టోల్ వసూళ్లకు బ్రేక్ | Centre Suspends Toll Collection on National Highways in Tamil Nadu | Sakshi
Sakshi News home page

టోల్ వసూళ్లకు బ్రేక్

Published Fri, Dec 4 2015 10:22 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 PM

టోల్ వసూళ్లకు బ్రేక్

టోల్ వసూళ్లకు బ్రేక్

న్యూఢిల్లీ: తమిళనాడులోని జాతీయ రహదారులన్నింటిపై ప్రవేశ రుసుము(టోల్‌ ఛార్జీలు) వసూలుకు ప్రస్తుతానికి విరామాన్ని ఇస్తున్నట్లు కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, నౌకాయాన మంత్రి నితిన్ గడ్కరీ ఓ ప్రకటన చేశారు.

తమిళనాడులో భారీ వర్షాలు, వరదల కారణంగా పరిస్థితులు దయనీయంగా మారిన విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ 11 వరకు తమిళనాడు రాష్ట్రంలోని జాతీయ రహదారులపై టోల్ పన్ను వసూలును తాత్కలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆదేశాలు వెలువడిన వెంటనే అమల్లోకి వచ్చాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement