ప్రమాదాల నివారణకు ఎక్స్ ప్రెస్ హైవేలు అవసరం: కేసీఆర్
హైదరాబాద్: జాతీయ రహదారులపై ప్రమాదాలను అరికట్టేందుకు ఎక్స్‌ప్రెస్ హైవేల ఏర్పాటుపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు(కేసీఆర్) దృష్టి సారించారు.
తెలంగాణలో రోడ్లు, భవనాల శాఖపై అధికారులతో కేసీఆర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నుంచి రామగుండం వరకు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ నుంచి అన్నిజాతీయ, రాష్ట్ర హైవేలకు అనుసంధానం చేసే విధంగా ఎక్స్‌ప్రెస్ హైవేల అవసరం ఉందని అధికారులతో కేసీఆర్ అన్నట్టు సమాచారం. జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు ఎక్స్‌ప్రెస్ హైవేలు ఎంతో అవసరమని అధికారులకు కేసీఆర్ సూచించారు.