‘పక్షిబొమ్మల’ నాగరాజుకు రాష్ట్రస్థాయి పురస్కారం
దేవీచౌక్ : తెల్లకరత్రో పక్షి బొమ్మలను తయారు చేసే మల్లేడ నాగరాజు రాష్ట్రస్థాయి పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నెల నాలుగో తేదీన లేపాక్షి ఆధ్వర్యంలో విజయవాడలో జరగనున్న ఒక కార్యక్రమంలో నాగరాజు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ సందర్భంగా బుధవారం నాగరాజు ‘సాక్షి’తో తన వృత్తి అనుభవాలు ఇలా పంచుకున్నారు. ‘‘రాజమహేంద్రవరం మల్లికార్జుననగర్‌లో మా నివాసం. మా తండ్రి కొయ్యతో అందమైన పక్షి బొమ్మలను తయారు చేసేవారు. ఆయనే నాకు ఈ వృత్తిలో గురువు. మూడు దశాబ్దాలుగా నేను దారుకొయ్యతో పక్షుల బొమ్మలను తయారు చేస్తున్నా. ఈ బొమ్మలకు మార్కెట్లో ఆదరణ ఉంది. ఇటీవల నగరంలో లేపాక్షి నగర శాఖ నిర్వహించిన ప్రత్యక్ష తయారీ, ప్రదర్శన, అమ్మకాలలో నా బొమ్మలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. నగరశాఖ మేనేజర్ షేక్‌సిరాజుద్దీన్ నా కళను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారు. నా కుటుంబసభ్యులు కూడా వృత్తిలో సహకరిస్తున్నారు. లేపాక్షి హస్తకళల సంస్థ ఆధ్వర్యంలో ఈనెల నాలుగో తేదీన విజయవాడలో రాష్ట్రస్థాయి పురస్కారానికి ఎంపిక కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.’