'రామమందిర నిర్మాణం ఎప్పుడో చెప్పండి' | Shiv Sena asks Bhagwat to announce date of Ram temple construction | Sakshi
Sakshi News home page

'రామమందిర నిర్మాణం ఎప్పుడో చెప్పండి'

Published Sat, Dec 5 2015 2:05 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

'రామమందిర నిర్మాణం ఎప్పుడో చెప్పండి' - Sakshi

'రామమందిర నిర్మాణం ఎప్పుడో చెప్పండి'

ముంబై: ఆయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎప్పుడు ప్రారంభిస్తారో ఒక తేదీని ప్రకటించాలని ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ను శివసేన కోరింది. రామ మందిరాన్ని తాను బతికుంగానే నిర్మిస్తామని మోహన్ భగవత్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో శివసేన అధికార పత్రిక సామ్నాలో శనివారం ఈ అంశంపై సంపాదకీయం రాసింది. 'మోహన్ భగవత్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం. అయితే నిర్మాణం ఎప్పుడు ప్రారంభిస్తారో ఒక తేదీని ప్రకటించాలి. ఒక సారి నిర్మించిన తరువాత దాన్ని మళ్లీ నిర్మించాల్సిన అవసరం ఉండదు' అని పేర్కొంది.

'ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రామాలయాన్ని నిర్మించే దైర్యం ఉంది. ఈ విషయంలో బాధ్యత తీసుకున్నప్పుడే ఆయన ప్రతిష్ట మరింత పెరుగుతుంది' అని శివసేన పేర్కొది. ఒకవేళ ఇప్పుడు నిర్మించకపోతే ఇంకెప్పుడూ ఆలయాన్ని నిర్మించలేరని, ఈ అంశానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని, దీనిని సాగదీయటం సబబు కాదని శివసేన అభిప్రాయపడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement