బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ కు అరెస్ట్ వారెంట్! | Arrest warrant issued against BJP leader Giriraj Singh | Sakshi
Sakshi News home page

బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ కు అరెస్ట్ వారెంట్!

Published Wed, Apr 23 2014 1:05 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ కు అరెస్ట్ వారెంట్! - Sakshi

బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ కు అరెస్ట్ వారెంట్!

రాంచీ: ఎన్నికల ప్రచారంలో వివాదస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ కు బొకారో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గిరిరాజ్ అరెస్ట్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ కు బొకారో సబ్ డివిజనల్ జుడీషియల్ కోర్టు మేజిస్ట్రేట్ అమిత్ శేఖర్ స్పందించి అరెస్ట్ కు ఆదేశించారు. జార్ఖండ్ లో గిరిరాజ్ కు వ్యతిరేకంగా రెండు ఎఫ్ఐఆర్ లు దాఖలు చేశారు. తొలుత బొకారో, ఆతర్వాత దియోఘర్ జిల్లాలో కేసు నమోదు చేశారు. 
 
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని వ్యతిరేకించే వారు పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలంటూ జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ బీహార్ నేత, నవాడా లోక్‌సభ అభ్యర్థి గిరిరాజ్‌సింగ్‌పై ఎన్నికల కమిషన్ కొరడా ఝళిపించిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement