16 ఏళ్ల వ్రతాన్ని వదిలేసిన ఆమిర్ ఖాన్ | aamir khan attends award function after 16 years | Sakshi
Sakshi News home page

16 ఏళ్ల వ్రతాన్ని వదిలేసిన ఆమిర్ ఖాన్

Published Tue, Apr 25 2017 12:15 PM | Last Updated on Tue, Sep 5 2017 9:40 AM

16 ఏళ్ల వ్రతాన్ని వదిలేసిన ఆమిర్ ఖాన్

16 ఏళ్ల వ్రతాన్ని వదిలేసిన ఆమిర్ ఖాన్

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ 16 ఏళ్లుగా తాను పెట్టుకున్న వ్రతాన్ని వదిలేశారు. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఆయన అవార్డుల కార్యక్రమాలకు వేటికీ వెళ్లలేదు. ఇన్నేళ్ల తర్వాత తొలిసారి ఒక అవార్డు అందుకున్న మిస్టర్ పెర్ఫెక్షనిస్టు.. దాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేతుల మీదుగా అందుకోవడం మరో విశేషం. తన తండ్రి మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ 75వ వర్ధంతిని పురస్కరించుకుని ఇచ్చే అవార్డుల కార్యక్రమానికి రావాల్సిందిగా ఆమిర్‌ను స్వయంగా నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ ఆహ్వానించారు.

లతాజీ ఆహ్వానాన్ని కాదనలేని ఆమిర్.. ఈ కార్యక్రమానికి వచ్చి అవార్డు తీసుకున్నాడు. దంగల్ సినిమాలో అద్భుతమైన పెర్ఫార్మెన్సుకు గాను ఆమిర్‌కు విశేష పురస్కారం ఇచ్చారు. ఇంతకుముందు లగాన్ సినిమా ఆస్కార్ అవార్డులలో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో నామినేట్ అయినప్పుడు ఆ కార్యక్రమానికి వెళ్లిన ఆమిర్.. ఆ తర్వాత ఇప్పటివరకు ఏ అవార్డు ఫంక్షన్‌కూ హాజరు కాలేదు. ప్రస్తుతం 'సీక్రెట్ సూపర్‌స్టార్', 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' సినిమాలలో ఆమిర్ నటిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement