'ఇండియాలో పుట్టినవారికి ఇద్దరు తల్లులు'
'భారత్ మాతాకీ జై' నినాదం గురించి దేశవ్యాప్తంగా విపరీతమైన చర్చోపచర్చలు, వివాదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. దాని గురించి చెప్పిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా మరో విషయం చెప్పారు. భారతదేశంలో పుట్టిన వాళ్లకు ఇద్దరు తల్లులు ఉంటారని, ఒకరు కన్న తల్లి కాగా మరొకరు భారత మాత అని ఆయన అన్నారు.
ఉజ్జయినిలో క్షిప్ర నది ఒడ్డున జరుగుతున్న సింహస్త కుంభమేళాలో భాగంగా గురువారం ప్రారంభమైన మూడు రోజుల 'విచార్ మహాకుంభ్' సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ జీవించడానికి వస్తున్న ప్రతి ఒక్కరినీ భారతమాత తన ఒడిలోకి తీసుకుందని మోహన్ భగవత్ అన్నారు. ఈ సదస్సులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా పాల్గొన్నారు.