రాష్ట్రంలో పెత్తందారుల పాలన
రాష్ట్రంలో పెత్తందారుల పాలన
Published Sun, Sep 18 2016 7:30 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
యాదగిరిగుట్ట : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం దొరలు, పెత్తందార్లు, భూస్వాముల పాలన కొనసాగుతుందని టీడీపీ జాతీయ పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. శనివారం జాతీయ రహదారిపై జరిగిన లాఠీచార్జీలో గాయపడిన బాధితులను ఆయన ఆదివారం తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు బండ్రు శోభారాణితో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ గ్రామాన్ని నూతన మండలంలో కలుపవద్దంటూ న్యాయంగా ఉద్యమిస్తుంటే.. వారిపై కారణం లేకుండా పోలీసులు లాఠీలతో కొట్టడం దారుణమన్నారు. అమాయక, నిరుపేద ప్రజలపై ఇలాంటి లాఠీచార్జీ చేసిన ఎస్‌ఐని వెంటనే సస్పెండ్ చేశాయాలని పోలీస్ ఉన్నతాధికారులను కోరారు. ఈ సందర్భంగా గాయపడిన పలువురికి మోత్కుపల్లి చికిత్స కోసం ఆర్థిక సహాయం చేసి, భువనగిరి డీఎస్పీకి ఫోన్ ద్వారా జరిగిన సంఘటనపై మాట్లాడారు. బండ్రు శోభారాణి మాట్లాడుతూ, ఓ మహిళ ఎమ్మెల్యే నియోజకర్గంలో మహిళలకే రక్షణ లేకుండా పోయిందన్నారు. పరామార్శించిన వారిలో సర్పంచ్ నమిలే పాండు, ఉపసర్పంచ్ కట్ట మల్లేష్, టీడీపీ జిల్లా కార్యదర్శి పలెపాటి బాలయ్య, మండల అధ్యక్షుడు దడిగె ఇస్తారి, ఆయా పార్టీల నాయకులు బండపల్లి నాగరాజు, గంధమల్ల రవి, చంద సాయిబాబా, బీమగాని లలితా, ఎర్ర జహంగీర్, సుబ్బురు నర్సయ్య, సాగర్, బత్తిని చంద్రశేఖర్, బీమగాని స్వామి, తదితరులున్నారు.
Advertisement