ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భాగవత్‌స్పష్టీకరణ
రిజర్వేషన్లకు తాము తొలి నుంచీ అనుకూలంగా ఉన్నట్లు వెల్లడి
చినజీయర్ స్వామితో కలసి విద్యాభారతి విజ్ఞాన కేంద్ర పాఠశాల ప్రారంభం
బడంగ్‌పేట్: సమాజంలో అసమానతలు ఉన్నంతకాలం రిజర్వేషన్లు యథావిధిగా ఉంటాయని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. మొదటి నుంచీ రిజర్వేషన్లకు సంఘ్ అనుకూలంగా ఉందని వెల్లడించారు. తమ సంస్థ రిజర్వేషన్లకు వ్యతిరేకమంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని... అందులో ఏమాత్రం వాస్తవం లేదని ప్రకటించారు. తాను ఓ సమావేశంలో ఆ వ్యాఖ్యలు చేసినట్లు వీడియోను ప్రచారం చేస్తున్నారని.. కానీ అసలు అలాంటి సమావేశం ఏదీ జరగలేదని వివరించారు.
ప్రస్తుతమున్న సాంకేతికత, కృత్రిమ మేథ (ఏఐ) ద్వారా జరగని దాన్ని కూడా జరిగినట్లు చూపించడం సాధమవుతోందని వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్‌గుల్‌లో ఏర్పాటు చేసిన విద్యాభారతి విజ్ఞాన కేంద్ర పాఠశాల (సరస్వతి విద్యాపీఠం అనుబంధ సంస్థ)ను ఆదివారం ఆయన చినజీయర్ స్వామితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మాట్లాడారు. ప్రపంచాన్ని తెలుసుకొనే మార్గంగా విద్యను ఆయన అభివరి్ణంచారు.
1952లో సరస్వతీ శిశుమందిర్ చిన్న గదిలో ప్రారంభమైందని.. నేడు దేశవ్యాప్తంగా వేలాది పాఠ శాలలు నడుస్తున్నాయని చెప్పా రు. దేశభక్తి విలువలతో కూడిన విద్యకు తాము పెద్దపీట వేస్తున్నామన్నారు. మనమంతా రాముడి బాటలో నడవాలన్నారు. సోషల్ మీడియాను మంచి కోసం ఉపయోగించాలని సూచించారు. స్వయం సేవక్‌లు చివరి శ్వాస దాకా సమాజం కోసం పనిచేస్తారని మోహన్ భాగవత్ తెలిపారు.
మోదీ కృషి అభినందనీయం: చినజీయర్
దేశం సమస్యల్లో ఉన్నప్పుడు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారని చినజియర్ స్వామి కొనియాడారు. భారత్‌ను విశ్వగురువుగా మార్చేందుకు ఆయన ఎనలేని కృషి చేస్తున్నారని ప్రశంసించారు. తాను రాజకీయ నాయకుడిని కాదని.. కేవలం భారతీయుడిగా తన వాదన వినిపిస్తున్నానని చెప్పారు. విద్య అనేది పొట్టకూటి కోసం కాదని.. సక్రమమైన పౌరులుగా తయారయ్యేందుకేనని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్, క్షేత్ర ప్రచారక్ సు«దీర్, సహ ప్రచారక్ భరత్, ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్, విద్యాభారతి క్షేత్ర అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, సంఘటన కార్యదర్శి లింగం సు«ధాకర్‌రెడ్డి, శ్రీనివాస్, రమే‹Ùగుప్తా, విష్ణువర్దన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment