అద్భుతాల ఆవిష్కర్తలు | state level inspire program | Sakshi

అద్భుతాల ఆవిష్కర్తలు

Published Sun, Nov 27 2016 12:48 AM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM

అద్భుతాల ఆవిష్కర్తలు

అద్భుతాల ఆవిష్కర్తలు

కాకినాడ రూరల్‌ : కాకినాడ రూరల్‌ మండలం వాకలపూడి హంసవాహిని విద్యాలయ వేదికగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన ఇన్‌ స్పైర్‌–2016 అలరిస్తోంది. వివిధ జిల్లాల నుంచి ఎంపిక చేసిన ప్రదర్శలు అందర్నీ ఆలోచింపజేస్తున్నాయి. శుక్ర

భవిష్యత్‌ టెక్నాలజీకి వారసులు
విశేషంగా ఆట్టుకుంటున్న ఇన్‌స్పైర్‌
కాకినాడ రూరల్‌ : కాకినాడ రూరల్‌ మండలం వాకలపూడి హంసవాహిని విద్యాలయ వేదికగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన ఇన్‌ స్పైర్‌–2016 అలరిస్తోంది. వివిధ జిల్లాల నుంచి ఎంపిక చేసిన ప్రదర్శలు అందర్నీ ఆలోచింపజేస్తున్నాయి. శుక్రవారం ప్రారంభమైన ఈ ప్రదర్శన ఆదివారంతో ముగియనుంది. రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, యనమల రామకష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వరరావు ముగింపు కార్యక్రమానికి హాజరుకానున్నారు. కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ పర్యవేక్షణలో జిల్లా విద్యాశాఖాధికారి ఆర్‌.నరసింహారావు ఈ ప్రదర్శన విజయవంతం చేసేందుకు అక్కడే ఉండి సిబ్బందికి, విద్యార్థులకు వసతి తదితర ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు.  . జిల్లాలోని 122 పాఠశాలల నుంచి 13,500 మంది విద్యార్థులు శనివారం ప్రదర్శనను తిలకించారు. ప్రదర్శనలో ఉంచి నమూనాలను ఎన్‌సీఈఆర్‌టీ సంచాలకులు ఎం.వి.రాజ్యలక్ష్మి, డీఈవో ఆర్‌.నరసింహారావు తిలకించారు. విద్యార్థుల్లో సజనాత్మకత వెలికి తీసే విధంగా వినూత్నంగా అనేక పోటీలను నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ విశేషంగా అరించాయి. ఉప విద్యాశాఖాధికారులు ఆర్‌ఎస్‌ గంగాభవాని, దడాల వాడపల్లి, డి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నవర జెడ్పీ పాఠశాల ఎన్‌సీసీ విద్యార్థులు బందోబస్తు నిర్వహించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement