interval
-
'ఆర్ఆర్ఆర్' ఇంటర్వెల్ ఫైట్ రీ క్రియేట్.. నెట్టింట వైరల్
జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ మల్టీస్టారర్‌గా జక్కన్న రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ ఏడాది మార్చిన 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, యాక్టింగ్.. ఇలా అన్ని కోణాల్లో తిరుగులేదు అనిపించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. జీ5లో ఈ చిత్రం తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండగా.. హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సినిమాలో తారక్-చెర్రీ నటన అద్భుతంగా ఉందని ప్రశంసలు రాగా, ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ మూవీకే హైలెట్‌గా నిలిచింది. ఆ సమయంలో రామ్-తారక్‌ల మధ్య వచ్చే పోరాటం, వారు పలికించే హావాభావాలు ప్రేక్షకులను ఎమోషనల్‌గా కట్టిపడేస్తాయి. అయితే ఇప్పుడు ఇదే ఫైటింగ్ సీక్వెన్స్‌ను 'నెల్లూరు కుర్రాళ్లు' అనే యూట్యూబ్ ఛానెల్ యువకులు రీ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఛానెల్ నుంచి ఇదివరకు వచ్చిన వకీల్ సాబ్, పుష్ప, క్రాక్, భీమ్లా నాయక్ సినిమాల్లోని సన్నివేశాల రీ క్రియేట్ వీడియోలు ప్రశంసలు అందుకున్నాయి. చదవండి: 'బ్రహ్మాస్త్ర'కు నిరసన సెగ.. బాయ్‌కాట్ పేరిట ట్రెండింగ్.. ఎందుకంటే ? ముసలిదానివైపోతున్నావ్.. అంటూ అనసూయపై కామెంట్లు -
‘వ్యాక్సిన్ల మధ్య విరామం ఎక్కువైతే ముప్పే’
వాషింగ్టన్: కరోనా టీకా డోసుల మధ్య విరామ సమయాన్ని పెంచడం ద్వారా కరోనా వేరియంట్ల బారిన పడే ప్రమాదముందని అమెరికా మెడికల్ అడ్వైజర్, ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోని ఫౌసీ హెచ్చరించారు. బ్రిటన్‌లో ఇదే జరిగిందని చెప్పారు. కాగా షెడ్యూల్ ప్రకారం టీకా వేయాలని సూచించారు. గత నెలలో భారత ప్రభుత్వం టీకాల మధ్య విరామ సమయాన్ని పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విలేకరులు దీనిపై అడిగిన ప్రశ్నకు డాక్టర్ ఫౌసీ ఈ విధంగా స్పందించారు. ఇక అమెరికాలో కొత్తగా వెలుగుచూసిన డెల్టా వేరియంట్ బలంగా ఉందని, దాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు వీలైనంత త్వరగా టీకా వేయాలని ఫౌచీ సూచించారు. వ్యాక్సిన్ల మోతాదుల మధ్య అనువైన విరామం సమయం.. ఫైజర్‌కు మూడు వారాలు, మోడర్నాకు నాలుగు వారాలుగా తెలిపారు. విరామ సమయం పొడగించడంతో పలు రకాల వేరియంట్ల బారినపడే అవకాశాలు ఎక్కువని వెల్లడించారు. భారత్‌తో పాటు పలు దేశాల్లో డెల్టా వేరియంట్ బలంగా ఉందని గుర్తు చేశారు. టీకాలు వేసిన దేశాల్లో వ్యాప్తి తక్కువగా ఉందన్నారు. కొవిడ్‌తో పోరాడేందుకు టీకాలు కీలకమని, ఎవరైనా ఇంతకు ముందు వైరస్ బారినపడినప్పటికీ టీకాలు వేయడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో వచ్చే కరోనా థర్డ్, మరిన్ని వేవ్‌ల నుంచి ప్రజలను రక్షించడంలో వ్యాక్సిన్ కీలకమని వివరించారు.ఇటీవల భారత్‌లో కొవీషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య విరామ కాలాన్ని ప్రభుత్వం మొదట ఆరు నుంచి 8 వారాలకు పెంచిన ప్రభుత్వం ఆ తరువాత 12 నుంచి 16 వారాలకు పెంచింది. అంతకు ముందు మార్చి నెలలో అయితే 28 రోజులు ఉంటే సరిపోతుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. చదవండి: డెల్టా వేరియంట్ ఎంత డేంజరో తెలుసా? -
నిప్పుకణం
మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ తెలుగు సినిమాలో క్లాసిక్ అన్న పేరున్న ఒక సినిమాలోని సీన్స్ ఇవి. ఇంటర్వెల్ తర్వాతి సీన్ హీరోయిజాన్ని పీక్స్‌కు తీసుకెళ్లేలా ఉంటుంది. ఒక స్టార్ హీరో నటించారు ఈ సినిమాలో! దర్శక, రచయిత ఇప్పుడొక స్టార్ డైరెక్టర్. ఆ సినిమా ఏంటో చెప్పుకోండి చూద్దాం? అది సత్యనారాయణ మూర్తి ఇల్లు. బాశర్లపూడి గ్రామం. ఒక రాజకీయ నాయకుడి హత్య కేసుకు సంబంధించి సత్యనారాయణ మూర్తి మనవడు పార్థసారథిని విచారించడానికి సీబీఐ ఆఫీసర్ ఆంజనేయ ప్రసాద్ వచ్చి మూర్తికి ఎదురుగా కూర్చున్నాడు. ‘‘మీరో చిన్న సాయం చేయాలి!’’ ఆంజనేయ ప్రసాద్ నవ్వుతూ ప్రశాంతంగా అడిగాడు.‘‘నేనేం చేయగలను బాబూ!’’ మూర్తి అంతే ప్రశాంతంగా నవ్వుతూ సమాధానమిచ్చాడు.‘‘పార్థ్ధసారథి అని..’’‘‘పార్థూ నా మనవడు..’’ ఆంజనేయ ప్రసాద్ పూర్తి చేయకముందే మూర్తి అందుకొని జవాబు ఇచ్చేశాడు.‘‘ఆయన్ను ఒకసారి కలవాలి..’’ మూర్తి అనుమానంగా, భయంగా చూస్తూ కూర్చున్నాడు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదాయనకు. పార్థుని పిలవమని కాఫీ అందించడానికి వచ్చిన మనవరాలికి చెప్పాడు. ఆంజనేయ ప్రసాద్ ఆయనతో పాటు వచ్చిన టీమ్ అంతా కేసుకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటున్నారు. పార్థూ దగ్గర్నుంచి తాము ఎలాంటి ఆధారాలు సేకరించవచ్చు అన్న విషయంపైనే మాట్లాడుకుంటున్నారు.తన కోసం ఎవరో వచ్చారని తెలియగానే గార్డెన్ నుంచి హాల్లోకి బయలుదేరాడు పార్థు. సీబీఐ బృందాన్ని చూడగానే అతడిలో కొంత వణుకు. చెమటలు పడుతున్నాయి.పార్థు ఆంజనేయ ప్రసాద్‌కు దగ్గరగా వచ్చి నిలబడ్డాడు.‘‘ఆంజనేయ ప్రసాద్.. సీబీఐ’’ అంటూ తన చేతిలోని విజిటింగ్ కార్డు పార్థుకి ఇచ్చాడు ఆంజనేయ ప్రసాద్.కంగారుగానే కార్డును అందుకొని చూసి తిరిగిచ్చేశాడు పార్థు. ‘‘ఇంత ఈజీగా దొరుకుతారనుకోలేదు.’’ నవ్వుతూ అన్నాడు ఆంజనేయ ప్రసాద్.పార్థు మరింత భయపడ్డాడు. ఒళ్లంతా చెమటలు పట్టాయి. దొరికిపోయినట్లు నిలబడ్డాడు. ఇంటర్వెల్ పడింది. ఇంటర్వెల్ తర్వాత.. అదే ఇల్లు. సీబీఐ ఆఫీసర్, పార్థు ఎదురెదురుగా కూర్చున్నారు.‘‘ఏంటలా చూస్తున్నారూ? కానిస్టేబుల్ కూడా రాని ఇంటికి సీబీఐ వాళ్లు వచ్చారనా?’’ పార్థుని అడిగాడు ఆంజనేయ ప్రసాద్ చేతిలో ఉన్న కొన్ని పేపర్స్ తిరగేస్తూ.‘‘ఎందుకొచ్చారని!’’ పార్థు సమాధానమిచ్చాడు.‘‘కొంచెం పెద్ద కథే! చిన్నగా చెప్తాను. నలభై రోజుల క్రితం అపోజిషన్ లీడర్ శివారెడ్డి మర్డర్ జరిగింది.. మీకు తెలిసే ఉంటుంది! ఆయనను చంపినవాడు ట్రైన్ ఎక్కి పారిపోయాడు. అతడినెవ్వరూ చూడలేదు. బట్ అతడిని చేజ్ చేసిన ఎస్పీ వెనక నుంచి చూశాడు. సో ఆ ట్రైన్ గుడివాడలో ఆగినప్పుడు చొక్కా చూసి ఆ ఎస్పీ కాల్చాడు. బట్ ఆ కాల్పుల్లో హంతకుడు కాకుండా వేరేవాడు చనిపోయాడు. అతని వివరాలు మాకు దొరకలేదు. బట్ శవం ఉన్న కంపార్ట్మెంట్, సీట్ నంబర్స్‌ని బట్టి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఈ రిజర్వేషన్ చార్ట్ సంపాదించాం. ఇందులో మీ పేరు, వివరాలు ఉన్నాయి. బట్ యూ ఆర్ హియర్ అండ్ హెల్తీ!’’ కథంతా చెప్పుతూ వచ్చాడు ఆంజనేయ ప్రసాద్. పార్థు ఏమీ మాట్లడలేదు. ‘‘పార్థు మీరేగా?’’ అనుమానంగా మళ్లీ అడిగాడు ఆంజనేయ ప్రసాద్. అవునన్నట్టు తలూపాడు పార్థు. ‘‘వెల్! కమింగ్ టు ది పాయింట్.. మీరు రిజర్వ్ చేసుకున్న సీట్లో ఇంకొకరు ఎందుకు కూర్చున్నారు?’’ అడిగాడు ఆంజనేయ ప్రసాద్.‘‘విజయవాడలో మంచినీళ్ల కోసం దిగినప్పుడు ట్రైన్ మూవ్ అయిపోయింది. అక్కణ్నుంచి బై రోడ్ వచ్చాను. ఆ తర్వాత ఎవరు కూర్చున్నారో నాకు తెలీదు!’’‘‘వెల్ దెన్ మీరు విజయవాడలో ట్రైన్ దిగేముందు కంపార్ట్మెంట్లో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించారా?’’ అడిగాడు ఆంజనేయ ప్రసాద్. లేదన్నట్టు తలూపాడు పార్థు.ఆంజనేయ ప్రసాద్ ప్రశ్నల పరంపర కొనసాగుతూనే ఉంది. పార్థు తెలివిగా సమాధానాలు ఇస్తున్నాడు. దీనికి సంబంధించి మీకు ఏవైనా విషయాలు గుర్తొచ్చినా, తెలిసినా తనకు ఫోన్ చేసి చెప్పమంటూ ఆంజనేయ ప్రసాద్ కుర్చీలోంచి లేచాడు.‘‘నా దగ్గర మీ ఫోన్ నంబర్ లేదు’’ అన్నాడు పార్థు. ‘‘నో ప్రాబ్లమ్! నా కార్డు ఇస్తాను. మీకెప్పుడు గుర్తొస్తే అప్పుడు..’’ అంటూ విజిటింగ్ కార్డ్ చేతిలోకి తీసుకున్నాడు ఆంజనేయ ప్రసాద్.ఆయన టీమ్ అంతా ప్లాన్ ఫెయిలైందని నిరుత్సాహంగా నిలబడి చూస్తున్నారు.ఆ విజిటింగ్ కార్డు మీద పార్థు వేలి ముద్రలు ఉన్నాయి. కార్డుకు పౌడర్ అద్ది ఆంజనేయ ప్రసాద్ టీమ్ వేసిన ప్లాన్ అది.ఆంజనేయ ప్రసాద్ సహా టీమ్ అంతా అక్కణ్నుంచి వెళ్లిపోయారు. పార్థు తన చేతిలోని విజిటింగ్ కార్డుపై ఉన్న పౌడరును ఉఫ్ అని ఊది, ఆ కార్డును నలిపి పక్కనపడేశాడు. పార్థుగా ఆ ఇంటికి పరిచయమైన నందు.. తన స్టైల్లో!! -
ఉద్యమానికి తాత్కాలిక విరామం
-
ఉద్యమానికి తాత్కాలిక విరామం
29 నుంచి విధుల్లో చేరతామని తెలంగాణ న్యాయవాదుల ప్రకటన హైకోర్టు ఏర్పాటుపై ప్రధాని, సీజేఐ హామీని విశ్వసిస్తున్నట్టు వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు తెలంగాణ న్యాయవాదులు చేపట్టిన ఉద్యమానికి తాత్కాలికంగా విరామం ప్రకటించారు. హైకోర్టు ఏర్పాటు చేయడంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన హామీని, అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన హామీని విశ్వసించి ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ నెల 29న విధుల్లో చేరుతున్నామని తెలంగాణ న్యాయవాదులు మంగళవారం ఏపీ భవన్లో మీడియాకు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల ముగింపులోపు హైకోర్టు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. అప్పటికీ కాకుంటే మరోసారి ఉద్యమిస్తామని హెచ్చరించారు. హైకోర్టు విభజన కోరుతూ తెలంగాణ న్యాయవాదులు సోమవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మహాధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ సంఘాలు, టీఆర్ఎస్ ఎంపీలతో చర్చించిన తరువాత ఉద్యమానికి తాత్కాలిక విరామం ఇస్తున్నట్టు న్యాయవాదులు ప్రకటించారు. హైకోర్టు తప్పక ఏర్పాటవుతుంది: ఎంపీ సీతారాం నాయక్ ప్రత్యేక హైకోర్టు కోసం ఉద్యమించిన తెలంగాణ న్యాయవాదులు ప్రధాని మోదీ, సీజేఐ హామీలతో ఉద్యమాన్ని విరమించడం అభినందనీయమని ఎంపీ సీతారాం నాయక్ కొనియాడారు. హైకోర్టు ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, తెలంగాణ హైకోర్టు కచ్చితంగా ఏర్పాటవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై అన్ని రకాలుగా ఒత్తిడి తెస్తోందన్నారు. బంజారాల పెద్ద పండుగైన తీజ్‌ను ఢిల్లీలో జరపడానికి స్థానికంగా ఉంటున్న బంజారా సోదరులు డా.రవి, డా.ఆర్య ముందుకు రావడం ఆహ్వానించదగిందన్నారు. విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్, వరంగల్ జిల్లా పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు శ్రీధర్‌రావ్ తదితరులు పాల్గొన్నారు.