కొత్తగా 5,833 స్టేషన్లు ఏర్పాటుకు ఎన్‌హెచ్‌ఏఐ ప్రణాళిక
ఏపీలో మొదటి దశలో 230 ఏర్పాటుకు నిర్ణయం
త్వరలో స్థలాల ఎంపిక
జాతీయ రహదారులను ఆనుకుని ఈవీ చార్జింగ్ స్టేషన్లు నెలకొల్పే ప్రణాళికను వేగవంతం చేయాలని జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ(ఎన్‌హెచ్‌ఏఐ) నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ‘ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్–2024’ కార్యక్రమం కింద వాటిని ఏర్పాటు చేయనుంది.
ఇందుకోసం దేశంలో విద్యుత్ వాహనాలను ప్రోత్సహించే దిశగా మౌలిక సదుపాయాల వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు పెట్రోలియం మంత్రిత్వ శాఖతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం రెండు పెట్రోలియం కంపెనీల భాగస్వామ్యంతో ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్న ప్రణాళికను ఆమోదించారు. – సాక్షి, అమరావతి
దేశంలో జాతీయ రహదారులను ఆనుకుని మొత్తం 7,432 ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. ఇందుకోసం భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీలతో కలసి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ పెట్రోలియం కంపెనీలకు రూ.800 కోట్లు సబ్సిడీగా ఇచ్చేందుకు ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదం తెలిపింది.
మొదటి దశలో 5,833 ఈవీ స్టేషన్లు ఏర్పాటుకు ఎన్‌హెచ్‌ఏఐ కార్యాచరణకు ఉపక్రమించింది. రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు.
ఎంపిక చేసిన జాతీయ రహదారులను ఆనుకుని ప్రతి 50 కి.మీ.కు ఒకటి చొప్పున ఈవీ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తారు.
వచ్చే ఏడాది జూన్ నాటికి ఈవీ స్టేషన్‌లను ఏర్పాటు చేయాలన్నదే లక్ష్యం.
దేశంలో ఏర్పాటు చేయనున్న మొత్తం ఈవీ చార్జింగ్ స్టేషన్లు 7,432
మొదటి దశలోఏర్పాటు చేయనున్న ఈవీ స్టేషన్లు 5,833
మన రాష్ట్రంలో మొదటి దశలో చెన్నై– కోల్‌కతా జాతీయ రహదారిలో ఏర్పాటు చేసే స్టేషన్లు 230
Comments
Please login to add a commentAdd a comment