మౌలిక వసతుల కొరతతోనే క్రీడాకారుల వెనుకబాటు
జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషఅధ్యక్షుడు నారాయణరెడ్డి
మలికిపురం : క్రీడారంగానికి మౌలిక వసతుల కొరతతోనే ప్రతిభావంతులు వెనుకబడుతున్నారని జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి పేర్కొన్నారు. దిండిలో బుధవారం జరిగిన జిల్లా బ్యాడ్మింటన్‌అసోసియేషన్‌సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజమహేంద్ర వరంలో అకాడమీ ద్వారా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. ఓఎన్జీసీ వంటి సంస్థలు, స్పాన్సర్ల సహకారంతో రాష్ట్ర , జాతీయ స్థాయి క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. ఒలింపిక్‌లో సి«ంధు పతకం సాధించడంతో బ్యాడ్మింటన్‌కు ఆదరణ పెరిగిందన్నారు. ప్రపంచంలో క్రికెట్‌కు 14 దేశాల్లోనే ఆదరణ ఉండగా బ్యాడ్మింటన్‌కు 216 దేశాల్లో ఆదరణ ఉందన్నారు. సాత్విక్ ప్రసాద్, కృష్ణ ప్రసాద్ అనే క్రీడాకారులకు ప్రోత్సాహకంగా ఈ సమావేశంలో సభ్యులు రూ. 1. లక్ష విరాళాలు సమకూర్చారు. రాష్ట్రంలో టాప్ 15 మంది బ్యాడ్మింటన్‌క్రీడాకారుల్లో ఆరుగురు మన జిల్లా వారేనని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న స్టేట్ 13, 15, 17,19 సెలక్షన్లకు మన జిల్లా నుంచి క్రీడాకారులను ఎంపిక చేస్తామన్నారు. అన్ని ప్రాంతాలలోనూ టోర్న్‌మెంట్లు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వివరించారు. ఉపాధ్యక్షుడు మెట్ల రమణ బాబు, కొడాలి తనూజ, కోశాధికారి రాజారెడ్డి, కార్యదర్శి ఆర్. రామాంజనేయ రాజు, రాష్ట్ర ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఈసీ సభ్యుడు ముదునూరి అక్కిరాజు తదితరులు పాల్గొన్నారు.