RRR Interval Fight Scene Nellore Kurrallu New Video Viral - Sakshi
Sakshi News home page

RRR Movie: 'ఆర్‌ఆర్‌ఆర్' ఇంటర్వెల్‌ సీన్‌.. అదరగొట్టిన నెల్లూరు కుర్రాళ్లు

Published Thu, Jun 16 2022 7:42 PM | Last Updated on Thu, Jun 16 2022 8:03 PM

Nellore Kurrallu Recreates RRR Interval Fight Scene Video Goes Viral - Sakshi

జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ మల్టీస్టారర్‌గా జక్కన్న రూపొందించిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ ఏడాది మార్చిన 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. విజువల్‌ ఎఫెక్ట్స్‌, మ్యూజిక్‌, యాక్టింగ్‌.. ఇలా అన్ని కోణాల్లో తిరుగులేదు అనిపించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. జీ5లో ఈ చిత్రం తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్‌ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతుండగా.. హిందీ వెర్షన్‌ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. 

ఈ సినిమాలో తారక్-చెర్రీ నటన అద్భుతంగా ఉందని ప్రశంసలు రాగా, ముఖ్యంగా ఇంటర్వెల్‌ సీన్‌ మూవీకే హైలెట్‌గా నిలిచింది. ఆ సమయంలో రామ్-తారక్‌ల మధ్య వచ్చే పోరాటం, వారు పలికించే హావాభావాలు ప్రేక్షకులను ఎమోషనల్‌గా కట్టిపడేస్తాయి. అయితే ఇప్పుడు ఇదే ఫైటింగ్‌ సీక్వెన్స్‌ను 'నెల్లూరు కుర్రాళ్లు' అనే యూట్యూబ్‌ ఛానెల్‌ యువకులు రీ క్రియేట్‌ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ ఛానెల్ నుంచి ఇదివరకు వచ్చిన వకీల్‌ సాబ్‌, పుష్ప, క్రాక్‌, భీమ్లా నాయక్‌ సినిమాల్లోని సన్నివేశాల రీ క్రియేట్‌ వీడియోలు ప్రశంసలు అందుకున్నాయి.

చదవండి: 'బ్రహ్మాస్త్ర'కు నిరసన సెగ.. బాయ్‌కాట్‌ పేరిట ట్రెండింగ్‌.. ఎందుకంటే ?
ముసలిదానివైపోతున్నావ్‌.. అంటూ అనసూయపై కామెంట్లు


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement