ఆగిన కూత
ఆగిన కూత
Published Sun, Oct 9 2016 11:37 PM | Last Updated on Tue, Mar 19 2019 7:01 PM
ఉత్కంఠభరితంగా సాగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు
పురుషుల విభాగంలో తూర్పు, మహిళల విభాగంలో విశాఖ విజేతలు
పదోసారి విజేతగా తూర్పుగోదావరి జిల్లా
సామర్లకోట : సామర్లకోటలో జరిగిన ఎన్టీఆర్ మెమోరియల్ 64వ రాష్ట్ర కబడ్డీ పోటీల్లో ఆదివారం ఫైన ల్స్ హోరాహోరీగా సాగాయి. పురుషుల విభాగంలో తూర్పు–ప్రకాశం జట్ల మధ్య పోరు ఉత్కంఠగా సాగింది. చివరి నిమిషం వరకు సాగిన పోరులో తూర్పు గోదావరి రెండు పాయింట్ల తేడాతో విజయం సాధించింది. మహిళల విభాగంలో విశాఖ జట్టు విజయనగరంపై 18 పాయింట్ల తేడాతో గెలుపొందింది. ద్వితీయ స్థానంలో విజయనగరం, తృతీయ స్థానంలో తూర్పు, కృష్ణా జట్లు నిలిచాయి. పురుషుల విభాగంలో పదోసారి విజేతగా నిలిచిన తూర్పు ప్రథమ స్థానం కైవసం చేసుకోగా, ప్రకాశం ద్వితీయ, విశాఖ, విజయనగరం తృతీయ స్థానాలు సాధించాయి. 13 జిల్లాల నుంచి పురుష, మహిళల జట్లు ఇందులో పాల్గొన్నాయి. నాలుగు రోజులుగా ఫ్లడ్‌లైట్ల వెలుగులో ఈ పోటీలు సామర్లకోట పల్లం బీడ్‌లో జరిగాయి.
సెమిస్‌లో తలపడిన జట్లు
అంతకుముందు పురుషుల విభాగంలో సెమీ ఫైనల్‌లో విశాఖను ఓడించి తూర్పు, విజయనగరంను ఓడించి ప్రకాశం ఫైనల్‌కు చేరాయి. మహిళల విభాగంలో సెమీఫైనల్‌లో తూర్పు జట్టును ఓడించి విజయనగరం, కృష్టాను ఓడించి విశాఖ జట్లు పైనల్‌కు చేరాయి. ఆదివారం రాత్రి డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ ఎంపీ తోట నరసింహం క్రీడాకారులను పరిచయం చేసుకుని, పోటీలను తిలకించారు. విజేతలకు చినరాజప్ప, నరసింహంతో పాటు దాత యర్లగడ్డ వీర్రాజు, మున్సిపల్ చైర్‌పర్సన్ మన్యం పద్మావతి బహుమతులు అందజేశారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో బహుమతులు పొందిన క్రీడాకారులను ఈ సందర్భంగా సన్మానించారు. పోటీలన ఏర్పాటు చేసిన బోగిళ్ల మురళీకుమార్‌ను డిప్యూటీ సీఎం, ఎంపీ అభినందించారు. ఆంధ్ర కబడ్డీ సంఘ కార్యదర్శి వి.వీరలంకయ్య, కోశాధికారి ఎం.రంగారావు, జిల్లా అధ్యక్షుడు, పోటీల ఆర్గనైజింగ్ కార్యదర్శి బోగిళ్ల ముర ళీకుమార్, జాతీయ కోచ్ పోతుల సాయి, జిల్లా సహాయ కార్యదర్శి తళ్లూరి వైకుంఠం, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement