
‘స్టేట్’ అంటే రాష్ట్ర ప్రభుత్వమే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూసేకరణ కోసం తీసుకొచ్చిన ‘ది తెలంగాణ స్టేట్ పాలసీ ఫర్ అక్విజేషన్ ఆఫ్ ల్యాండ్ త్రూ అగ్రిమెంట్’లో స్టేట్ అంటే రాష్ట్ర ప్రభుత్వమేనని అర్థం చెబుతూ తెలంగాణ సర్కారు వివరణ ఇచ్చింది. జిల్లాల్లో భూసేకరణ సందర్భంగా కలెక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. వివరణ ఇస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని సచివాలయ విభాగాధిపతులు, కలెక్టర్లను ఆదేశించింది.