దేశంలో ఎన్నికలు జరిగే సందర్భంలో పోటీ చేస్తున్న అభ్యర్థుల కన్నా వారి గుర్తులకు అత్యంత ప్రాధాన్యత ఉండటాన్ని మనం చూస్తుంటాం. అభ్యర్థులు కూడా ప్రచారంలో తమ ఎన్నికల గుర్తును చూపించి, దానికి ఓటు వేయాలని ఓటర్లను కోరుతుంటారు.
ఓటింగ్ సమయంలోనూ ఓటర్లు అభ్యర్థి పేరు కంటే వారి చిహ్నాన్ని గుర్తు పెట్టుకుంటారు. అన్ని పార్టీలకు ఎన్నికల గుర్తులు ఉంటాయి. ఆయా ఎన్నికల చిహ్నాలను ఏ రాష్ట్రంలోనూ ఏ ఇతర పార్టీకి లేదా స్వతంత్ర అభ్యర్థికి కేటాయించరు. ప్రాంతీయ పార్టీలకు కూడా వేర్వేరు ఎన్నికల గుర్తులు ఉంటాయి.
స్వతంత్ర అభ్యర్థులు పంచాయతీ ఎన్నికలు మొదలుకొని అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీకి దిగుతుంటారు. అలాంటి అభ్యర్థులకు కేటాయించేందుకు ఎన్నికల సంఘం 190 గుర్తులను ఖరారు చేసింది. నామినేషన్లు సమర్పించేటప్పుడు స్వతంత్ర అభ్యర్థులు కమిషన్ అందించిన జాబితాలోని ఏదో ఒక ఎన్నికల గుర్తును ఎంచుకుని దానిని అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. దీని ఆధారంగా స్వతంత్ర అభ్యర్థికి ఎన్నికల గుర్తును కమిషన్ కేటాయిస్తుంది.
దేశంలో ఆరు రాజకీయ పార్టీలు జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందాయి. వీటిలో ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి.
స్వతంత్ర అభ్యర్థుల కోసం ఎన్నికల సంఘం రూపొందించిన ఎన్నికల చిహ్నాలలో పురాతన కాలం నుండి ఆధునిక కాలం నాటి అంశాల వరకు ఉన్నాయి. వీటిలో ఆహారం, రవాణా, దినచర్యలో ఉపయోగించే వస్తువులు, పరికరాలు మొదలైనవి ఉన్నాయి. మొబైల్, మొబైల్ ఛార్జర్‌తో పాటు టెలిఫోన్ కూడా ఎన్నికల చిహ్నంగా ఉంది. స్లేట్, ల్యాప్‌టాప్ కూడా ఎన్నికల చిహ్నాల జాబితాలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment