sending
-
వోయేజర్–1 పునరుత్థానం! 43 ఏళ్ల తర్వాత నాసాకు సందేశం
వోయేజర్–1 అంతరిక్ష నౌక గుర్తుందా? అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 1977 సెప్టెంబర్ 5న ప్రయోగించిన స్పేస్‌క్రాఫ్ట్. సాంకేతిక కారణాలతో 1981 నుంచి మూగబోయింది. రేడియో ట్రాన్స్మిట్టర్లో విద్యుత్ నిండుకోవడంతో సంకేతాలు పూర్తిగా నిలిచిపోయాయి. భూమి నుంచి ప్రస్తుతం ఏకంగా 2,400 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఇంటర్స్టెల్లార్ స్పేస్‌లో ఉన్న వోయేజర్–1 రేడియో ట్రాన్స్మిట్టర్కు మళ్లీ జీవం పోసే పనిలో నాసా సైంటిస్టులు నిమగ్నమయ్యారు. ఆ దిశగా తాజాగా స్వల్ప పురోగతి సాధించారు. దాంతో ఈ వ్యోమనౌక 43 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ నాసాతో అనుసంధానమైంది. వోయేజర్–1ను క్రియాశీలకంగా మార్చడంలో భాగంగా దాని హీటర్లు పని చేసేలా డీప్ స్పేస్ నెట్వర్క్ ద్వారా అక్టోబర్ 16న కమాండ్స్ పంపించారు. ఈ ప్రయత్నాలు ఫలించాయి. అక్టోబర్ 18న వోయేజర్–1 స్పందించింది. అది పంపిన సందేశం 23 గంటల తర్వాత భూమికి అందింది. స్పేస్‌క్రాఫ్ట్‌లోని సాంకేతిక లోపాన్ని గుర్తించడానికి ఈ సందేశం తోడ్పడుతుందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్ పార్టీలో 21 ఏళ్ల అపురూపమైన డ్రెస్‌లో అనన్య పాండే : ఆయన కోసమే! -
సరిహద్దుల్లో పాక్ ఉగ్రవాద శిబిరాలు?
పాక్ ఉగ్రవాదులు గత కొద్దిరోజులుగా భారత సరిహద్దుల్లోకి చొరబడుతున్నారని ఇటీవల జరిగిన ఉగ్రదాడులు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా కథువాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. మరోవైపు ఉగ్రవాదులకు పాకిస్తాన్ నుంచి అందుతున్న నిధులకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం వెల్లడయ్యింది. సరిహద్దుల్లో పాకిస్తాన్ నడుపుతున్న ఉగ్రవాద శిబిరాల జాబితా కూడా దీనిలో ఉంది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం పాకిస్తాన్ తమ దేశంలో శిక్షణ పొందిన ఉగ్రవాదులు, మాజీ ఎస్‌ఎస్‌జీలు, కొందరు సైనికులతో కూడిన ఒక్కో గ్రూపునకు లక్ష రూపాయలు ఇచ్చి భారతదేశానికి పంపుతోందని తెలుస్తోంది. అలాగే పాక్ ఈ ఉగ్రవాదులకు ఎం4 లాంటి ఖరీదైన ఆయుధాలు, బుల్లెట్లను అందిస్తోంది. చొరబాటు సమయంలో ఉగ్రవాదులకు సహాయం అందించే గైడ్లకు కూడా రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు అందజేస్తోందని తెలుస్తోంది. అలాగే స్మార్ట్ ఫోన్లు, రేడియో సెట్లను ఉగ్రవాదులు విరివిగా వినియోగిస్తున్నారని సమాచారం.ఇదిలా ఉండగా తాజాగా భారత సైన్యం సరిహద్దుల్లోని కంచెలు, సొరంగాల తనిఖీని ముమ్మరం చేసింది. భారతదేశంలోకి చొరబడిన ఉగ్రవాదులు ఆహారం కోసం ఐదారు వేల రూపాయలు ఖర్చు చేస్తారని తెలుస్తోంది. పాక్ ఆర్మీ సహాయంతో ఈ ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నట్లు సమాచారం. పాకిస్తాన్ తన ఉగ్రవాద శిబిరాలను తిరిగి యాక్టివేట్ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇటువంటి శిబిరాలు సరిహద్దుల్లోని నికియాల్, జాంద్రుత్, ఖురేటా కోట్లి, సమానీ, అబ్దుల్ బిన్ మసూద్, సమన్, కోట్‌కోటేరాలో ఉన్నట్లు తెలుస్తోంది. -
ఉగ్రవాదులను భారత్ లోకి పంపిస్తున్న పాకిస్థాన్
-
డ్రోన్ ద్వారా క్లినికల్ శాంపిల్స్ చేరవేత
-
డ్రోన్ ద్వారా క్లినికల్ శాంపిల్స్ చేరవేత
న్యూయార్క్: ప్రపంచంలో దాదాపు వందకోట్ల మంది ప్రజలు ఆరోగ్య సౌకర్యాలకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా కొండ కోనల్లో, అటవి ప్రాంతాల్లో నివసించే గిరిజనులు సకాలంలో వైద్య సౌకర్యాలు అందక అకాల మృత్యువాత పడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలంటే పదుల కిలోమీటర్లు కాలి నడకన వెళ్లాల్సిందే. అప్పుడప్పుడు వైద్య బృందాలు ఆయా ప్రాంతాలకు వెళ్లి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నా, వారికి సరైన ల్యాబ్ సౌకర్యాలు అందుబాటులో ఉండడం లేదు. మరి ఇలాంటి పరిస్థితులో పరిష్కార మార్గం ఏమిటీ? దీనికి మిచిగాన్‌లోని వాయు ఏరియల్ సొల్యూషన్స్ కంపెనీ ఓ మంచి పరిష్కార మార్గాన్ని కనుగొన్నది. మారుమూల ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల్లోని ల్యాబ్‌లకు క్లినికల్ ల్యాబ్ శాంపిల్స్‌ను డ్రోన్ల ద్వారా పంపించవచ్చని ఆచరణాత్మకంగా నిరూపించింది. గత జూలై 27వ తేదీన ఆఫ్రికాలోని ఓ మారుమూల ప్రాంతంలో ప్రజల నుంచి సేకరించిన బ్లడ్ శాంపిల్స్‌ను డ్రోన్ ద్వారా సెంట్రల్ ల్యాబ్‌కు పంపించింది. ప్రపంచంలో క్లినికల్ శాంపిల్స్‌ను ఓ చోటు నుంచి మరో చోటుకు చేరవేయడానికి డ్రోన్‌ను ఉపయోగించడం ఇదే తొలిసారి. దీనికి సంబంధించిన వీడియోను వాయు ఏరియల్ సొల్యూషన్స కంపెనీ ఇప్పుడు విడుదల చేసింది. రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తమ కస్టమర్లకు సరకులను చేరవేయడానికి డ్రోన్లను ఉపయోగించవచ్చని ఇది వరకే చాటిచెప్పాయి. అయితే డ్రోన్లను ఉపయోగించడం వల్ల ప్రయోజనాలతోపాటు ప్రమాదాలు కూడా పొంచి ఉండడంతో వివిధ దేశాల ప్రభుత్వాలు అందుకు తగిన అనుమతులు మంజూరు చేయడం లేదు. సామాన్య ప్రజల అవసరాల కోసం డ్రోన్లను వినియోగించడాన్ని అనుమతించినట్లయితే డ్రోన్లను ఉపయోగించి టైస్టులు దాడులకు పాల్పడే ఆస్కారముందనేది ప్రభుత్వాల ఆందోళన. -
యూరప్ కు మళ్ళీ ఉగ్ర ముప్పా..?
యూరప్ లో మళ్ళీ ఉగ్రదాడులకు ఆస్కారం ఉందంటున్నాయి భద్రతా సంస్థలు. పారిస్, బ్రసెల్స్ లో ఘోరమైన తీవ్రవాద దాడుల అనంతరం వాతావరణం కాస్త ప్రశాంతంగా కనిపిస్తున్నా... ఇస్టామిక్ స్టేట్ మిలిటెంట్లు మాత్రం అదే పనిలో ఉన్నట్లు బెల్జియన్ అధికారులు నమ్ముతున్నారు. గతనెల బ్రసెల్స్ దాడుల తర్వాత మరింతమంది మిలిటెంట్లను ఐసిస్.. యూరప్ లోకి పంపేపనిలో పడిందని అధికారులు అనుమానిస్తున్నారు. యూరప్ లో ఉగ్రదాడుల స్థాయి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదులతో యూరప్, బెల్జియం లకు మరింత ముప్పు ఉందని గత దాడుల తర్వాత ఇప్పటివరకూ ముప్పు స్థాయి ఏమాత్రం తగ్గలేదని మూడుగానే ఉందని, దేశ సంక్షోభ కేంద్ర ప్రతినిధి ఒకరు వెల్లడించారు. మరింత ముప్పు ఉన్నట్లుగా యూరోపియన్ యూనియన్ సెక్యూరిటీ ఏజెన్సీ అధిపతినుంచి హెచ్చరిక వచ్చిందని, అయితే అది పూర్తిశాతం నిజం కాకపోవచ్చునని, బ్రసెల్స్, పారిస్ దాడుల్లో పాల్గొన్న వారందరినీ అరెస్టు చేశామని ఆయన తెలిపారు. అయితే ఇతర ఉగ్రమూకలు యూరప్ పై దాడికి ప్రణాళిక చేస్తున్నట్లు ఖచ్చితంగా నమ్మలేమన్నారు. గత నవంబర్ లో జరిగిన ప్యారిస్ దాడిలో 130 మంది చనిపోగా అనేకమంది గాయపడ్డారు. దాదాపు నాగులు నెలల అన్వేషణ అనంతరం గతనెల్లో దాడికి బాధ్యుడైన ఓ అనుమానితుడు సలాహ్ ఆబ్డెస్లామ్ ను సజీవంగా పట్టుకున్నామని, దానికి ఒక వారం తర్వాత డెన్మార్క్ పోలీసులు కొన్ని పేలుడు పదార్థాలతోపాటు నలుగురు అనుమానిత ఇస్లామిక్ స్టేట్ తీవ్ర వాదులను అరెస్టు చేశారని అధికారులు తెలిపారు. దాడులకు పాల్పడ్డ వారంతా ఐసిస్ రిక్రూట్ మెంట్ లోని వారేనని తెలిసేందుకుగాను దానికి సంబంధించిన ఫైళ్ళను నెట్వర్క్ లో పొందు పరిచారని దాంతో విషయం లీకయినట్లు తెలిపారు. అయితే ఇస్లామిక్ స్టేట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న ఓ మొరొక్కన్ అనుమానిత వ్యక్తిని పాల్మా డి మల్లోర్కా ద్వీపంలో అరెస్టు చేసినట్లు స్పానిష్ పోలీసులు ప్రకటించారు. ఆ అనుమానిత వ్యక్తికి సిరియాలోని ప్రముఖ టెర్రరిస్టులతో స్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తున్నాయని పోలీసులు తెలిపారు.