ముంబై: పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ సర్కార్‌ను గద్దెదించి బీజేపీ జెండాను ఎగురువేయాలని ఆ పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తిని మంగళవారం ముంబైలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మోహన్ భాగవత్, మిథున్‌ను కలిసినట్లు చర్చ జరుగుతోంది. దీంతో మిథున్ చక్రవర్తి బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బెంగాల్‌కు చెందిన సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తికి పెద్ద సంఖ్యలో అభిమానులు, పాపులారిటీ ఉన్న విషయం తెలిసిందే. తృణముల్ కాంగ్రెస్ పార్టీలో మిథున్ చాలా కాలం పని చేసి ఆనారోగ్య కారణాల వల్ల ఆ పార్టీకి 2016లో రాజీనామా చేశారు. ఆయన తృణముల్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆయన తన పదవికి 20 నెలల తర్వాత రాజీనామా చేయడం గమనార్హం. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment