రిజర్వేషన్ విధానాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని.. రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించాలని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్‌భగవత్ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: రిజర్వేషన్ విధానాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని.. రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించాలని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్‌భగవత్ పేర్కొన్నారు.
రిజర్వేషన్లు ఎవరికి అవసరం.. ఎంత కాలం అవసరం అనేది పరిశీలించటానికి రాజకీయాలకు సంబంధం లేని కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన ఆర్‌ఎస్‌ఎస్ అధికారిక పత్రికలు ఆర్గనైజర్, పాంచజన్యలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో సూచించారు. కోటా కోసం గుజరాత్‌లో పటేళ్ల ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో భగవత్ ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.