గిరిరాజ్‌ను బర్తరఫ్ చేయండి: కాంగ్రెస్ | giriraj should be detained from union cabinet says congress party | Sakshi
Sakshi News home page

గిరిరాజ్‌ను బర్తరఫ్ చేయండి: కాంగ్రెస్

Published Thu, Apr 2 2015 4:37 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

తమ అధినేతను కించపరచిన కేంద్ర మంత్రి గిరిరాజ్ దేశానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, ఆయన్ను వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్.. ప్రధాని మోదీని డిమాండ్ చేసింది.

తమ అధినేతను కించపరచిన కేంద్ర మంత్రి గిరిరాజ్ దేశానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, ఆయన్ను వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్.. ప్రధాని మోదీని డిమాండ్ చేసింది.  పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, మల్లికార్జున్ ఖర్గే, మనీష్ తివారీలు సింగ్ మాటలు బీజేపీకి సిగ్గుచేటుగా అభివర్ణించారు.

 

సీపీఎం నేత బృందాకారత్ మాట్లాడుతూ ప్రధాని ఈ వ్యవహారంలో ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. ఆయన నాయకత్వం లో ఇలాంటి నాయకులుండటం దారుణమని వ్యాఖ్యానించారు. బీజేపీ నేత కిరణ్‌బేడీ కూడా గిరిరాజ్ వ్యాఖ్యలను ఖండించారు. గిరిరాజ్ వ్యాఖ్యలు ఆయనలోని స్త్రీద్వేషాన్ని, పూర్వకాలపు భావజాలాన్ని వ్యక్తం చేస్తున్నాయని అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం నేత కవితాకృష్ణన్ అన్నారు. కాగా మంత్రి గిరిరాజ్ ముఖానికి నల్లరంగు వేసి, చేతులకు గాజులు తొడిగి బొట్టుపెట్టి ఊరేగించాలని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement