గ్రామీణ క్రీడాకారులు తమ సత్తాచాటాలని వైఎస్సార్ సీపీ నూజివీడు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు.
కొత్తూరు(ముసునూరు) న్యూస్‌లైన్ :
గ్రామీణ క్రీడాకారులు తమ సత్తాచాటాలని వైఎస్సార్ సీపీ నూజివీడు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. దీపావళిని పురస్కరించుకుని చింతలవల్లి శివారు కొత్తూరులో 2వ తేదీ నుంచి జరుగుతున్న 48వ రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీలు సోమవారం రాత్రితో ముగిశాయి. పోటీల్లో మొత్తం 18 జట్లు పాల్గొన్నాయి. సోమవారం రాత్రి జరిగిన పైనల్ పోటీల్లో కొత్తూరు, పాతముప్పర్రు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. కొత్తూరు జట్టు విజయం సాధించి టోర్నమెంటు విజేతగా నిలిచింది. రన్నర్‌గా పాతముప్పర్రు, మూడు నాలుగు స్థానాల్లో కొత్తూరుకి చెందిన చిన్నారి, స్టూడెంట్ జట్లు నిలిచాయి. విజేతలకు బహుమతులు అందజేసే కార్యక్రమానికి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ముఖ్యఅతిథిగా హజరయ్యారు.
టోర్నమెంటు విజేతైన కొత్తూరు జట్టుకి రూ.10 వేల బహుమతిని ఆయన అందజేశారు. రెండోబహుమతి రూ.ఎనిమిది వేలను పాతముప్పర్రుకి నూజివీడు మాజీ ఏఎమ్‌సీ అధ్యక్షుడు పల్లెర్లమూడి అభినాష్, మూడోబహుమతి రూ.ఆరు వేలను చిన్నారి జట్టుకి చింతలవల్లి సర్పంచ్ పల్లిపాము కుటుంబరావు, వైఎస్సార్ సీపీ నేత తుర్లపాటి సాంబశివరావు, నాలుగో బహుమతి రూ.నాలుగు వేలను స్టూడెంట్ జట్టుకి చింతలవల్లి వైఎస్సార్ సీపీ నేత సుగసాని శ్రీనివాసరావు అందజేశారు. జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో విజేతలైన జట్లకి ముసునూరు ఎస్‌ఐ వీ వెంకటేశ్వరావు, పాలసొసైటీ అధ్యక్షుడు కందేపు వెంకటేశ్వరావు, వైఎస్సార్ సీపీ నేత పల్లె రవీంద్రరెడ్డి, సరస్వతి అప్పలరాజు, దువ్వురి లక్ష్మణరావు, చాకిరి రామకృష్ణ బహుమతులను అందజేశారు.