ప్రణబ్‌ ఎఫెక్ట్‌ : ఆరెస్సెస్‌కు పోటెత్తాయ్! | Applications For RSS Membership See Huge Spike After Pranab Speech | Sakshi
Sakshi News home page

ప్రణబ్‌ ఎఫెక్ట్‌ : ఆరెస్సెస్‌కు పోటెత్తిన దరఖాస్తులు

Published Tue, Jun 26 2018 3:32 PM | Last Updated on Tue, Jun 26 2018 6:23 PM

Applications For RSS Membership See Huge Spike After Pranab Speech - Sakshi

మోహన్‌ భాగవత్‌, ప్రణబ్‌ ముఖర్జీ (పాత ఫొటో)

నాగ్‌పూర్‌ : రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌)లో సభ్యత్వానికి దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రసంగం అనంతరం ఆరెస్సెస్‌ సభ్యత్వానికి దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య మూడింతలు పెరిగింది. అత్యధిక దరఖాస్తులు పశ్చిమ బెంగాల్‌ నుంచి వస్తున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 7వ తేదీన ఆరెస్సెస్‌ కార్యక్రమానికి హాజరైన ప్రణబ్‌, శిక్షణ పూర్తి చేసుకున్న వారిని ఉద్దేశించి ప్రసగించిన విషయం తెలిసిందే.

ఈ నెల 1వ తేదీ నుంచి 6వ తేదీల మధ్య సభ్యత్వం కోసం రోజుకు 378 దరఖాస్తులు రాగా, 7వ తేదీ నుంచి రోజుకు 1,779 దరఖాస్తులు వస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రణబ్‌ ప్రసంగాన్ని వ్యతిరేకించిన వారికి ఆరెస్సెస్‌ సంయుక్త కార్యదర్శి వైద్య ధన్యవాదాలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement