రాష్ట్రస్థాయిలో జిల్లా జట్లకు ఓవరాల్ చాంపియన్షిప్
Published Tue, Sep 20 2016 12:29 AM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
డోర్నకల్ : హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో జిల్లా జట్లు ఓవరాల్ చాంపియన్షిప్ సాధించాయి. రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్, జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు ఆదివారం జరగగా బాలురు, బాలికల జట్లు చాంపియన్షిప్ సాధించాయని వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్త రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక హనుమాన్ వ్యాయామశాలలో ఆయన విజేతల వివరాలను వెల్లడించారు. బాలుర సబ్‌జూనియర్స్ 50 కేజీల విభాగంలో వి.గణేష్, 56 కేజీల విభాగంలో కె.హరీష్‌చక్రవర్తి, 56 కేజీల విభాగంలో ఎం.వేణు, 62 కేజీల విభాగంలో ఎన్ రాజేష్, బి.క్రాంతి, 69 కేజీల విభాగంలో బి.రాజేష్, జె.సాయికుమార్, 77 కేజీల విభాగంలో ఎస్‌కె మాథుర్, 85 కేజీల విభాగంలో జి.గణేష్ ప్రతిభ చూపారు. బాలుర జూనియర్స్ 77 కేజీల విభాగంలో కె.నరేంద్రబాబు, 85 కేజీల విభాగంలో ఎన్.ఉమేష్ ప్రతిభ కనబరిచారు. ఇక బాలికల సబ్ జూనియర్స్ 44 కేజీల విభాగంలో జి.రోజా, 48 కేజీల విభాగంలో కె.వైజయంతి, 53 కేజీల విభాగంలో వానీశ్వరి, 58 కేజీల విభాగంలో పి.శ్రావణి, బి.కావేరి, 63 కేజీల విభాగంలో ఏ.మహాలక్ష్మి ప్రతిభ కనబర్చగా.. బాలుర, బాలికల విభాగంలో ఓవరాల్ చాంపియన్షిప్ సాధించారు. విజేతలను రాంబాబుతో పాటు కోచ్‌లు కొత్త కుమార్, అనిల్‌కుమార్, ఉపేందర్ అభినందించారు.
Advertisement
Advertisement