బీజేపీ నేత గిరిరాజ్ లొంగుబాటు, బెయిల్ మంజూరు
బీజేపీ నేత గిరిరాజ్ లొంగుబాటు, బెయిల్ మంజూరు
Published Tue, May 6 2014 3:14 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
పాట్నా: బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ బీహార్ జుడిషియల్ మేజిస్టేట్ర్ కోర్టు మంగళవారం లొంగిపోయారు. లోకసభ ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన గిరిరాజ్ సింగ్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
లొంగిపోయిన గిరిరాజ్ కు బీహార్ కోర్టు బెయిల్ మంజూరు చేశారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఈకేసులో గిరిరాజ్ కు కొంత ఊరట లభించిందని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీ మద్దతుదారుడైన గిరిరాజ్ బీహార్ లోని నవాడా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని వ్యతిరేకించే వారు పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలంటూ జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ బీహార్ నేత, నవాడా లోక్‌సభ అభ్యర్థి గిరిరాజ్‌సింగ్‌పై ఎన్నికల కమిషన్ కొరడా ఝళిపించిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement