ఇండోర్ స్టేడియంలో ఎంపిక చేయనున్నటు రెజ్లింగ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
నంద్యాల: రాష్ట్ర సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే జిల్లా మహిళ, పురుషుల జట్లను బుధవారం స్థానిక పద్మావతినగర్‌లోని ఇండోర్ స్టేడియంలో ఎంపిక చేయనున్నటు రెజ్లింగ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పురుషుల ఫ్రీ స్టైల్, గ్రీకో రోమన్ సై ్టల్, మహిళల ఫ్రీసై ్టల్ విభాగాల్లో ఎంపిక చేస్తామన్నారు.
18 ఏళ్లు పైబడిన క్రీడాకారులు వయస్సు ధ్రువీకరణ పత్రంతో హాజరు కావచ్చన్నారు. ఎంపికైన జిల్లా జట్టు 30 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జరిగే రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్‌లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు.