హైదరాబాద్‌లోని ఎస్‌సీఈఆర్‌టీలో మంగళవారం నిర్వహించిన సైన్స్ సెమినార్‌కు జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో భూపాలపల్లి మండలం గొర్లవీడు జిల్లా పరిషత్‌కు చెందిన విద్యార్థి పవన్‌కుమార్ ‘సుస్థిర ఆహార భద్రతలో పప్పుధాన్యాలు’ అంశంపై అనర్గలంగా మాట్లాడారు.
రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్‌లో పవన్‌కుమార్ ప్రతిభ
Published Thu, Sep 1 2016 12:52 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM
విద్యారణ్యపురి/ భూపాలపల్లి : హైదరాబాద్‌లోని ఎస్‌సీఈఆర్‌టీలో మంగళవారం నిర్వహించిన సైన్స్ సెమినార్‌కు జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో భూపాలపల్లి మండలం గొర్లవీడు జిల్లా పరిషత్‌కు చెందిన విద్యార్థి పవన్‌కుమార్ ‘సుస్థిర ఆహార భద్రతలో పప్పుధాన్యాలు’ అంశంపై అనర్గలంగా మాట్లాడారు. తెలంగాణలోని ఒక్కో జిల్లా నుంచి ఇద్దరు చొప్పున 20 మంది విద్యార్థులు సెమినార్‌లో పాల్గొనగా.. అందులో పవన్‌కుమార్ తృతీయ బహుమతి సాధించినట్లు జిల్లా సైన్స్ కేంద్రం అధికారి సీహెచ్ కేశవరావు, పాఠశాల హెచ్‌ఎం ఐలి నాగేశ్వర్‌రావు బుధవారం తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రొఫెసర్ సురేష్‌బాబు చేతుల మీదుగా ప్రశంసాపత్రం, రూ. వెయ్యి నగదు బహుమతి స్వీకరించినట్లు వారు చెప్పారు. కాగా, ప్రతిభచూపిన పవన్‌కుమార్‌ను డీఈఓ పి. రాజీవ్, సైన్స్ కేంద్రం అధికారి కేశవరావు అభినందించారు.
Advertisement
Advertisement