యూరప్ కు మళ్ళీ ఉగ్ర ముప్పా..?
యూరప్ లో మళ్ళీ ఉగ్రదాడులకు ఆస్కారం ఉందంటున్నాయి భద్రతా సంస్థలు. పారిస్, బ్రసెల్స్ లో ఘోరమైన తీవ్రవాద దాడుల అనంతరం వాతావరణం కాస్త ప్రశాంతంగా కనిపిస్తున్నా... ఇస్టామిక్ స్టేట్ మిలిటెంట్లు మాత్రం అదే పనిలో ఉన్నట్లు బెల్జియన్ అధికారులు నమ్ముతున్నారు. గతనెల బ్రసెల్స్ దాడుల తర్వాత మరింతమంది మిలిటెంట్లను ఐసిస్.. యూరప్ లోకి పంపేపనిలో పడిందని అధికారులు అనుమానిస్తున్నారు.
యూరప్ లో ఉగ్రదాడుల స్థాయి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదులతో యూరప్, బెల్జియం లకు మరింత ముప్పు ఉందని గత దాడుల తర్వాత ఇప్పటివరకూ ముప్పు స్థాయి ఏమాత్రం తగ్గలేదని మూడుగానే ఉందని, దేశ సంక్షోభ కేంద్ర ప్రతినిధి ఒకరు వెల్లడించారు. మరింత ముప్పు ఉన్నట్లుగా యూరోపియన్ యూనియన్ సెక్యూరిటీ ఏజెన్సీ అధిపతినుంచి హెచ్చరిక వచ్చిందని, అయితే అది పూర్తిశాతం నిజం కాకపోవచ్చునని, బ్రసెల్స్, పారిస్ దాడుల్లో పాల్గొన్న వారందరినీ అరెస్టు చేశామని ఆయన తెలిపారు. అయితే ఇతర ఉగ్రమూకలు యూరప్ పై దాడికి ప్రణాళిక చేస్తున్నట్లు ఖచ్చితంగా నమ్మలేమన్నారు.
గత నవంబర్ లో జరిగిన ప్యారిస్ దాడిలో 130 మంది చనిపోగా అనేకమంది గాయపడ్డారు. దాదాపు నాగులు నెలల అన్వేషణ అనంతరం గతనెల్లో దాడికి బాధ్యుడైన ఓ అనుమానితుడు సలాహ్ ఆబ్డెస్లామ్ ను సజీవంగా పట్టుకున్నామని, దానికి ఒక వారం తర్వాత డెన్మార్క్ పోలీసులు కొన్ని పేలుడు పదార్థాలతోపాటు నలుగురు అనుమానిత ఇస్లామిక్ స్టేట్ తీవ్ర వాదులను అరెస్టు చేశారని అధికారులు తెలిపారు. దాడులకు పాల్పడ్డ వారంతా ఐసిస్ రిక్రూట్ మెంట్ లోని వారేనని తెలిసేందుకుగాను దానికి సంబంధించిన ఫైళ్ళను నెట్వర్క్ లో పొందు పరిచారని దాంతో విషయం లీకయినట్లు తెలిపారు. అయితే ఇస్లామిక్ స్టేట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న ఓ మొరొక్కన్ అనుమానిత వ్యక్తిని పాల్మా డి మల్లోర్కా ద్వీపంలో అరెస్టు చేసినట్లు స్పానిష్ పోలీసులు ప్రకటించారు. ఆ అనుమానిత వ్యక్తికి సిరియాలోని ప్రముఖ టెర్రరిస్టులతో స్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తున్నాయని పోలీసులు తెలిపారు.