గిరిరాజ్ చికిత్సకు ఖర్చు భరిస్తాను | i will bare giriraj medical bill | Sakshi
Sakshi News home page

గిరిరాజ్ చికిత్సకు ఖర్చు భరిస్తాను

Published Sat, Apr 4 2015 1:21 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

గిరిరాజ్ చికిత్సకు ఖర్చు భరిస్తాను - Sakshi

గిరిరాజ్ చికిత్సకు ఖర్చు భరిస్తాను

పట్నా: కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మానసిక వ్యాధితో బాధపడుతున్నందునే సోనియా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేత రాజ్‌బబ్బర్ అన్నారు. మంత్రి అనారోగ్యాన్ని ప్రభుత్వం నయం చేయించకపోతే రాంచీ, ఆగ్రా, నాగ పూర్‌లలోని ఏ మెంటల్ హాస్పిటల్‌లోనైనా చికిత్సకయ్యే ఖర్చు మొత్తం భరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని శుక్రవారమిక్కడ చెప్పారు.  గిరిరాజ్  వంటి వ్యక్తులతో సమాజానికి ప్రమాదమని, బాధ్యతాయుత పదవిలో ఆయన ఇంకా కొనసాగడం ఆశ్చర్యంగా ఉందని సినీనటుడినుంచి రాజకీయనాయకుడిగా మారిన బబ్బర్ వ్యాఖ్యానించారు. సోనియాపై మంత్రి చేసిన వ్యాఖ్యలు సూర్యునిపై ఉమ్మే  ప్రయత్నం లాంటివన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement