
సాక్షి, హైదరాబాద్ : రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికిగాను అవసరమైన భూమిని సేకరించే గ్రామాల సంఖ్యలో స్పష్టత వచి్చంది. ఉత్తర భాగం పరిధిలో వంద మీటర్ల వెడల్పుతో 162.46 కి.మీ. మేర రింగురోడ్డు నిర్మించనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నిర్మించనున్న నాలుగు వరసల రోడ్డును భవిష్యత్తులో ఎనిమిది వరసలకు విస్తరించనున్నారు. ఎనిమిది వరసలు, స్తంభాలు, చెట్లు, ఇతర అవసరాలకు కావాల్సిన భూమిని ఇప్పుడే సేకరిస్తారు. ఇందుకు 4,638 హెక్టార్లు అవసరమవుతాయని అధికారులు లెక్క తేల్చారు.
తొలుత 4,200 హెక్టార్లు సరిపోతుందని భావించినా, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై ఇంటర్‌ఛేంజర్లను మరింత విశాలంగా నిర్మించాలని నిర్ణయించటంతో అదనంగా మరికొంత భూమిని సేకరిస్తున్నారు. ఇందుకు అదనపు గెజిట్ నోటిఫికేషన్లు కూడా విడుదల చేశారు. కానీ, గెజిట్‌లో మాత్రం 4,942 ఎకరాలు అవసరమవుతాయని ప్రాథమికంగా పేర్కొన్నారు.
భూసేకరణలో భాగంగా స్వల్ప మొత్తం భూమి పక్క గ్రామ సర్వే నంబర్ పరిధిలో ఉన్నా.. దాని వివరాలను కూడా గెజిట్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. సర్వే నంబర్లవారీగా భూమి వివరాల నమోదుకు సమయం పట్టనున్నందున, ప్రాథమికంగా అలైన్‌మెంట్‌కు రెండువైపులా అర కి.మీ. పరిధిలోని 122 గ్రామాలను తొలుత గుర్తించారు. ఇప్పుడు స్పష్టంగా వివరాలు నమోదు చేయటంతో గ్రామాల సంఖ్య 84కు పరిమితమైంది.
3ఏ, 3 ఏ (క్యాపిటల్) గెజిట్ నోటిఫికేషన్లు
ఇప్పటికి 3ఏ, 3 ఏ (క్యాపిటల్) గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. సేకరించే భూమికి రూ.5,200 కోట్ల పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని ఇటీవలే బడ్జెట్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇందులో సగ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. భూసేకరణ ప్రక్రియ మొదలవుతున్నందున ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సిందిగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆయా ఆర్డీవోల పరిధిలో భూమిని సేకరించే గ్రామాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
గ్రామాల వివరాలు ఇవే...
ఆర్టీవో సంగారెడ్డి: మల్కాపూర్, గిర్మాపూర్, పెద్దాపూర్, నాగపూర్, ఇరిగిపల్లె, చింతపల్లి, కలబ్‌గూర్, సంగారెడ్డి, తాడ్లపల్లి, కులబ్‌గూర్, కాసాల, దేవల్‌పల్లె, సికిందర్‌పూర్, దౌల్తాబాద్ కొత్తపేట
ఆర్టీవో ఆందోల్–జోగిపేట: శివంపేట, వెండికోల్, అంగడి కిష్టాపూర్, లింగంపల్లె, కోర్పోల్
ఆర్డీవో నర్సాపూర్: నాగులపల్లె, మూసాపేట్, జానకంపేట, పెద్దచింతకుంట, రెడ్డిపల్లి, చిన్న చింతకుంట, ఖాజీపేట్, తిర్మల్‌పూర్, తుజల్‌పూర్, లింగోజిగూడ, కొత్తపేట, రత్నాపూర్, పాంబండ, ఉసిరికపల్లె, పోతులబోగూడ, గుండ్లపల్లి, కొంతాన్‌పల్లె
ఆర్డీవో తూప్రాన్: వట్టూరు, నాగులపల్లె, ఇస్లాంపూర్, దాతర్‌పల్లె, గుండారెడ్డిపల్లె, కిష్టాపూర్, వెంటకాయపల్లె, నర్సంపల్లె.
ఆర్డీవో గజ్వేల్: బేగంపేట, యాల్కల్, బంగ్లా వెంకటాపూర్, నెమ్టూరు, మఖత్ మాసాన్‌పల్లె, జబ్బాపూర్, మైలారం మక్తా, సంగాపూర్, ముట్రాజ్‌పల్లె, ప్రజ్ఞాపూర్, పాములపర్తి, చేబర్తి, అంగడి కిష్టాపూర్, ఎర్రవల్లి, అల్రాజ్‌పేట, ఇటిక్యాల, పీర్లపల్లె.
యాదాద్రి–భువనగిరి అదనపు కలెక్టర్: వీరారెడ్డిపల్లె, కోనాపురం, ఇబ్రహీంపూర్, దత్తాయపల్లె, వేల్పుపల్లె, మల్లాపూర్, దత్తార్‌పల్లె.
ఆర్టీవో భువనగిరి: రాయగిరి, కేసారం, పెంచికల్‌పహాడ్, తుక్కాపూర్, గౌస్‌నగర్, ఎర్రంబల్లె
ఆర్డీవో చౌటుప్పల్: పహిల్వాన్‌పూర్, రెడ్లరాపాక, పొద్దటూరు, వెర్కట్‌పల్లె, గోకారం, నేలపట్ల, చిన్నకొండూరు, తలసింగారం, చౌటుప్పల్, లింగోజిగూడ.
Comments
Please login to add a commentAdd a comment