kabbadi
-
మేడం సర్..మేడం అంతే..
-
విజయనగరం: న్యూ ఇయర్ వేళ విషాదం.. ప్రాణం తీసిన కబడ్డీ గేమ్
సాక్షి, విజయనగరం: నూతన సంవత్సరం వేడుకల్లో విషాదం ఘటన చోటుచేసుకుంది. న్యూ ఇయర్ జోష్‌లో భాగంగా గ్రామంలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో అపశృతి కారణంగా ఓ యువకుడు మృతిచెందాడు. దీంతో, యువకుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వివరాల ప్రకారం.. జిల్లాలోని పూసపాటిరేగ మండలం వెంపడం గ్రామంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఎరుకొండ, కొవ్వాడ గ్రామాల మధ్య పోటీ జరిగింది. ఆట సందర్భంగా రమణ కూతకు వెళ్లగా.. కొవ్వాడ గ్రామానికి చెందిన జట్టు సభ్యులు అతడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా.. రమణపై వారంతా పడిపోయారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అతని తల నేలకు బలంగా తగిలింది. దీంతో మెడ విరిగిపోయి అక్కడికక్కడే కుప్పుకూలిపోయాడు. వెంటనే రమణను కేజీహెచ్‌కు తరలించారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రమణ మృతిచెందాడు. ఇక, రమణ.. పూసపాటి మండలంలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రమణ.. పేరెంట్స్ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మరోవైపు.. రమణ కుటుంబ సభ్యుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేపట్టినట్టు తెలిపారు. న్యూ ఇయర్ వేళ రమణ ఇలా మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. -
కబడ్డీ ఆడుతూ కిందపడ్డ మంత్రి మల్లారెడ్డి
బోడుప్పల్: తెలంగాణ క్రీడాకారులు పట్టుదల, కసితో క్రీడలు ఆడి జాతీయ స్థాయిలో అద్భుతాలు సృష్టించాలని రాష్ట్ర క్రీడాభివృద్ధి శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బోడుప్పల్‌లోని వైష్ణవి క్రికెట్ గ్రౌండ్లో మంగళవారం రాత్రి దివంగత చెర్ల ఆంజనేయులు యాదవ్ జ్ఞాపకార్థం టీఆర్ఎ అధ్యక్షుడు మంద సంజీవ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి 68వ కబడ్డీ సీనియర్ ఇంటర్ మెన్ అండ్ ఉమెన్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని అందులో భాగంగా హకీం పేట్లో స్పోర్ట్స్ స్కూల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులు అసమానతలు తొలగించి అందరం ఒకే కుటుంబం అనే భావన కల్పించాలన్నారు. క్రీడల్లో పైరవీలకు తావు లేదని, గెలవాలనే తపన, లక్ష్యం ఉన్న క్రీడాకారులనే రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చదువుతోపాటు క్రీడలను ప్రోత్సహిస్తున్నారని, క్రీడల్లో రాణించే వారికి 2 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ శామీర్‌పేట్‌లో 250 ఎకరాల్లో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. క్రీడాకారులు రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. కబడ్డీ ప్రాచీణమైనదని, క్రికెట్‌ను తలదన్నేలా కబడ్డీ క్రీడాకారులు రాణించాలన్నారు. తొలుత కబడ్డీ సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిన్నారుల భరత నాట్యం ఆహుతులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, కార్యదర్శి జగదీశ్ యాదవ్, మేయర్లు సామల బుచ్చిరెడ్డి, జక్క వెంకట్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కిందపడ్డ మల్లారెడ్డి కబడ్డీ పోటీల ప్రారంభంలో భాగంగా మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, చామకూర మల్లారెడ్డి కబడ్డీ ఆడారు. ఇరువురు రెండు జట్టులుగా ఏర్పడి కబడ్డీ ఆడుతుండగా కూతకు వెళ్లిన మల్లారెడ్డి గ్రౌండ్లో వేసిన మ్యాట్ జారడంతో కింద పడిపోయారు. దీనిని గమనించిన మంత్రి శ్రీనివాస్ మల్లారెడ్డిని లేపి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టారు. -
కబడ్డీకి అనూప్ వీడ్కోలు
పంచకుల (హరియాణా): భారత కబడ్డీ దిగ్గజం అనూప్ కుమార్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అనూప్ కెప్టెన్సీలో భారత జట్టు 2010, 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించడంతో పాటు 2016 ప్రపంచకప్ నెగ్గి విశ్వవిజేతగా నిలిచింది. మట్టి ఆటకు విస్తృత ప్రాచుర్యం అందించిన ప్రొ కబడ్డీ లీగ్ రెండో సీజన్లో యు ముంబా ఫ్రాంచైజీకి సారథిగా వ్యవహరించిన 35 ఏళ్ల అనూప్ జట్టును విజేతగా నిలిపాడు. ‘కబడ్డీ ఆడటం ప్రారంభించిన తొలినాళ్లలో దేశానికి ఆడాలని కలలు కనేవాడిని. అతి కొద్ది మందే తమ స్వప్నాలను సాకారం చేసుకోగలుగుతారు. అలాంటి అదృష్టం నాకు దక్కింది’ అని అనూప్ పేర్కొన్నాడు. జైపూర్పై గుజరాత్ గెలుపు: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 33–31తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై విజయం సాధించింది. గుజరాత్ తరఫున ప్రపంజన్ 11, సచిన్ 8 పాయింట్లతో మెరిశారు. పట్నా పైరేట్స్, బెంగళూరు బుల్స్ మధ్య జరిగిన మ్యాచ్ 40–40తో ‘డ్రా’గా ముగిసింది. నేటి మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీతో జైపూర్ పింక్ పాంథర్స్, బెంగాల్ వారియర్స్‌తో తమిళ్ తలైవాస్ తలపడనున్నాయి. -
పాకిస్తాన్‌పై మళ్లీ ఘన విజయం
దుబాయ్: ఆరు దేశాల కబడ్డీ మాస్టర్స్ టోర్నీలో భారత జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 41–17 స్కోరుతో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. శుక్రవారం టోర్నీ తొలి మ్యాచ్‌లోనే పాక్‌ను 36–20తో ఓడించిన భారత్ మరోసారి పైచేయి సాధించడం విశేషం. ఆరంభంలోనే రోహిత్ సూపర్ రైడ్ సాధించడంతో భారత్ 6–1తో ముందంజలో నిలిచింది. ఆ తర్వాత తన ఆధిక్యం నిలబెట్టుకుంటూ భారత్ తొలి అర్ధభాగం ముగిసే సరికి 18–9తో పట్టు సాధించింది. రెండో అర్ధభాగంలో బరిలోకి దిగిన మోను గోయట్ ఏకంగా 7 పాయింట్లతో అదరగొట్టడంతో మన జట్టుకు తిరుగు లేకుండా పోయింది. భారత్‌తో పాటు ఇరాన్ కూడా సెమీస్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. గ్రూప్ ‘బి’లో జరిగిన మ్యాచ్‌లో ఇరాన్ 31–27తో కొరియాను ఓడించింది. -
ఆగిన కూత
ఉత్కంఠభరితంగా సాగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు పురుషుల విభాగంలో తూర్పు, మహిళల విభాగంలో విశాఖ విజేతలు పదోసారి విజేతగా తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట : సామర్లకోటలో జరిగిన ఎన్టీఆర్ మెమోరియల్ 64వ రాష్ట్ర కబడ్డీ పోటీల్లో ఆదివారం ఫైన ల్స్ హోరాహోరీగా సాగాయి. పురుషుల విభాగంలో తూర్పు–ప్రకాశం జట్ల మధ్య పోరు ఉత్కంఠగా సాగింది. చివరి నిమిషం వరకు సాగిన పోరులో తూర్పు గోదావరి రెండు పాయింట్ల తేడాతో విజయం సాధించింది. మహిళల విభాగంలో విశాఖ జట్టు విజయనగరంపై 18 పాయింట్ల తేడాతో గెలుపొందింది. ద్వితీయ స్థానంలో విజయనగరం, తృతీయ స్థానంలో తూర్పు, కృష్ణా జట్లు నిలిచాయి. పురుషుల విభాగంలో పదోసారి విజేతగా నిలిచిన తూర్పు ప్రథమ స్థానం కైవసం చేసుకోగా, ప్రకాశం ద్వితీయ, విశాఖ, విజయనగరం తృతీయ స్థానాలు సాధించాయి. 13 జిల్లాల నుంచి పురుష, మహిళల జట్లు ఇందులో పాల్గొన్నాయి. నాలుగు రోజులుగా ఫ్లడ్‌లైట్ల వెలుగులో ఈ పోటీలు సామర్లకోట పల్లం బీడ్‌లో జరిగాయి. సెమిస్లో తలపడిన జట్లు అంతకుముందు పురుషుల విభాగంలో సెమీ ఫైనల్లో విశాఖను ఓడించి తూర్పు, విజయనగరంను ఓడించి ప్రకాశం ఫైనల్‌కు చేరాయి. మహిళల విభాగంలో సెమీఫైనల్లో తూర్పు జట్టును ఓడించి విజయనగరం, కృష్టాను ఓడించి విశాఖ జట్లు పైనల్‌కు చేరాయి. ఆదివారం రాత్రి డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ ఎంపీ తోట నరసింహం క్రీడాకారులను పరిచయం చేసుకుని, పోటీలను తిలకించారు. విజేతలకు చినరాజప్ప, నరసింహంతో పాటు దాత యర్లగడ్డ వీర్రాజు, మున్సిపల్ చైర్పర్సన్ మన్యం పద్మావతి బహుమతులు అందజేశారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో బహుమతులు పొందిన క్రీడాకారులను ఈ సందర్భంగా సన్మానించారు. పోటీలన ఏర్పాటు చేసిన బోగిళ్ల మురళీకుమార్‌ను డిప్యూటీ సీఎం, ఎంపీ అభినందించారు. ఆంధ్ర కబడ్డీ సంఘ కార్యదర్శి వి.వీరలంకయ్య, కోశాధికారి ఎం.రంగారావు, జిల్లా అధ్యక్షుడు, పోటీల ఆర్గనైజింగ్ కార్యదర్శి బోగిళ్ల ముర ళీకుమార్, జాతీయ కోచ్ పోతుల సాయి, జిల్లా సహాయ కార్యదర్శి తళ్లూరి వైకుంఠం, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
కబడ్డీలో దళితుల చేతిలో ఓడిపోవడంతో..
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హరియాణాలో ప్రతి ఏడాది వివిధ కులాల మధ్య కబడీ పోటీలు జరుగుతాయి. కులాల మధ్య ఐక్యత పెంచడం ఈ స్నేహపూర్వక పోటీల వెనుక ప్రధానోద్దేశం. కానీ, ఈసారి గురుగావ్‌లో జరిగిన క్రీడాపోటీలు మాత్రం కులాల మధ్య ఐక్యత పెంచడానికి బదులు చిచ్చు రాజేశాయి. తాజా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దళితుల జట్టు, యాదవుల జట్టు మధ్య జరిగిన కబడ్డీ పోటీ హింసాత్మకంగా మారింది. దళితుల జట్టు యాదవుల జట్టుపై గెలుపొందింది. ఇదే విషయాన్ని నిర్వాహకులు ప్రకటించారు కూడా. అయితే, దీంతో యాదవుల జట్టు ఆగ్రహానికి లోనై.. దళితుల కబడ్డీ జట్టు సభ్యులపై దాడికి దిగినట్టు సమాచారం. ఈ దాడిలో ఓ ఆటగాడికి కాలువిరిగి, తీవ్ర గాయాలయ్యాయి. మరొకరికి తలపై గాయమైంది. ఇరు జట్లకు చెందిన మరో పదిమంది కూడా ఈ హింసలో గాయపడ్డారు. ప్రస్తుతం క్షతగాత్రులు గురుగావ్‌లోని ఉమా సంజీవని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురుగావ్ జిల్లా చక్కార్పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ పోటీల్లో వివిధ గ్రామాలకు చెందిన దళితులు, యాదవులు, జాట్లు, గుజ్జర్లు, బెనియాలు, అగర్వాళ్ల జట్లు పాల్గొన్నాయని ఓ జాతీయ ఆంగ్లపత్రిక తెలిపింది. అయితే, రాష్ట్రంలో కులపరమైన క్రీడాపోటీలు జరుగడం లేదని, ఒకే కులం వారు ఒక జట్టు నిండా ఉన్నా అది యాదృచ్ఛికమే కానీ కులాలవారీగా జట్లు లేవని స్థానిక కౌన్సిలర్ సునీల్ యాదవ్ చెప్పుకొచ్చారు. -
కార్పొరేట్ల కబడ్డీ కబడ్డీ ప్రారంభం
-
శభాష్.. వినీత!
నంద్యాల, న్యూస్‌లైన్: ప్రతిభకు వికలత్వం అడ్డురాదని ఓ విద్యార్థిని నిరూపిస్తోంది. మాటలు రాకపోయినా క్రీడాపోటీల్లో రాణిస్తోంది. ఫెన్సింగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో రన్నరప్‌గా నిలిచి తనకు సాటి ఎవరూ లేరని చాటింది. జాతీయస్థాయి పోటీలకు ఎంపికై పలువురికి ఆదర్శంగా నిలిచింది. నంద్యాల పట్టణానికి చెందిన రమణారెడ్డి, నాగలింగేశ్వరిల కుమార్తె వినీత పుట్టు మూగ. వైఎస్సార్ జిల్లా కడప పట్టణంలోని బధిర కళాశాలలో రెండో సంవత్సరం సీఈసీ చదువుతోంది. నంద్యాల పట్టణంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చింది. ఈ పోటీల్లో రాష్ట్రంలోని 12 జిల్లాలకు చెందిన 250 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. వీరిలో ఏకైక బధిర విద్యార్థి వినీత కావడం గమనార్హం. కర్నూలు, వరంగల్, చిత్తూరు జిల్లాలకు చెందిన క్రీడాకారులపై ఈమె విజయం సాధించింది. మంగళవారం నిర్వహించిన ఫైనల్ పోటీల్లో మెదక్ జిల్లాకు చెందిన విద్యార్థినితో తలపడి ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. ఈ విద్యార్థిని గత ఏడాది వైఎస్సార్ జిల్లాలో బధిరులకు నిర్వహించిన కబడ్డీ పోటీల్లో ప్రతిభకనబరిచి బంగారు పతకం కైవసం చేసుకుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల సలహాలతో తాను క్రీడల్లో రాణిస్తున్నట్లు వినీత తెలిపారు. జాతీయ స్థాయిలో రాణించాలన్నదే తన ఆశయమని ఆమె పేర్కొన్నారు. తమ కుమర్తె క్రీడల్లోనే కాకుండా చదువులో ముందంజలో ఉందని తల్లిందండ్రులు తెలిపారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మంచి మార్కులు వచ్చాయని వారు వివరించారు. వచ్చే ఏడాది వినీతకు కేరళలో ప్రత్యేక శిక్షణ ఇప్పించి పారా ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనే విధంగా కృషి చేస్తామని రామకృష్ణా విద్యాసంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి, కోచ్ మహేశ్వరరావు తదితరులు చెప్పారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీలు
కొత్తూరు(ముసునూరు) న్యూస్‌లైన్ : గ్రామీణ క్రీడాకారులు తమ సత్తాచాటాలని వైఎస్సార్ సీపీ నూజివీడు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. దీపావళిని పురస్కరించుకుని చింతలవల్లి శివారు కొత్తూరులో 2వ తేదీ నుంచి జరుగుతున్న 48వ రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీలు సోమవారం రాత్రితో ముగిశాయి. పోటీల్లో మొత్తం 18 జట్లు పాల్గొన్నాయి. సోమవారం రాత్రి జరిగిన పైనల్ పోటీల్లో కొత్తూరు, పాతముప్పర్రు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. కొత్తూరు జట్టు విజయం సాధించి టోర్నమెంటు విజేతగా నిలిచింది. రన్నర్‌గా పాతముప్పర్రు, మూడు నాలుగు స్థానాల్లో కొత్తూరుకి చెందిన చిన్నారి, స్టూడెంట్ జట్లు నిలిచాయి. విజేతలకు బహుమతులు అందజేసే కార్యక్రమానికి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ముఖ్యఅతిథిగా హజరయ్యారు. టోర్నమెంటు విజేతైన కొత్తూరు జట్టుకి రూ.10 వేల బహుమతిని ఆయన అందజేశారు. రెండోబహుమతి రూ.ఎనిమిది వేలను పాతముప్పర్రుకి నూజివీడు మాజీ ఏఎమ్‌సీ అధ్యక్షుడు పల్లెర్లమూడి అభినాష్, మూడోబహుమతి రూ.ఆరు వేలను చిన్నారి జట్టుకి చింతలవల్లి సర్పంచ్ పల్లిపాము కుటుంబరావు, వైఎస్సార్ సీపీ నేత తుర్లపాటి సాంబశివరావు, నాలుగో బహుమతి రూ.నాలుగు వేలను స్టూడెంట్ జట్టుకి చింతలవల్లి వైఎస్సార్ సీపీ నేత సుగసాని శ్రీనివాసరావు అందజేశారు. జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో విజేతలైన జట్లకి ముసునూరు ఎస్ఐ వీ వెంకటేశ్వరావు, పాలసొసైటీ అధ్యక్షుడు కందేపు వెంకటేశ్వరావు, వైఎస్సార్ సీపీ నేత పల్లె రవీంద్రరెడ్డి, సరస్వతి అప్పలరాజు, దువ్వురి లక్ష్మణరావు, చాకిరి రామకృష్ణ బహుమతులను అందజేశారు.