రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్‌కు 16 మంది ఎంపిక
మామిడికుదురు: రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలకు మామిడికుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 16 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. కాకినాడలో మంగళవారం జరిగిన అర్హత పోటీల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా వీరిని ఎంపిక చేశారని ప్రధానోపాధ్యాయుడు జేఎన్‌ఎస్ గోపాలకృష్ణ బుధవారం విలేకర్లకు తెలిపారు. అండర్–14 ఆర్చరీ పోటీలకు గుత్తుల నాగకృష్ణశ్రీరామ్, బడుగు గోపీచంద్, పుల్లేటికుర్తి యశ్వంత్, చీకురుమిల్లి ఉమ, చీకురుమిల్లి జ్యోతి, పమ్మి రేఖ, కడలి నాగదుర్గ, అండర్–17 ఆర్చరీ పోటీలకు పితాని ఉదయ్‌కిరణ్, చీకురుమిల్లి కేశవ, మద్దాల లోకేష్‌నాగబాబు, మట్టపర్తి వెంకటసత్యప్రభు, బొక్కా బేబీసుమ, అండర్–17 తైక్వాండో పోటీలకు సీహెచ్ స్వర్ణరేఖ, హెచ్‌కే సౌలత్, పి.తేజ, అండర్–17 రెజ్లింగ్ పోటీలకు మద్దాల లక్ష్మీగణేష్ ఎంపికయ్యారని చెప్పారు. రెజ్లింగ్ పోటీలు కృష్ణా జిల్లాలో త్వరలో జరుగుతాయని, మిగిలిన పోటీలు చిత్తూరు జిల్లాలో జరుగుతాయని తెలిపారు. ఎంపికైన విద్యార్థులను ఆయన, పీడీ వి.శ్రీనివాస్, పీఈటీ పి.విజయ్‌ప్రకాశ్, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు.