
ఆఫ్ ద రికార్డ్ గా అంటే...
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు సోనియా, రాహుల్ ను బాధపెట్టివుంటే అందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు.
సోనియా గాంధీని కాకుండా రాజీవ్ గాంధీ నైజీరియా మహిళను వివాహం చేసుకునివుంటే.. నలుపు రంగు మహిళ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అంగీకరించేదా? అని గిరిరాజ్ సింగ్ అన్నారు. అయితే తాను ఆఫ్ ద రికార్డ్ గా అన్నమాటలపై వివాదం చేయడం తగదని ఆయన అన్నారు. గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలు దురదృష్టకరమని నైజీరియా రాయబారి పేర్కొన్నారు.