రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంతరించిపోతోంది
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంతరించిపోతోంది
Published Sat, Oct 8 2016 12:08 AM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM
ఎమ్మెల్సీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి
కర్నూలు (ఓల్డ్‌సిటీ): రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంతరించిపోతోందని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి విమరి్శంచారు. శుక్రవారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అబద్ధాలు తప్ప మరొకటి మాట్లాడటం లేదని, ఉద్యమం చేస్తే పీడీ యాక్టు పెట్టాలని చెప్పడం అప్రజాస్వామికమన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని, ఉద్యోగం రాకపోతే రూ. 2000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన చంద్రబాబు ప్రస్తుతం వాటి ఊసే ఎత్తడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులను మోసం చేశారన్నారు. గ్లోబల్ ప్రచారం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఆయన మాటల్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. అనంతపురం జిల్లాలో పంట ఎండిపోయిన తర్వాత రైన్‌గన్లతో నీళ్లు చిలకరించి, రూ. 170 కోట్ల ప్రజాధనం వృథా చేశారని ఆరోపించారు. రైతుల భూములు లాక్కొని సింగపూర్‌లో బిజినెస్ చేస్తున్నారన్నారు. రాజధాని నిర్మాణానికి అనుకూలత, భద్రత కలిగిన భవనం ఉండాలే తప్ప 'అద్భుతమైన రాజధాని' అనడంలో అర్థం లేదన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు 10 నెలల పీఆర్‌సీ చెల్లించలేదన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ రద్దు చేసి పాత పెన్షన్‌నే కొనసాగించాలని కోరారు. తనపై నమ్మకంతోనే వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మెల్సీ అవకాశం కల్పించారన్నారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల పరిధిలోని పట్టభద్రులు, డిప్లొమా హోల్డర్లు నవంబరు 5వ తేదీ లోపు నమోదు చేయించుకోవాలని సూచించారు. వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య మాట్లాడుతూ ఓటర్లను చేర్పించుకునే బాధ్యత వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తీసుకోవాలని సూచించారు. మనమేంటో నిరూపించుకునేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలు తోడ్పడతాయన్నారు. జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ అందరు కలిసికట్టుగా రాజగోపాల్‌రెడ్డి గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Advertisement
Advertisement