fightes
-
గరుత్మంతుడు, హనుమంతుడి మధ్య పోరులో ఎవరు గెలిచారో తెలుసా?
శ్రీమహావిష్ణువు వాహనంగా గరుత్మంతుడు యుగయుగాలుగా సేవలందిస్తూ వస్తున్నాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణావతారంలో కూడా అవసరమైన వేళల్లో గరుత్మంతుడు శ్రీహరిని సేవించుకుంటూ ఉండేవాడు. గరుత్మంతుడు పుట్టుకతోనే అమిత బలశాలి. ‘అసలు ముల్లోకాలలోనూ నా ఎదుట నిలిచి, తనను యుద్ధంలో గెలవగల ధీరుడెవడున్నాడు? లోకపాలకుడైన శ్రీమన్నారాయణుడినే వీపుమీద మోస్తున్నవాడిని నన్ను మించిన వీరుడింకెవడున్నాడు’ అనుకుని గర్వించసాగాడు.గరుడుని ధోరణిని కొన్నాళ్లుగా గమనిస్తున్న శ్రీకృష్ణుడు ఎలాగైనా, అతడికి గర్వభంగం చేయాలని తలచాడు. ద్వారకలో సత్యా సమేతుడై సభలో కొలువుదీరిన శ్రీకృష్ణుడు ఒకసారి గరుత్మంతుడిని తలచుకున్నాడు. వెంటనే గరుత్మంతుడు కృష్ణుని ముందు వాలి, ‘ప్రభూ! ఏమి ఆజ్ఞ’ అంటూ మోకరిల్లాడు.‘వీరాధి వీరా! వైనతేయా! నీతో ముఖ్యమైన పని పడింది. అందుకే నిన్ను తలచుకున్నాను’ అని చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు కృష్ణుడు. ‘ఆజ్ఞ ఏమిటోసెలవివ్వు ప్రభూ’ అంటూ చేతులు జోడించాడు గరుత్మంతుడు.‘మరేమీ లేదు. గంధమాదన పర్వతం మీద కదళీవనంలో తపస్సు చేసుకుంటూ హనుమంతుడు ఉంటాడు. అతడితో ముఖ్యమైన విషయం మాట్లాడవలసి ఉంది. అతణ్ణి ఇక్కడకు తోడ్కొని రావాలి. ఈ పనికి నువ్వే తగిన సమర్థుడవు’ అన్నాడు కృష్ణుడు. కృష్ణుడి ఆదేశానికి గరుత్మంతుడు మనసులో నొచ్చుకున్నాడు. ‘నేనేమిటి? నా పరాక్రమమేమిటి? ఒక వానరాన్ని తోడ్కొని రావడానికి నేను స్వయంగా వెళ్లడమా?’ అనుకున్నాడు. అయినా ప్రభువు ఆజ్ఞ కదా, ఎలాగైనా నెరవేర్చవలసిందే అనుకుని తక్షణమే బయలుదేరాడు. మనోవేగంతో ఎగురుకుంటూ వెళ్లి, గంధమాదన పర్వతం మీద వాలాడు. అక్కడ హనుమంతుడు నిశ్చల ధ్యానమగ్నుడై కనిపించాడు. గరుత్మంతుడు హనుమంతుడిని పిలిచాడు. ధ్యానంలో ఉన్న హనుమంతుడికి అతడి పిలుపు వినిపించలేదు. ‘ఓ వానరశ్రేష్ఠా! మహాత్ముడైన భగవంతుడు శ్రీకృష్ణుడు నిన్ను పిలుస్తున్నాడు. శ్రీకృష్ణుని ఆజ్ఞ అనుల్లంఘనీయం. కనుక నిన్ను తీసుకుపోకుండా ఇక్కడి నుంచి కదలను’ అని బిగ్గరగా అన్నాడు. తదేక ధ్యానంలో ఉన్న హనుమంతుడు కదల్లేదు, మెదల్లేదు. గరుత్మంతుడికి కోపం వచ్చింది. హనుమంతుడికి ధ్యానభంగం కలిగించైనా, తనతో తీసుకుపోవాలని నిర్ణయించుకున్నాడు. తన పొడవాటి ముక్కును హనుమంతుడి ముక్కు రంధ్రంలోకి పోనిచ్చాడు. గరుత్మంతుడి వికారచేష్టను గమనించి కూడా, హనుమంతుడు నిశ్చలంగా ఉన్నాడు. కాసేపటికి తన ధ్యానాన్ని విరమించుకుని, ప్రాణాయామం ప్రారంభించాడు. ముక్కు కుడి రంధ్రం నుంచి వాయువును విడిచి, ఎడమ రంధ్రం ద్వారా పీల్చుకోసాగాడు. హనుమంతుడి ప్రాణాయామ సాధన గరుత్మంతుడికి ప్రాణసంకటంగా మారింది. హనుమంతుడు గాలి విడిచేటప్పుడు ఎవరో బలంగా నెట్టేసినట్లు గరుత్మంతుడు దూరంగా వెళ్లి పడుతున్నాడు. హనుమంతుడు గాలి పీల్చుకునేటప్పుడు ఎవరో బలంగా లాగుతున్నట్లు హనుమంతుడి వైపు రాసాగాడు. హనుమంతుడు ఊపిరి బిగించి వాయువును కుంభించేటప్పుడు అతడి ముక్కుకు అతుక్కుంటున్నాడు. ఈ ఉత్పాతానికి బిక్కచచ్చిన గరుడుడు వజవజ వణకసాగాడు. హనుమంతుడి ప్రాణాయామం పూర్తయ్యాక గరుత్మంతుడు విడుదలయ్యాడు. బతుకు జీవుడా అనుకుని తెప్పరిల్లాడు. కృష్ణాజ్ఞను ఉల్లంఘించినందుకు హనుమంతుడి మీద కోపం తెచ్చుకున్నాడు. దేహాన్ని పెంచి, ఆకాశాన్ని కమ్మేస్తూ హనుమంతుడిని తీసుకుపోయేందుకు అతని చుట్టూ ఎగురుతూ తిరగసాగాడు.గరుత్మంతుడిని పట్టుకునేందుకు హనుమంతుడు తన తోకను ఆకాశం వరకు పెంచాడు. అదేదో కొయ్య స్తంభం అనుకున్నాడు గరుత్మంతుడు. ఎగిరి ఎగిరి అలసిపోయి, కాసేపు ఈ స్తంభాన్ని ఆనుకుని సేదదీరాలనుకుని, హనుమద్వాలం మీద వాలాడు. తాను వాలినది స్తంభం కాదని, హనుమంతుడి తోక అని గ్రహించి, దానిని తన పదునైన ముక్కుతో పొడవడం ప్రారంభించాడు. హనుమంతుడికి చిర్రెత్తింది. తన తోక రోమాల మధ్య గరుత్మంతుణ్ణి బంధించాడు. అంత బలశాలి అయిన గరుత్మంతుడు కూడా హనుమంతుడి తోక రోమాలలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరయ్యాడు. హనుమంతుడు తన తోకను గిరగిర తిప్పి, గరుత్మంతుణ్ణి ఒక్కసారిగా విసిరేశాడు. ఆ దెబ్బకు అవయవాలన్నీ చితికిన గరుత్మంతుడు ఏకంగా పాలసముద్రంలో పడ్డాడు. కాసేపు అక్కడే సేదదీరాడు. తిరిగి శక్తి కూడదీసుకుని, ద్వారక చేరుకుని శ్రీకృష్ణుడి ముందు వాలాడు. తన ముందు దీనంగా నిలుచుకున్న గరుత్మంతుణ్ణి చూసిన కృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ, ‘ఖగేంద్రా! అలా నిర్విణ్ణుడవై నీరసంగా నిలుచున్నావేమిటి? ఏం జరిగింది? చెప్పు’ అన్నాడు. ‘దేవదేవా! జగన్నాటక సూత్రధారీ! మీ ఆజ్ఞ నెరవేర్చడానికి హనుమంతుడి వద్దకు వెళ్లాను. అతడు నా మాట వినలేదు’ అని గరుత్మంతుడు చెబుతుండగానే శ్రీకృష్ణుడు అడ్డు తగిలాడు.‘ఛీ! ఏమిటీ ఆలస్యం? అతడితో నాకు ముఖ్యమైన పని ఉంది. వెంటనే తీసుకురా’ అన్నాడు.‘స్వామీ! నా బలగర్వం అణిగింది. వానరరూపంలో నా మృత్యువే అక్కడ ఉంది. హనుమంతుడు ఉండే చోటుకు తప్ప ఇంకెక్కడికి పంపినా వెళతాను’ అన్నాడు గరుత్మంతుడు.‘ఈసారి అలా జరగదు. రామనామం జపిస్తూ వెళ్లు. నీ సీతారాముడు నిన్ను పిలుస్తున్నాడని చెప్పు. హనుమ నీతో మారు మాటాడకుండా వస్తాడు’ అని చెప్పాడు శ్రీకృష్ణుడు. గరుత్మంతుడు ఈసారి వినయంగా వెళ్లి, శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారమే చెప్పి హనుమంతుడిని తనతో తోడ్కొని వచ్చాడు. -
పెళ్లిలో రెచ్చిపోతున్న హిజ్రాలు.. డబ్బులు ఇవ్వకుంటే అసభ్యకర ప్రదర్శనలు
రెండు రోజుల కిందట కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నగరానికి చెందిన ఓ పెద్ద వ్యాపారి కొడుకు వివాహం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కొందరు హిజ్రాలు అక్కడికి చేరుకున్నారు. ఫంక్షన్‌హాల్ లోపలికి వెళ్లి వేదికపైకి వచ్చారు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. డబ్బులివ్వాలంటూ అసభ్య పదజాలం వాడారు. దీంతో పెళ్లి కుమారుడి తండ్రి రూ.5 వేలు ఇచ్చాడు. ‘మాకు అవి సరిపోవు. రూ.50 వేలు కావాలి. అవి ఇస్తేనే ఇక్కడ నుంచి వెళ్లి పోతాం’ అని వీరంగం స్పష్టించారు. ఎంత చెప్పినా వినకుండా పెళ్లి మండపంపైనే కూర్చున్నారు. చేసేది ఏమీ లేక వధువు వరుడు తరఫున రూ.50 వేలు ఇచ్చి అక్కడి నుంచి పంపించారు. ఇలా ఒక్క కరీంనగర్‌లోనే కాదు.. ఉమ్మడి జిల్లాలోని అన్ని ఫంక్షన్ హాళ్లలో హిజ్రాలు ఇలానే హల్చల్ చేస్తున్నారు. ఒక్కో పెళ్లికి రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. తాజాగా కరీంనగర్ సమీప మండలంలోని ఓ గ్రామంలో సర్పంచ్ బంధువు వివాహం జరిగింది. రాత్రి బరాత్ జరుగుతున్న సమయంలో కొందరు హిజ్రాలు వచ్చి వీరంగం సృష్టించారు. పెళ్లి కుమారుడిని డబ్బులు డిమాండ్ చేశారు. అతను నిరాకరించడంతో రెచ్చిపోయి నగ్నంగా డ్యాన్స్ చేశారు. దీంతో అక్కడున్న వారు పారిపోయారు. దీంతో వధూవరుల తల్లిదండ్రులు తమ బంధువులు, స్నేహితుల ముందు హేళన కావొద్దని అడిగినంత ముట్టజెప్పారు. తిమ్మాపూర్(మానకొండూర్): పెళ్లంటే జీవితంలో ఒక్కసారి వచ్చే వేడుక. దీన్ని పేదవారు సైతం తమకు ఉన్నంతలో గొప్పగా జరుపుకోవాలని అనుకుంటారు. కానీ.. ఈ మధ్య హిజ్రాల కారణంగా భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. మామూళ్లు ఇవ్వకుంటే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ శుభకార్యాల్లో అలజడి సృష్టిస్తున్నారు. సామాన్య కుటుంబాలకు చెందినవారు డబ్బు ఇచ్చేందుకు నిరాకరిస్తే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా శుభకార్యానికి వచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు భయపడుతున్నారు. ఎవరైనా హిజ్రాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే వారితో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అందరూ జంకుతున్నారు. దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు కొంతమంది ట్రాన్స్జెండర్లు ఎక్కడ శుభకార్యం జరిగినా వారి ఇంటి ముందు వాలిపోయి ఇంటి యజమానికి చుక్కలు చూపిస్తూ, దౌర్జన్యంగా వేలకు వేలు డబ్బులు గుంజుతున్న సంఘటనలు దృష్టికి వస్తున్నాయి. ఎవరైనా చనిపోయిన సందర్భంలో కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో ఉండగా శ్మశాన వాటిక వద్దకు కూడా చేరిపోయి.. వదిలిపెట్టడం లేదు. వేలకు వేలు డబ్బులు గుంజుతున్నట్టుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికైనా వారు తమ వైఖరి మార్చుకోవాలి. లేని ఎడల వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా ఇటువంటి వేధింపులకు గురైతే బాధితులు వెంటనే డయల్ 100 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలియజేయాలి. ఐదు నిమిషాల్లో దగ్గరలో ఉన్న బ్లూ కోల్ట్స్ సిబ్బంది, పెట్రో కార్ సిబ్బంది చేరుకునేలా చర్యలు తీసుకుంటాం. జీవనోపాధి కోసం గౌరవంగా ఉండే ఏదైనా వృత్తిని.. లేక చిన్నచిన్న పనులు చేసుకొని జీవించాలి . ఇటీవల వారికి బ్యాంక్ రుణాలు కూడా మంజూరయాయి. వాహనాలు నడుపుకునేందుకు డ్రైవింగ్ లైసెన్స్‌లు కూడా ఇచ్చారు. – ఎల్.సుబ్బారాయుడు, పోలీస్ కమిషనర్ -
గ్రాండ్ సాంగ్.. భారీ ఫైట్
‘బాహుబలి’ ప్రభాకర్ ప్రధాన పాత్రలో పాలిక్ (పాలిక్ శ్రీనివాసా చారి) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. రమేష్ రావుల నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ‘బాహుబలి’ ప్రభాకర్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా పాత్ర కొత్తగా ఉంటుంది. ప్రస్తుతం ఫైట్ సీన్ షూటింగ్ జరుగుతోంది’’ అన్నారు. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా రూపొందిస్తున్నాం. ప్రభాకర్‌పై ఓ పాటను గ్రాండ్‌గా చిత్రీకరించాం. ఇప్పుడు రవి మాస్టర్ సారథ్యంలో ప్రభాకర్‌పై భారీ ఫైట్ చిత్రీకరిస్తున్నాం. వింద్యా రెడ్డి మంచి కథ అందించారు. జాన్ భూషణ్ మూడు అద్భుతమైన పాటలిచ్చారు’’ అన్నారు పాలిక్. ‘‘మార్చిలో చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అన్నారు రమేష్ రావుల. -
‘స్మార్ట్’ వాదనలు స్మార్ట్ కాదు! లైఫ్ పార్ట్నర్తో ‘ఫెక్స్‌టింగ్’ చేస్తున్నారా?
భార్యాభర్తలు, జీవిత భాగస్వాముల మధ్య ఏదో అంశం మీద వాదోపవాదనలు, చిన్న చిన్న గొడవలు మామూలే. వాదన జరుగుతుండగా... ఆఫీసుకు వెళ్తూ తన పార్ట్నర్ నుంచి దూరంగా వెళ్తే గొడవ సద్దుమణగడం ఖాయం. కానీ మొబైల్ ఫోన్లో టెక్ట్స్ మెసేజీల రూపంలో అదే గొడవ అదే పనిగా కొనసాగితే...? ఇలా లైఫ్ పార్ట్నర్స్ మధ్య ఫైటింగ్ కాస్తా టెక్ట్స్ మెసేజీల రూపంలో కొనసాగడాన్ని‘ఫెక్స్‌టింగ్’ అనే ధోరణిగా అభివర్ణిస్తున్నారు. మొబైల్స్ ఎన్నెన్నో కొత్త కొత్త రకాల ఫీచర్స్‌తో వస్తున్నాయి కాబట్టి వాటిని ‘స్మార్ట్’ఫోన్స్ అన్నారు. కానీ ‘ఫెక్స్‌టింగ్’ అంత స్మార్ట్ కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘ఫెక్స్‌టింగ్’ అంటే కేవలం జీవిత భాగస్వాముల మధ్య ఫైటింగ్ అనే కాదు... పేరెంట్స్, ఫ్రెండ్స్ మధ్య కూడా కావచ్చుకానీ... అత్యధికంగా ప్రభావం చూపేది భార్యాభర్తల మధ్యనే కావడంతో సాధారణంగా దాన్ని లైఫ్పార్ట్నర్స్కే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అత్యంత ప్రఖ్యాతమైన ఓ సెలబ్రిటీ కేస్‌స్టడీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన భార్య, అమెరికన్ ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ల దాంపత్యం వయసు 45 ఏళ్లు పైమాటే. ఇటీవల ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాము వాదించుకునేందుకు టెక్ట్స్ మెసేజీలు వాడతామని చెప్పా రు. అందుకు ఓ వినోదాత్మక కారణం కూడా తెలిపారు. తమ ఘర్షణ, వాదోపవాదాలు అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీకి తెలియకుండా ఉండేందుకు ఈ మార్గాన్ని ఉపయోగిస్తుంటామని సరదాగా వెల్లడించారామె. అంటే అందరి గుట్టుమట్లు పసిగట్టే అత్యంత సమర్థమైన ఏజెన్సీనే బురిడీ కొట్టించడానికి ఆమె ‘ఫెక్స్‌టింగ్’ ను ఎంచుకున్నారన్న మాట. రెండు రకాల వాదనలు ఫెక్స్టింగ్లో పార్ట్నర్స్ ఎదురెదురుగా ఉండరు కాబట్టి... ముఖ కవళికలూ. అందులోని ఆవేశాలూ, ఉద్వేగాలూ కనిపించవు. వాదన తాలూకు తీవ్రత అక్షరాల్లో అంతగా ప్రభావ పూర్వకంగా కనిపించదు కాబట్టి అంత హానికరం కాదనీ అనేవాళ్లూ ఉంటారు. అంతేకాదు... ఆ వాదన కొనసాగడానికి ఇష్టపడని వారు... టెక్ట్స్‌కు బదులుగా క్రమంగా ‘స్మైల్’ లేదా షేక్‌హ్యాండ్ ఎమోజీల్లాంటివి ఉపయోగిస్తూ పోతే, ఎదుటివారి నుంచి తగినంత ప్రతిస్పందన లేకపోవడంతో క్రమంగా వాదన సన్నగిల్లిపోతుందనీ, ఎదురుబొదురు ఉన్నప్పటంత హాని జరగకపోవచ్చనీ కొందరు చెబుతుంటారు. సరిగ్గా దీనికి పూర్తి భిన్నంగా వాదించేవారూ ఉంటారు. మాటలు తడబడవచ్చు. ఏదో మాట సరిగా వ్యక్తం కాకపోవచ్చు. కానీ సరిగ్గా వ్యక్తీకరించగలిగేవాళ్లైతే రాతలోనే ప్రభావం ఎక్కువ అని చెప్పేవాళ్లూ ఉన్నారు. పాతగాయాలూ రేగే ప్రమాదం దంపతుల మధ్య సంభాషణల రూపంలో ఎదురుబొదురుగా ఘర్షణలు జరుగుతున్నప్పుడు ఏదైనా మాటతూలినా గాలికి పోయే మాటల వల్ల ఆ తర్వాత ఎలాంటి ప్రభావమూ ఉండదు. కానీ ‘రాత’ ఎప్పటికీ నిలిచిపోయే అవకాశం ఉంది. అందువల్ల ఆ తర్వాత ఎప్పుడో చదువుకున్నప్పుడూ పాత మాటలూ, పాత వాదనల ప్రభావాలు కెలికినట్లుగా అయి, అవి ఆ తర్వాతెప్పుడో కూడా ప్రమాదం తెచ్చిపెట్టవచ్చని మరికొందరు చెబుతున్నారు. అంతుఉండకపోవచ్చు... ఆ అంశమే ప్రమాదం తేవచ్చు... పొద్దున్నే భార్యాభర్తల మధ్య వాదన చెలరేగింది. ఇద్దరూ తమ తమ పనులు చేసుకుంటూనే వాదనల్లో మునిగిపోయారు. ఆఫీసుకు బయల్దేరే సమయానికి ఘర్షణ పెద్దదైంది. కానీ ఆఫీసు సమయానికి ఎవరి దారిలో వాళ్లు వెళ్లిపోవడంతో ఆ ‘వాదోపవాదాలు’ అక్కడితో ముగుస్తాయి. కానీ ‘ఫెక్స్‌టింగ్’ అలా కాదు. ఆఫీసుకు వెళ్లే దారిలో బస్సులోనో, ఆటోలోనో లేదా మెట్రోరైల్ లోనో అలాగే కొనసాగవచ్చు. అంతేకాదు... ఆఫీసుకు చేరి, సీట్లలో కూర్చున్నాక కూడా అదేపనిగా కొనసాగితే ప్రమాదమే. ఆ మాటకొస్తే కీలకమైన మీటింగుల్లోనూ ‘టెక్ట్స్ మెసేజు’లు కొనసాగుతూ... అసలు లక్ష్యానికి అడ్డంగా మారవచ్చు. టెక్ట్స్ వల్ల ఒనగూరే సౌలభ్యమల్లా వాదన మౌనంగా కొనసాగుతూ... అది మాటల ద్వారా బయటకు తెలియదంతే. కానీ పని ప్రదేశంలో... చేయాల్సిన పని వదిలేసి అదేపనిగా వాదులాడుకుంటూ పోతే... ఆఫీసులో పూర్తి చేయాల్సిన పనులు కొనసాగకపోగా / జరగకపోగా... అదే ఇబ్బంది తెచ్చిపెట్టే ప్రమాదమూ ఉందంటున్నారు కపుల్ కౌన్సెలింగ్ నిర్వాహకులు, మనస్తత్వ నిపుణులు. అంతేకాదు... అది పనితీరుతో పాటు, బంధాల విషయాల్లోనూ ప్రమాదం తెచ్చిపెట్టవచ్చునని హెచ్చరిస్తున్నారు. వస్తువులో కాదు... అంతా మన విచక్షణలోనే ఉంది... ‘‘ఏదైనా ప్రయోజనం అన్నది ఆ వస్తువును మనం ఉపయోగించే తీరులో లేదా మన విచక్షణను బట్టే ఉంటుందిగానీ... ఉపకరణంలో ఏమీ ఉండదు. ఇంగ్లిష్‌లో చెప్పా లంటే ‘ఆబ్జెక్ట్’లో కాకుండా ‘ఆబ్జెక్టివ్’లోనే అంతా ఉంది’’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు కొందరు మనస్తత్వ నిపుణులు. ఎప్పుడైనా అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఎదురుబొదురుగా ఉండి మాట్లాడుకోవడమే మంచిది. కొన్ని పదాలు, పంక్చువేషన్లు, ఎమోజీల వల్ల దురభిప్రాయాలు వచ్చే అవకాశమూ ఉంది. మాటల్లో చెప్పుకునే విషయాలను రాతలో పెట్టినప్పుడు అది మరింతగా హాని చేసే ప్రమాదం ఉంది. ‘మీ అభిప్రాయం తో ఏకీభవించకపోవచ్చు. కానీ మీ అభిప్రాయానికి విలువివ్వాల్సిందే’ అనే పరస్పర గౌరవ భావన, దృక్పథాల వల్లనే మంచి ఫలితాలు వస్తాయి. – డాక్టర్ సుజాత రాజమణి, మానసిక నిపుణులు -
‘నేను మీ పని మనిషిని కాను సార్’.. ఎయిర్ హోస్టెస్ తీరుపై ప్రశంసలు
ప్రముఖ ఏవీయేషన్ సంస్థ ఇండిగో సిబ్బంది, విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల మధ్య జరిగిన వాగ్వాదం సోషల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారింది. ఈ వివాదంలో మరో ఏవియేషన్ సంస్థ సీఈవో ఎయిర్ హోస్టెస్‌కు సపోర్ట్ చేశారు. నెటిజన్లు సైతం ఎయిర్ హోస్టెస్ తీరుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇండిగో సంస్థ ఇస్తాంబుల్- ఢిల్లీ విమానాల కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. డిసెంబర్ 16న ఇండిగో విమానంలోని ఓ ప్రయాణికుడు తానుకోరుకున్న ఫుడ్ ఐటమ్స్ అందుబాటులో లేవని వాగ్వాదానికి దిగాడు. ఫ్లైట్‌లో ఉన్న ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఈ ఆర్.గూర్ప్రీత్ సింగ్ మెన్స్ వీడియో తీసి సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో అది తెగ చక్కెర్లు కొడుతోంది. వాళ్లూ మనుషులే As I had said earlier, crew are human too. It must have taken a lot to get her to breaking point. Over the years I have seen crew slapped and abused on board flights, called "servant" and worse. Hope she is fine despite the pressure she must be under. https://t.co/cSPI0jQBZl — Sanjiv Kapoor (@TheSanjivKapoor) December 21, 2022 ఈ తరుణంలో ఫ్లైట్‌లో ప్రయాణికులు-ఎయిర్ హోస్టెస్ మధ్య జరిగిన ఘర్షణపై జెట్ ఎయిర్వేస్ సీఈవో సంజీవ్ కపూర్ స్పందించారు. ఇండిగో ఎయిర్ హోస్టెస్‌కు మద్దతు పలికారు. సిబ్బంది కూడా మనుషులేనని వ్యాఖ్యానించారు. ‘నేను ముందే చెప్పినట్లు,సిబ్బంది కూడా మనుషులే.నేను గత కొన్నేళ్లుగా విమానంలో సిబ్బందిని..చెంపదెబ్బలు కొట్టడం దూర్భాషలాడడం చూశాను. ప్రయాణికుడితో జరిగిన వాగ్వాదంలో ఆమె తీవ్రంగా త్తిడికి గురైంది. ఇప్పుడు ఆమె బాగుందని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. ఎయిర్ హోస్టెస్‌కు అండగా నెటిజన్లు సీఈవో వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందించారు.హెచ్ఆర్, యాజమాన్యం మహిళా సిబ్బందికి అండగా నిలుస్తారని ఆశిస్తున్నాను. వారు ఈ స్థాయిలో చేరేందుకు ఎంతో కష్టపడిందో అర్ధం చేసుకోవాలంటూ అండగా నిలుస్తున్నారు. ఈ ఘటనలో మహిళా సిబ్బంది తప్పు లేదని, ఎంతో ఓర్పుతో సమాధానం ఇచ్చిందని ప్రశంసిస్తున్నారు. ఫ్లైట్‌లో ఏం జరిగింది ఇండిగోకు విమానం ‘6ఈ 12’ ఇస్తాంబుల్ నుంచి ఢిల్లీ వైపు వస్తుంది. ప్రయాణ సమయంలో ఎయిర్ హోస్టెస్‌కు, ప్రయాణికుడి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో ప్రయాణికుడు దురుసగా ప్రవర్తించడంతో ఓ ఎయిర్ హోస్ట్ కన్నీటి పర్యంతమైంది. దీంతో మరో ఎయిర్ హోస్టెస్ వారికి సర్ది చెప్పి గొడవను సద్దుమణిగించేందుకు వెళ్లింది. అప్పటికే ఆగ్రహంతో ఉన్న ప్రయాణికుడు మరింత రెచ్చిపోయాడు. గొడవను సద్దుమణించేందుకు ప్రయత్నించిన సదరు మహిళా ఉద్యోగిని వైపు చేత్తో సంజ్ఞలు చేశాడు. దీంతో సహనం కోల్పోయిన ఆమె ప్రయాణికుడికి గట్టిగా సమాధానం ఇచ్చింది. Tempers soaring even mid-air: "I am not your servant" An @IndiGo6E crew and a passenger on an Istanbul flight to Delhi (a route which is being expanded soon with bigger planes in alliance with @TurkishAirlines ) on 16th December : pic.twitter.com/ZgaYcJ7vGv — Tarun Shukla (@shukla_tarun) December 21, 2022 "నువ్వు నా వైపు వేలు చూపుతూ ఎందుకు అరుస్తున్నావు. నీ వల్ల నా సిబ్బంది ఏడుస్తున్నారు. దయచేసి పరిస్థితని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సరిపడ భోజనాలు (విమానంలో) ఉన్నాయి. అందుబాటులో ఉన్న ఆహారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం’ అని మాట్లాడుతుండగా ప్రయాణికుడు అడ్డు తగిలాడు "ఎందుకు అరుస్తున్నావు?" అని ప్రయాణికుడు గట్టిగా అరిచాడు. ఎయిర్ హోస్ట్ తన స్వరం పెంచుతూ...ఎందుకంటే మీరు మా మీద అరుస్తున్నారు. నీ మీ పని మనిషిని కాదు సార్. ఎయిర్ హెస్ట్ని. ఇండిగో సంస్థ ఉద్యోగిని అంటూ అక్కడి నుంచి వెళ్లి పోయింది. శాండ్ విచ్ లేదని.. ఫ్లైట్ వివాదంపై ఇండిగో యాజమాన్యం స్పందించింది. ప్రయాణీకుడు శాండ్విచ్ అడిగారని, విమానంలో ఫుడ్ ఐటమ్ అందుబాటులో ఉందో లేదో తనిఖీ చేస్తామని సిబ్బంది చెప్పారు. కానీ ఆ వ్యక్తి ఎయిర్ హోస్టెస్‌పై అరవడం ప్రారంభించాడు. దీంతో భయాందోళనకు గురైన ఎయిర్ హోస్ట్ ఏడ్చినట్లు తెలిపింది. -
'ఆర్ఆర్ఆర్' ఇంటర్వెల్ ఫైట్ రీ క్రియేట్.. నెట్టింట వైరల్
జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ మల్టీస్టారర్‌గా జక్కన్న రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ ఏడాది మార్చిన 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, యాక్టింగ్.. ఇలా అన్ని కోణాల్లో తిరుగులేదు అనిపించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. జీ5లో ఈ చిత్రం తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండగా.. హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సినిమాలో తారక్-చెర్రీ నటన అద్భుతంగా ఉందని ప్రశంసలు రాగా, ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ మూవీకే హైలెట్‌గా నిలిచింది. ఆ సమయంలో రామ్-తారక్‌ల మధ్య వచ్చే పోరాటం, వారు పలికించే హావాభావాలు ప్రేక్షకులను ఎమోషనల్‌గా కట్టిపడేస్తాయి. అయితే ఇప్పుడు ఇదే ఫైటింగ్ సీక్వెన్స్‌ను 'నెల్లూరు కుర్రాళ్లు' అనే యూట్యూబ్ ఛానెల్ యువకులు రీ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఛానెల్ నుంచి ఇదివరకు వచ్చిన వకీల్ సాబ్, పుష్ప, క్రాక్, భీమ్లా నాయక్ సినిమాల్లోని సన్నివేశాల రీ క్రియేట్ వీడియోలు ప్రశంసలు అందుకున్నాయి. చదవండి: 'బ్రహ్మాస్త్ర'కు నిరసన సెగ.. బాయ్‌కాట్ పేరిట ట్రెండింగ్.. ఎందుకంటే ? ముసలిదానివైపోతున్నావ్.. అంటూ అనసూయపై కామెంట్లు -
తెల్లవారిని హడలెత్తించిన ఎర్ర మిరపకాయ్
రంపచోడవరం(తూర్పుగోదావరి): పచ్చని మన్య సీమలో అమాయక గిరిజనంపై ఆంగ్లేయులు సాగించిన అకృత్యాలపై.. విల్లంబులు ఎక్కుపెట్టిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు సాగించిన మహోజ్వల సాయుధ పోరాటం ఇప్పటికీ.. ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. ఈ పోరాటంలో భాగంగా ఆయన సారథ్యంలోని గిరిజన వీరులు బ్రిటిష్ పోలీస్ స్టేషన్లపై వరుస దాడులు చేశారు. ఆ క్రమంలో తాము దాడులు చేస్తున్నట్టు బ్రిటిష్ సైన్యానికి ముందుగానే హెచ్చరిక సందేశం పంపేవారు. కాగితంపై రాసిన ఆ సందేశాన్ని బాణానికి గుచ్చి, దానిపై ఎర్ర మిరపకాయల గుత్తి తగిలించేవారు. ఆవిధంగా ఎర్ర మిరప కాయల గుత్తితో పోలీస్ స్టేషన్ వద్ద బాణం నాటుకొంటే చాలు.. బ్రిటిష్ పోలీసులు హడలెత్తిపోయేవారు. అడ్డతీగల మండలం పైడిపుట్ట వద్ద సీతారామరాజు కొంత కాలం నివాసం ఉన్నారు. బ్రిటిష్ వారిపై తిరుగుబాటు జెండా ఎగుర వేసిన తరువాత అడవుల్లోకి వెళ్లి బ్రిటిష్ సేనలను ఎదిరించేందుకు రంగం సిద్ధం చేశారు. దీనిలో భాగంగా 1922లో విశాఖ జిల్లా కృష్ణదేవీపేట (కేడీ పేట) పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. అక్కడి ఆయుధాలను స్వా«దీనం చేసుకుని, దాడి చేసినట్టు సమయం తెలుపుతూ ఉత్తరం ఉంచారు. కొద్ది రోజుల్లోనే రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. ఈ దాడికి కొంత సమయం తీసుకోవడంతో బ్రిటిష్ అధికారులకు సీతారామరాజు భయపడ్డాడని ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో అడ్డతీగల మండలం పైడిపుట్ట వద్ద ఆయన గిరిజనులతో సమావేశమయ్యారు. అడ్డతీగల పోలీస్ స్టేషన్‌పై దాడి చేస్తున్నట్లు 1922 అక్టోబర్ 10న బాణానికి మిరపకాయ గుత్తి ఉంచి సందేశం పంపించారు. ఆ స్టేషన్‌పై దాడి చేసేందుకు గుర్రం మీద తేనెలమంగి గ్రామంలోని తెల్ల మద్ది చెట్టు వద్దకు రాత్రి చేరుకుని వ్యూహం రచించారు. 1922 అక్టోబర్ 15న దాడి చేసి ఆయుధాలు కొల్లగొట్టారు. స్టేషన్‌పై దాడి చేసినట్టు లేఖ ఉంచారు. ఆ తరువాత నాలుగు రోజుల వ్యవధిలోనే అక్టోబర్ 19న రంపచోడవరం పోలీస్ స్టేషన్‌పై కూడా అల్లూరి దాడి చేశారు. తెల్లవారి వెన్నులో వణుకు పుట్టించేలా అల్లూరి మహోధృతంగా సాగించిన సాయుధ పోరాటంలో మిరపకాయ టపాకు ఈవిధంగా ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఉద్యమానికి వందేళ్లు అయిన సందర్భంగా నాటి సంఘటనకు గుర్తుగా ఆ మహావీరుని చిత్రంతో తపాలా శాఖ ప్రత్యేక కవర్ విడుదల చేస్తోంది. రంపచోడవరంలో బుధవారం జరిగే ఈ కార్యక్రమంలో కలెక్టర్ సి.హరికిరణ్, రంపచోడవరం ఐటీడీఏ పీఓ ప్రవీణ్ ఆదిత్య, సబ్ కలెక్టర్ కట్టా సింహాచలం, అడిషనల్ ఎస్పీ కృష్ణకాంత పటేల్, రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ డాక్టర్ ముత్యాల వెంకటేశ్వర్లు, రంపచోడవరం సర్పంచ్ మంగా బొజ్జయ్య పాల్గొంటారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అడ్డతీగలలో కూడా అల్లూరి పోరాటంపై ప్రత్యేక తపాలా చంద్రికను ఆవిష్కరించనున్నారు. తపాలా శాఖ, హైదరాబాద్‌కు చెందిన మిత్రా గ్రూప్ కంపెనీల అధినేత ఆర్‌ఆర్‌కే రాజుల సంయుక్త ఆధ్వర్యాన స్థానిక శ్రీ సాయి సన్నిధి ఫంక్షన్ హాలులో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. -
ఒకే పార్టీ టిక్కెట్టు కోసం పోటీపడుతున్న భార్యాభర్తలు
సాక్షి, న్యూఢిల్లీ: అధికారం కోసం కుటుంబ సభ్యులు పోరాడడం సహజం. అయితే, యూపీ ఎన్నికల్లో ఒకే నియోజకవర్గంలో ఒకే పార్టీ నుంచి పోటీ చేయడానికి ఆలుమగలు పోటీపడడం ఆసక్తికరంగా మారింది. సరోజనీనగర్ సీటు కోసం సీఎం యోగి ఆదిత్యనాద్ మంత్రివర్గంలోని స్వాతి సింగ్, ఆమె భర్త పార్టీ ప్రదేశ్ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ ఇద్దరూ పోటీ పడుతున్నారు. ఫిబ్రవరి 23న నాలుగో దశలో ఈ నియోజకవర్గం ఎన్నిక జరగనుంది. దయాశంకర్ పార్టీ ఎన్నికల కమిటీలో సభ్యుడు కావడంతోపాటు ఇటీవల ములాయంసింగ్ యాదవ్ కోడలు అపర్ణ యాదవ్‌ను పార్టీలో చేర్చడంలో కీలకపాత్ర పోషించారు. స్వాతి సింగ్ ప్రస్తుతం పలు శాఖల సహాయ మంత్రిగా, స్వతంత్రహోదా మంత్రిగా ఉన్నారు. 2016లో పార్టీలో చేరిన స్వాతి సింగ్ 2017లో సరోజనీ నగర్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2016లో బీఎస్పీ అధినేత్రి మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఏడాదిపాటు దయాశంకర్‌ను పార్టీ సస్పెండ్ చేసింది. అన్సల్ బిల్డర్స్పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన పోలీసు అధికారిని బెదిరించారంటూ స్వాతి సింగ్‌పైనా ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఓ పక్క భార్యాభర్తలు ఇద్దరూ సరోజనీనగర్‌లో హోర్డింగ్‌లతో హోరెత్తిస్తుంటే పార్టీ అధిష్ఠానం మూడో వ్యక్తిని పరిశీలించే అవకాశం లేకపోలేదని సీనియర్ నేతలు చెబుతున్నారు. మంత్రి మహేంద్ర సింగ్, మాజీ సీఎం కల్యాణ్ సింగ్ సన్నిహితుడు రాజేష్‌సింగ్ చౌహాన్, మాజీ కౌన్సిలర్లు గోవింద్పాండే, రామశంకర్త్రిపాఠిలతోపాటు సౌరభ్‌సింగ్, జిల్లా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామ్‌కుమార్ సింగ్ చౌహాన్ కూడా ఈ సీటును ఆశిస్తుండంతో అధిష్ఠానం వీరి పేర్లూ పరిశీలిస్తోంది. -
Cockfight: ‘మకాం’ వేసిన పందెం కోళ్లు
తగరపువలస(భీమిలి): సంక్రాంతి బరిలో కయ్యానికి పందెం కోళ్లు సిద్ధంగా ఉన్నాయి. ఏడాది పాటు వీటికి శిక్షణ ఇచ్చి, ఆహారాన్ని పెట్టుబడిగా పెట్టిన వ్యాపారులు, రైతులు ప్రస్తుతం వీటి విక్రయాలపై దృష్టి సారించారు. పందెం కోళ్లను సిద్ధం చేసే ప్రాంతాలను మకాం అంటారు. ప్రస్తుతం ఇలాంటి మకాంలు ఉత్తరాంధ్రలో 250కు పైగా ఉన్నాయి. మకాంలలో లక్షలాది పందెం కోళ్లు పోరాటంలో శిక్షణ పొంది కాలు దువ్వుతున్నాయి. వీటిలో పైచేయి సాధించే కోళ్ల కోసం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన పందెం రాయుళ్లు ఉత్తరాంధ్రకు వచ్చి మకాంలలో సరైన కోడి కోసం డేగ కళ్లతో వేట మొదలెట్టారు. చదవండి: Good Governance Index 2021: సర్వతోముఖాభివృద్ధి దిశగా ఏపీ ఇలాంటి మకాంలు ఎక్కువగా భీమిలి, పద్మనాభం, ఆనందపురం మండలాలు, తిమ్మాపురం, సాగర్‌నగర్, ఆరిలోవ, నర్సీపట్నంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్నాయి. పందెం కోళ్లలో సేతువ, కక్కెర, సవల, పాస, రసంగి, డేగ, పచ్చకాకి, అబాస్లకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఏడాది వయసున్న కోళ్లు రూ.15 వేల నుంచి 20 వేలు, ఏడాదిన్నరవి రూ.30 వేలు, నాలుగేళ్ల వయసు వరకూ ఉన్నవి రూ.40 వేల వరకూ ధర పలుకుతున్నాయి. ఒక్క ఉత్తరాంధ్రలోనే రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకూ వ్యాపారం జరుగుతుందంటే పందెం కోళ్లకున్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఒక్కో మకాంలో 50 నుంచి వందలాది కోళ్లుంటాయి. వీటికి ప్రత్యేకంగా రోజుకు నాలుగు బాదం పప్పులు, కోడిగుడ్లు, వారానికోసారి ఖైమా, చోళ్లు, గంట్లుతో పాటు రోజూ రెండు పూటలా తడిపిన ధాన్యాన్ని ఆహారంగా ఇస్తారు. మధ్యాహ్నం వేళల్లో అలసిపోయే వరకూ ఈతకు వదులుతారు. ఏడాది కాలంలో ఒక్కో కోడిపై రూ.10 వేలకు పైగా ఖర్చు చేస్తారు. వీటిని చంటిపిల్లల్లా చూసుకుంటారు. రోగాలు రాకుండా యాంటీబయోటిక్ టాబ్లెట్లు, ఇంజెక్షన్లు ఇస్తుంటారు. విదేశీ బ్రీడ్లకు భలే డిమాండ్ విశాఖకు చెందిన ఒక మకాం యజమాని రూ.18 లక్షలు వెచ్చించి విదేశాల నుంచి మైలా బ్రీడ్ పుంజును కొనుగోలు చేశారు. దానితో దేశవాళీ కోడిపెట్టలను సంకరం చేయించి.. వెయ్యి పిల్లలను పొదిగించి ఒక్కో కోడిని రూ.5 వేలకు విక్రయించడం ద్వారా ఏడాదిన్నరలో రూ.50 లక్షల ఆదాయం పొందినట్టు చెప్పాడు. ఈ కోళ్లు బరిలోకి దిగితే రూ.లక్షలాది రూపాయలు కొట్టుకొస్తాయని పందెం రాయుళ్లకు గట్టి నమ్మకం. అలాగే ఫిలిప్పీన్స్, పెరూ దేశానికి చెందిన మేలు జాతి కోడి పెట్టలు ఒక్కోటి రూ.6–7 లక్షలు పలుకుతున్నాయి. వీటిని కూడా సంకరం చేయించడం ద్వారా మంచి ఆదాయాన్నిచ్చే పందెం పుంజులను సృష్టిస్తున్నారు. ప్రత్యేక శిక్షణ పొంది పందేలకు సిద్ధంగా ఉన్న కోడిపుంజులు ప్రభుత్వ అనుమతులే కీలకం గతేడాది ప్రభుత్వం అనుమతులు లేని కారణంగా ఉత్తరాంధ్రలో పందెం కోళ్ల వ్యాపారం జరగలేదు. ఒక్క పందెం కోడి పుంజు కూడా విక్రయం కాలేదు. ఈ ఏడాది ప్రభుత్వం అనుమతిపైనే వ్యాపారం ఆధారపడి ఉంటుంది. చాలామంది వచ్చి వారికి నచ్చిన బ్రీడ్లను ఎంపిక చేసుకుంటున్నారు. హైదరాబాద్, ఏలూరు, భీమవరం, నర్సీపట్నం, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల వారితో కొనుగోళ్లు, అమ్మకాలు చేస్తుంటాం. – ఎన్.వరాహరఘునాథరెడ్డి, తగరపువలస కోళ్లకు రోగం వస్తే.. ఇక అంతే... పందెం కోళ్ల పెంపకం రిస్క్‌తో కూడుకున్నది. పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వస్తున్నప్పటికీ వాటికి సోకే రోగాలపై అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఒక్కోసారి రూ.లక్షలు పోసి కొనుగోలు చేసినా ఎలాంటి ఆదాయం రాకుండానే మృత్యువాత పడుతుంటాయి. నాటు కోళ్లతో పోలిస్తే పందెం కోళ్లకు తెగుళ్లు తక్కువ. ప్రస్తుతం రైతులంతా నాటుకోళ్ల పెంపకంపైనే ఆసక్తి చూపుతున్నారు. రిస్క్ కూడా ఎక్కువే. – నమ్మి ఎర్రినాయుడు, ఆనందపురం -
కుంచనపల్లిలో పందుల పోటీలు
తాడేపల్లిగూడెం రూరల్: సంక్రాంతి పేరు చెబితే మనకు ప్రధానంగా గుర్తుకొచ్చేది కోడిపందేలు. అయితే, మండలంలోని కుంచనపల్లి గ్రామంలో మాత్రం ఈ సంప్రదాయానికి భిన్నంగా పందుల పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఎస్టీ సంక్షేమ సంఘం నాయకులు సింగం పట్టాభి, సుబ్బారావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ పోటీలు బుధవారం జరిగాయి. జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పందుల పెంపకందారులు ఈ పోటీలకు తరలివచ్చారు. కత్తులు కట్టకుండా ఎటువంటి జీవహింస లేకుండా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్టు సింగం సుబ్బారావు తెలిపారు. పోటీ నుంచి పారిపోయిన పంది పరాజయం పొందినదిగా భావించి బరిలో నిలబడిన పంది విజయం సాధించినట్లుగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ పోటీల్లో ఎటువంటి జీవహింస లేదని, తమపై వన్యప్రాణి సంరక్షణ సమితి వారు కేసులు నమోదు చేయడం సరికాదని వివరించారు. పోటీలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. -
మీరు ఫైన్ వేస్తే..మేము లైన్ కట్ చేస్తాం
పెద్దపల్లి: ఎవరి అధికారం వారిది. ఎవరి డ్యూటీ వారిదేనంటూ ట్రాఫిక్ పోలీసులు, ట్రాన్స్‌కో ఉద్యోగులు నిరూపించుకున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రలో ట్రాఫిక్ పోలీసు, ట్రాన్స్‌కో ఉద్యోగుల మధ్య శుక్రవారం విధి నిర్వహణ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఓ ట్రాన్స్‌కో ఉద్యోగికి ట్రాఫిక్ పోలీసులు నిబంధనల పేరిట రూ.2 వేల జరిమానా విధించారు. తాను ఉద్యోగిని అంటూ చెప్పినప్పటికీ పోలీసులు జరిమానా విధించారు. దీంతో ఆగ్రహించిన ట్రాన్స్‌కో ఉద్యోగి.. మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. మరీ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ బకాయి సంగతేందంటూ నిలదీశాడు. వెంటనే ట్రాన్స్‌కో సిబ్బంది పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి బకాయి చెల్లించండి సార్ అంటూ ప్రశ్నించారు. తమ డ్యూటీ తాము చేస్తున్నామని, కరెంట్ స్తంభం ఎక్కి లైన్‌కట్ చేసి వెళ్లారు. పైఅధికారులు ట్రాన్స్‌కో సిబ్బందిని మందలించడంతో తిరిగి సాయంత్రం వరకు ట్రాఫిక్ ఠాణాలో లైట్లు వెలిగాయి. ఈ విషయమై ట్రాఫిక్ సీఐ బాబురావు వివరణ ఇస్తూ.. కరెంటు పాత వైరు మార్చివేసి కొత్త వైరు ఏర్పాటు చేశారని, ఇందులో అపోహాలకు తావులేదన్నారు. -
ధర్మనిరతి అంటే అది!
పూర్వం కాశీరాజ్యంలోని ఒక అడవిలో ధర్మనిరతుడు అనే భిక్షువు ఉండేవాడు. ఆ అడవిలో ఒక పెద్ద కొలను ఉంది. దాన్నిండా తామరపూలు. లేత పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. ఆ సరోవరం దాపునే ధర్మనిరతుని నివాసం. ఆ సరోవరానికి ఒక కాపలాదారు ఉన్నాడు. ఒకరోజున ఉదయాన్నే ధర్మనిరతుడు లేచి కొలనులో స్నానం చేసి, గాలి వాలుకు పోయి నిలబడ్డాడు. పూలపరిమళాలు పీలుస్తూ తన్మయుడవుతున్నాడు. అంతలో అతన్ని కాపలాదారు ‘‘స్వామీ! దొంగతనం తప్పా? ఒప్పా?’’ అడిగాడు. ‘‘నాయనా! దొంగతనమే కాదు, ఒకరు ఇవ్వకుండా మనది కానిది ఏది తీసుకున్నా తప్పే. అదీ దొంగతనం కిందే లెక్క’’ అన్నాడు చిరునవ్వుతో. ‘‘అయితే... మీరు దొంగే!’’ అన్నాడు కాపలాదారు. ‘‘నేనా? నేనేమీ దొంగిలించలేదే’’ అన్నాడు భిక్షువు. ‘‘ఇదిగో... ఈ పూలపరిమళాలు ఆఘ్రాణించారు కదా! ఇది గంధచౌర్యమే కదా. తమరు నా కొలనులోని సువాసనల్ని దొంగిలించినట్లే కదా’’ అన్నాడు. భిక్షువు అతనితో అలా మాట్లాడుతూ ఉండగానే, కొలను ఆవలిగట్టున ఒక వ్యక్తి వచ్చి కొలనులో దిగి కొన్ని తామరపూలు తెంపుకుని వెళ్లిపోయాడు. అతణ్ణి కాపలాదారు చూశాడు. కానీ, అతణ్ణి ఏమీ అనలేదు. కనీసం కేకవేసి మందలించలేదు. అప్పుడు భిక్షువు– ‘‘బాగుందయ్యా! వాసన చూసిన నన్ను తప్పుపట్టావు. పూలు తెంపుకుపోతున్న వాణ్ణి పన్నెత్తి చూడలేదు’’అని అడిగాడు. ‘‘స్వామీ! అతను లోభి. ధూర్తుడు. అజ్ఞాని. కానీ, తమరు జ్ఞానులు. ప్రబోధకులు. స్వచ్ఛమైన కర్మలు ఆచరించేవారు. దోషం ఎంచలేని దొడ్డవారు. అతను పెద్ద తప్పు చేసినా చిన్నగానే కనిపిస్తుంది. మీలాంటివారు కంట్లో నలుసంత తప్పు చేసినా కారుమేఘమంతగా అందరికీ కనిపిస్తుంది కదా!’’ అన్నాడు. భిక్షువు మౌనం వహించాడు. ధార్మికులు జీవితంలో ఎంత జాగరూకులై ఉండాలో బుద్ధుడు చెప్పిన సందేశాత్మక కథ ఇది. – డా. బొర్రా గోవర్ధన్ మీకు తెలుసా ►కుటుంబసభ్యుల మధ్య వున్న విభేదాలు, తగాదాలు, ఘర్షణలు తొలగిపోయి... అందరూ కలిసి మెలిసి సత్సంబంధాలుగా ఏర్పడేందుకు ‘విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామాల’ ను నిత్యం పారాయణం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజూ పఠిస్తే.. ఏ సమస్యలు తలెత్తవు. అన్ని పనులలో విజయాలను సాధిస్తారు. ►లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ని నిత్యం పారాయణం చేస్తే మంచి సద్గుణాలతో కలిగినవారు వివాహ సంబంధాలు తీసుకువస్తారు. అలాగే పెళ్లి పనులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా జరుగుతాయి. ►సంతానం లేని వారు ప్రతిరోజు ‘గోపాల స్తోత్రం’ ను పఠిస్తే.. మంచి ఫలితం లభిస్తుందని... అలాగే గర్భిణులు ఇదే స్తోత్రాన్ని ప్రతిరోజు పఠిస్తే ప్రసవం సుఖంగా అవుతుందని పండితులు, పురోహితులు శాస్త్రాల ఆధారంగా చెబుతున్నారు. ►గరికను నగదు ఉంచే ప్రదేశంలో పెడితే, రావలసిన నగదు త్వరగా వచ్చేస్తుంది. ►శనీశ్వరుడిని శనివారం నాడు గరికతో పూజిస్తే ఏలిననాటి శని, అష్టమ శని దోషాలు తొలగిపోతాయి. ►గరికను దారంతో కట్టి గణపతికి మాల వేస్తే కోరికలు నెరవేరుతాయి. -
యూరప్ కు మళ్ళీ ఉగ్ర ముప్పా..?
యూరప్ లో మళ్ళీ ఉగ్రదాడులకు ఆస్కారం ఉందంటున్నాయి భద్రతా సంస్థలు. పారిస్, బ్రసెల్స్ లో ఘోరమైన తీవ్రవాద దాడుల అనంతరం వాతావరణం కాస్త ప్రశాంతంగా కనిపిస్తున్నా... ఇస్టామిక్ స్టేట్ మిలిటెంట్లు మాత్రం అదే పనిలో ఉన్నట్లు బెల్జియన్ అధికారులు నమ్ముతున్నారు. గతనెల బ్రసెల్స్ దాడుల తర్వాత మరింతమంది మిలిటెంట్లను ఐసిస్.. యూరప్ లోకి పంపేపనిలో పడిందని అధికారులు అనుమానిస్తున్నారు. యూరప్ లో ఉగ్రదాడుల స్థాయి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదులతో యూరప్, బెల్జియం లకు మరింత ముప్పు ఉందని గత దాడుల తర్వాత ఇప్పటివరకూ ముప్పు స్థాయి ఏమాత్రం తగ్గలేదని మూడుగానే ఉందని, దేశ సంక్షోభ కేంద్ర ప్రతినిధి ఒకరు వెల్లడించారు. మరింత ముప్పు ఉన్నట్లుగా యూరోపియన్ యూనియన్ సెక్యూరిటీ ఏజెన్సీ అధిపతినుంచి హెచ్చరిక వచ్చిందని, అయితే అది పూర్తిశాతం నిజం కాకపోవచ్చునని, బ్రసెల్స్, పారిస్ దాడుల్లో పాల్గొన్న వారందరినీ అరెస్టు చేశామని ఆయన తెలిపారు. అయితే ఇతర ఉగ్రమూకలు యూరప్ పై దాడికి ప్రణాళిక చేస్తున్నట్లు ఖచ్చితంగా నమ్మలేమన్నారు. గత నవంబర్ లో జరిగిన ప్యారిస్ దాడిలో 130 మంది చనిపోగా అనేకమంది గాయపడ్డారు. దాదాపు నాగులు నెలల అన్వేషణ అనంతరం గతనెల్లో దాడికి బాధ్యుడైన ఓ అనుమానితుడు సలాహ్ ఆబ్డెస్లామ్ ను సజీవంగా పట్టుకున్నామని, దానికి ఒక వారం తర్వాత డెన్మార్క్ పోలీసులు కొన్ని పేలుడు పదార్థాలతోపాటు నలుగురు అనుమానిత ఇస్లామిక్ స్టేట్ తీవ్ర వాదులను అరెస్టు చేశారని అధికారులు తెలిపారు. దాడులకు పాల్పడ్డ వారంతా ఐసిస్ రిక్రూట్ మెంట్ లోని వారేనని తెలిసేందుకుగాను దానికి సంబంధించిన ఫైళ్ళను నెట్వర్క్ లో పొందు పరిచారని దాంతో విషయం లీకయినట్లు తెలిపారు. అయితే ఇస్లామిక్ స్టేట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న ఓ మొరొక్కన్ అనుమానిత వ్యక్తిని పాల్మా డి మల్లోర్కా ద్వీపంలో అరెస్టు చేసినట్లు స్పానిష్ పోలీసులు ప్రకటించారు. ఆ అనుమానిత వ్యక్తికి సిరియాలోని ప్రముఖ టెర్రరిస్టులతో స్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తున్నాయని పోలీసులు తెలిపారు.