మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
నాగపూర్ : విజయదశమి పర్వదినం సందర్భంగా ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దాద్రి లాంటి ఉదంతాల వల్ల దేశసంస్కృతి,సంప్రదాయాలకు వచ్చే నష్టమేమీ ఉండదంటూ వ్యాఖ్యానించారు. ఇది చాలా చిన్న విషయమని ఆయన కొట్టిపారేశారు. (ప్రసంగం పూర్తి పాఠానికి ఇక్కడ క్లిక్ చేయండి)
నాగపూర్ లో గురువారం జరిగిన దసరా ఉత్సవాల్లో మోహన్ భగవత్ ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత అభివృద్ధితో పాటు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. తన ప్రసంగంలో పలు అంశాలను ఉటంకించిన ఆయన దేశంలో చెలరేగిన మతఘర్షణలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాద్రి లాంటి ఘటనలు చాలా చిన్నవనీ, అలాంటి వాటి వల్ల దేశ ప్రతిష్టకు వచ్చే నష్టమేమీ ఉండదంటూ ఆవేశంగా ప్రసంగించారు. దీనిమూలంగా దేశసంస్కృతికి జరిగే అనర్థమేమీ ఉండదన్నారు. పొరుగు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మోహన్ భగవత్తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, డీఆర్డీఓ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ షరావత్ తదితులు పాల్గొన్నారు.