విజయనగరం: న్యూ ఇయర్‌ వేళ విషాదం.. ప్రాణం తీసిన కబడ్డీ గేమ్‌ | Vizianagaram Ramana Died While Playing Kabaddi | Sakshi
Sakshi News home page

విజయనగరం: న్యూ ఇయర్‌ వేళ విషాదం.. ప్రాణం తీసిన కబడ్డీ గేమ్‌

Published Sun, Jan 1 2023 6:57 PM | Last Updated on Sun, Jan 1 2023 7:01 PM

Vizianagaram Ramana Died While Playing Kabaddi - Sakshi

సాక్షి, విజయనగరం: నూతన సంవత్సరం వేడుకల్లో విషాదం ఘటన చోటుచేసుకుంది. న్యూ ఇయర్‌ జోష్‌లో భాగంగా గ్రామంలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో అపశృతి కారణంగా ఓ యువకుడు మృతిచెందాడు. దీంతో, యువకుడి కుటుంబ సభ్యులు శోకసంద్ర​ంలో మునిగిపోయారు. 

వివరాల ప్రకారం.. జిల్లాలోని పూసపాటిరేగ మండలం వెంపడం గ్రామంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఎరుకొండ, కొవ్వాడ గ్రామాల మధ్య పోటీ జరిగింది. ఆట సందర్భంగా రమణ కూతకు వెళ్లగా.. కొవ్వాడ గ్రామానికి చెందిన జట్టు సభ్యులు అతడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా.. రమణపై వారంతా పడిపోయారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అతని తల నేలకు బలంగా తగిలింది. దీంతో మెడ విరిగిపోయి అక్కడికక్కడే కుప్పుకూలిపోయాడు. వెంటనే రమణను కేజీహెచ్‌కు తరలించారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రమణ మృతిచెందాడు. 

ఇక, రమణ.. పూసపాటి మండలంలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రమణ.. పేరెంట్స్‌ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మరోవైపు.. రమణ కుటుంబ సభ్యుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేపట్టినట్టు తెలిపారు. న్యూ ఇయర్‌ వేళ రమణ ఇలా మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement