అప్రెడా రాష్ట్ర సెక్రటరీ జనరల్‌గా తిరుపతిరావు
అప్రెడా రాష్ట్ర సెక్రటరీ జనరల్‌గా తిరుపతిరావు
Published Fri, Jul 29 2016 10:51 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM
పాతగుంటూరు : ఆంధ్రప్రదేశ్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్ అసోసియేషన్ (అప్రెడా) రాష్ట్ర జనరల్ సెక్రటరీగా గద్దె తిరుపతిరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గుంటూరులో శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో అప్రెడా రాష్ట్ర అధ్యక్షుడు టి.హరిబాబు సమావేశానికి అధ్యక్షత వహించి తిరుపతిరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. తిరుపతిరావు ఇప్పటి వరకు అప్రెడా గుంటూరు చాప్టర్ అధ్యక్షుడిగా ఉన్నారు. గుంటూరు జిల్లాలో రియల్ నిర్మాణరంగం అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన తిరుపతిరావు ఎన్నిక పట్ల పలువురు వ్యాపార, నిర్మాణ రంగ ప్రముఖులు అభినందనలు తెలిపారు.
Advertisement
Advertisement