
భగవత్‌కు మమత ఝలక్
కోల్‌కతా: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్‌కు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి ఝలక్ ఇచ్చారు. ఆయన కార్యక్రమం కోసం చేసుకున్న ఆడిటోరియం బుకింగ్‌ను రద్దు చేశారు. అక్టోబర్‌లో జరగనున్న కార్యక్రమం కోసం కోల్‌కతాలోని ప్రఖ్యాత మహజాతి సాదన్ ఆడిటోరియంను ఆర్‌ఎస్‌ఎస్ బుక్ చేసుకుంది. మోహన్ భగవత్ ఈ కార్యక్రమంలో ప్రసంగించాల్సివుంది. అయితే బుకింగ్‌ను రద్దు చేసినట్టు నిర్వాహకులకు ప్రభుత్వ వర్గాలు మౌఖికంగా తెలిపాయి. బెంగాల్ ప్రభుత్వ ఆధీనంలోని ఆడిటోరియంను ఆర్‌ఎస్‌ఎస్ ఇవ్వడం సీఎం మమతా బెనర్జీకి ఇష్టం లేదన్న ప్రచారం జరుగుతోంది.
కాగా, ఈ ఏడాది జనవరిలో కోల్‌కతా ర్యాలీలో పాల్గొనేందుకు మోహన్ భగవత్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. కలకత్తా హైకోర్టు జోక్యంతో ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. 2014లో విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) ర్యాలీకి కూడా మమత సర్కారు అనుమతి ఇవ్వలేదు.