంహెచ్ స్కూల్(రాజమండ్రి) విన్నర్స్‌గానూ, జెడ్పీహెచ్ స్కూల్ (తుని పి.కొట్టాం)విద్యార్థులు రన్నర్స్‌గా నిలిచారు. వాలీబాల్‌లో జి.మామిడాడ జెడ్పీ హెచ్ స్కూల్(అన పర్తి జోన్) విన్నర్స్‌గానూ, అంతర్వేది జెడ్పీహెచ్ స్కూల్ (రాజోలు జోన్)విద్యార్థులు రన్నర్స్‌గా నిలిచారు.బ్యాడ్మింటన్‌లో బిక్కవోలు జెడ్పీహెచ్ స్కూల్ (అనపర్తి జోన్) విన్నర్స్ స్థానం, కొత్తపేట జెడ్పీ హెచ్‌స్కూల్ (కొత్తపేట జోన్) విద్యార్థులు రన్నర్స్ స్థానంలో నిలిచారు. హ్యాండ్‌బాల్‌లో ఎ.కొత్తపల్లి జెడ్పీహెచ్ఎస్ (తునిజోన్) మొదటి స్థానం, పెదపురప్పాడు జెడ్పీహెచ్ స్కూల్ (రామచంద్రాపురం జోన్) విద్యార్థులు రెండో స్థానం సంపాదించుకున్నారు. త్రోబాల్‌లో బి.వేమవరం జెడ్పీహెచ్ స్కూల్ (రామచంద్రాపురం జోన్) విన్నర్స్‌గానూ, తుని లయోలా ఈ.ఎం.హెచ్.స్కూల్ (తునిజోన్)విద్యార్థులు రన్నర్స్‌గా నిలిచారు. షటిల్ సింగిల్స్ విభాగంలో ఆదిత్యా పబ్లిక్ స్కూల్ (అమలాపురంజోన్) వినర్స్గానూ జి.మామిడాడ జెడ్పీహెచ్ స్కూల్ (అనపర్తి జోన్) రన్నర్స్‌గా నిలిచారు. డబుల్స్‌లో ఆదిత్యా పబ్లిక్ స్కూల్ (అమలాపురంజోన్) వినర్స్గానూ, కొండెవరం జెడ్పీహెచ్ స్కూల్ (పిఠాపురం జోన్) రన్నర్స్‌గా నిలిచారు. టేబుల్‌టెన్నిస్ సింగిల్స్‌లో బిక్కవోలు జెడ్పీహెచ్ స్కూల్ (అనపర్తి జోన్) విన్నర్స్ గానూ, కొండెవరం జెడ్పీహెచ్ స్కూల్(పిఠాపురం జోన్) రన్నర్స్గానూ నిలిచా రు. డబుల్స్ విభాగంలో జీహెచ్ స్కూల్ (మండపేట జోన్) విన్నర్స్‌గానూ, కొండెవరం జెడ్పీహెచ్ స్కూల్ (పిఠాపురం జోన్) రన్నర్‌గా నిలిచారు. టెన్నికాయిట్‌లో తేటగుంట జెడ్పీ హెచ్.స్కూల్ (తునిజోన్) విన్నర్స్‌గానూ, అనపర్తి జీబీఆర్హెచ్ స్కూల్ (అనపర్తి జోన్) రన్నర్స్‌గా నిలిచారు. చెస్‌లో మంజేరు జెడ్పీ హెచ్.స్కూల్ (రామచంద్రాపురం జోన్) విన్నర్స్‌గానూ, అనపర్తి జీబీఆర్హెచ్ స్కూల్(అనపర్తి జోన్) రన్నర్స్‌గా నిలిచారు. నేడు బహుమతుల ప్రదానోత్సవం సెంట్రల్‌జోన్ గ్రిగ్ పోటీల్లో మిగిలిన క్రీడల పూర్తయిన అనంతరం తుని పట్టణ బాలికోన్నత పాఠశాలలో క్రీడల్లోని విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం జరుగుతుందని హెచ్ఎం నూకరత్నం తెలిపారు. ఈకార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరవుతారన్నారు. -
ముగిసిన అమలాపురం జోన్ బాలికల గ్రిగ్స్
సీనియర్స్ ఆల్‌రౌండ్ చాంపియన్ శ్రావ్య పుల్లేటికుర్రు(అంబాజీపేట) : పుల్లేటికుర్రు జెడ్పీ హైస్కూలులో గత మూడు రోజులుగా జరుగుతున్న అమలాపురం జోన్ బాలికల గ్రిగ్ పోటీలు బుధవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో కోనసీమవ్యాప్తంగా 1,000 మంది క్రీడాకారులు, 70 మంది పీఈటీలు పాల్గొన్నారని గ్రిగ్ నిర్వాహక అధ్యక్షుడు, హెచ్ఎం పి.వీరభద్రుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ, పీఈటీ అందె సూర్యనారాయణ తెలిపారు. విజేతలను ప్రకటించారు. బాలికల సీనియర్స్ వ్యక్తిగత ఆల్‌రౌండ్ చాంపియన్ షిప్లో సాయి శ్రావ్య (భాష్యం, అమలాపురం), మరియమ్మ (విలస), డి.మనీష (పుల్లేటికుర్రు), జూనియర్స్ విభాగంలో కె.శరణ్య (తొండవరం), ఎస్.కావ్య (పుల్లేటికుర్రు)లకు ప్రథమ, ద్వితీయ స్థానాలు వచ్చాయి. సీనియర్స్ హాకీ విభాగంలో పి.లక్ష్మివాడ, మునిపల్లి, గొల్లవిల్లి, బాస్కెట్‌బాల్ తులిప్స్ అమలాపురం, అమలాపురం, ముమ్మిడివరం, వాలీబాల్‌లో వీరవల్లిపాలెం, కొమరగిరిపట్నం, మాగం, కబడ్డీలో వన్నెచింతలపూడి, అయినాపురం, కొమరగిరిపట్నం, ఖోఖోలో గంగలకుర్రు అగ్రహారం, పాలగుమ్మి, పుల్లేటికుర్రు, బాల్‌బ్యాడ్మింటన్‌లో పుల్లేటికుర్రు, కొండుకుదురు, మాగం, హ్యాండ్ బాల్లో కొమరగిరిపట్నం, విలస, ఇరుసుమండ, టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో శానపల్లిలంక, గోడిలంక, వీరవల్లిపాలెం, డబుల్స్‌లో శానపల్లిలంక, గోడిలంక, కొమరగిరిపట్నం, టెన్నికాయిట్ సింగిల్స్‌లో అల్లవరం, ముమ్మిడివరం, చెయ్యేరు, డబుల్స్‌లో అల్లవరం, ముమ్మిడివరం, చెయ్యేరు, చెస్‌లో ఇసుకపూడి, విద్యానిధి (అమలాపురం), సెయింట్ జోసెఫ్ ఇరుసుమండ, త్రోబాల్‌లో అయినాపురం, చెయ్యేరు, నెట్‌బాల్ శానపల్లిలంక, అమలాపురం, ముమ్మిడివరంలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను గెలుచుకున్నారు. సీనియర్స్‌తో పాటు జూనియర్స్ విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులను అందజేశారు. -
ఆటంకాలే
గ్రిగ్పోటీలకు దక్కని బాసట ప్రభుత్వం నుంచి నిధులు లేవు జెడ్పీ నుంచి దక్కని చేయూత పెద్దనోట్లకు చిల్లరి లేదు భారంగా మారిన జోనల్ గ్రిగ్ పోటీలు అమలాపురం : పాఠశాల స్థాయిలో జరిగే జోనల్ గ్రిగ్ పోటీలకు నిధులు కొరత పట్టిపీడిస్తోంది. ఈ పోటీలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక సాయం అందలేదు. గతంలో జెడ్పీ నుంచి మైదానం అభివృద్ధికి వచ్చిన నిధులు కూడా నిలిచిపోయాయి. దాతల సహాయం తీసుకుందామన్నా.. పెద్దనోట్లు పెద్ద సమస్యగా మారాయి. దీంతో పోటీల నిర్వహణ ప్రహసనమైంది. జెడ్పీ మొండి చేయి చూపడంతో.. పాఠశాల స్థాయిలో క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించే గ్రిగ్ పోటీలు జిల్లావ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఆరంభమయ్యాయి. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ రెండు నుంచి ప్రారంభం కావల్సి ఉండగా, నిర్వహణ భారం మోయలేక కొన్ని పోటీలను ముందుగానే నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు నిధుల కొరత పట్టిపీడిస్తోంది. పోటీల నిర్వహణకు జోన్ స్థాయిలో రూ.మూడు లక్షలు, సెంట్రల్ జోన్ పోటీలకు రూ.రెండు లక్షలు ఖర్చవుతోంది. తొలి నుంచి పోటీలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం లేదు. పోటీల్లో పాల్గొనే ఆయా పాఠశాలలు ఎంట్రీ ఫీజులు, అప్లికేషన్ ఫీజులు చెల్లించే రుసుమునే ఆయా పాఠశాలలకు రూ.పది వేల చొప్పున కేటాయిస్తున్నారు. గతంలో మైదానాల అభివృద్ధి పేరుతో జిల్లా పరిషత్ రూ.50 వేల నుంచి రూ.లక్షల వరకు ఇచ్చిన సందర్భాలున్నాయి. ఈ ఏడాది జెడ్పీ కూడా మొండిచేయి చూపించింది. దీంతో పోటీల నిర్వాహకులు దాతలు అందించే సహాయంపైనే పూర్తిగా ఆధారపడ్డారు. తీరా నోట్ల రద్దుతో పెద్దనోట్లు మారకపోవడం, చిల్లరి నోట్లు దొరకక నిర్వాహకులు పడరాని పాట్లు పడుతున్నారు. కొత్తనోట్లు లేకపోవడం, పాతనోట్లు తీసుకోకపోవడంతో పోటీలు నిర్వహించలేకపోతున్నారు. అమలాపురం జోన్ బాలుర గ్రిగ్ పోటీలు ఈ ఏడాది అయినవిల్లి మండల కొండుకుదురుకు కేటాయించారు. నిర్వహణ భారమైనా పోటీలను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాజోలు, రామచంద్రపురం, రంపచోడవరం, తుని, పెద్దాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం జోన్లలో బాలురు, బాలికల క్రీడాపోటీల నిర్వహణకు సైతం ఇవే ఇబ్బందులున్నాయి. పక్కదారినపడుతున్న ఖేల్‌రత్న నిధులు మూడు, నాలుగు రోజుల పాటు వందల మంది విద్యార్థులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించే గ్రిగ్ పోటీల నిర్వహణకు నిధులు లేవు. ఒకటి, రెండు రోజుల్లో పూర్తయ్యే ఖేల్‌రత్న(గతంలో పైకా) పోటీలకు మాత్రం నిధులిస్తున్నారు. మండల స్థాయిలో రూ.30 వేలు, నియోజకవర్గస్థాయిలో రూ.40 వేలు ఇస్తున్నారు. జిల్లా స్థాయిలో విజేతలకు రాష్ట్రస్థాయి పోటీలకు తీసుకువెళుతున్నారు. కేటాయిస్తున్న నిధులను చాలా మంది ఎంపీడీఓలు నొక్కేస్తున్న విషయం బహిరంగ రహస్యం. ఇలా అవసరమైన చోట నిధులు ఇవ్వకపోవడం, ఇచ్చిన చోట సద్వినియోగం కాకపోవడం పాఠశాల స్థాయి క్రీడాకారులకు శాపంగా మారింది. ప్రత్యేకంగా నిధులివ్వాలి పాఠశాలల్లో క్రీడా పోటీలకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలి. నిర్వహణకు లక్షల్లో ఖర్చుపెట్టడం చాలా కష్టంగా ఉంది. ఖేల్‌రత్నకు ఇస్తున్నట్టుగా జోనల్ గ్రిగ్ పోటీలకు సైతం ప్రభుత్వం నిధులివ్వాలి. – ఉండ్రు ముసలయ్య, అమలాపురం జోన్ వ్యాయామోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు.